Home
News

రోజువారీ అధిక డేటా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ అందించే రీఛార్జ్‌ ప్లాన్‌ కోసం చూస్తున్నారా..?

భారత్‌ టెలికాం రంగంలో యూజర్ల పరంగా రెండో స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్ నెలవారీగా కొత్త యూజర్లను సంపాదించుకుంది. ఇటీవల TRAI (టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఈ సంవత్సరం ఆగస్టు నెలలో మొబైల్‌ యూజర్ల వివరాలను వెల్లడించింది. ఈ వివరాల ఆధారంగా ఆగస్టు నెలలో సుమారుగా 4.96 లక్షల మంది ఎయిర్‌టెల్‌ లో చేరారు. అయితే భారీగా ఉన్న యూజర్ల కోసం అనేక ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్‌లను తీసుకొస్తోంది.

ఇందులో భాగంగా ఎయిర్‌టెల్‌ (Airtel) 3GB డేటాతో ఓటీటీ ప్రయోజనాలను అందిస్తూ కొన్ని ప్లాన్‌లను తీసుకొచ్చింది. అధికంగా డేటా అవసరాలతోపాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ కావాలని భావిస్తున్న వారికి ఈ ప్లాన్‌లు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం ఇందులో రూ.838, రూ.1798, రూ.449 వంటి ప్లాన్‌లు ఉన్నాయి.

Airtel Rs838 Prepaid Recharge Plan telugu news

* ఎయిర్‌టెల్ రూ.838 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా ఎయిర్‌టెల్‌ యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ను పొందుతారు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను పొందవచ్చు. డేటా పరంగా ప్రతిరోజు 3GB డేటాను వినియోగించుకోవచ్చు. 5G నెట్‌వర్క్‌, 5G స్మార్ట్‌ఫోన్‌ కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను పొందవచ్చు.

దీంతోపాటు ఈ ప్లాన్‌లో అమెజాన్ ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ కూడా పొందవచ్చు. దీంతోపాటు ఎయిర్‌టెల్‌ Xstream ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో హలోట్యూన్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. మరియు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI మోడల్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంటుంది. రోజువారీ ఎక్కువ డేటాతోపాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ వంటి ప్రయోజనాలను కోసం ఈ రీఛార్జ్‌ ప్లాన్‌లను ఎయిర్‌టెల్‌ యూజర్లు ఎంచుకోవచ్చు.

Airtel Rs838 Prepaid Recharge Plan telugu news

* రూ.1798 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్‌ యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. డేటా పరంగా రోజువారీ 3GB 4G డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో భాగంగా 5G నెట్‌వర్క్‌, 5G స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ ప్లాన్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. వీటితోపాటు పెర్‌ఫ్లిక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

ఎయిర్‌టెల్‌ యూజర్లు హలోట్యూన్స్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అధిక డేటా అవసరాలతోపాటు నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్ కావాలని భావించే ఎయిర్‌టెల్ యూజర్లు ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

* రూ.449 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. డేటా పరంగా రోజువారీ ఏకంగా 4GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

ఈ ప్లాన్‌లో జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మరియు గూగుల్‌ వన్‌ ద్వారా 30GB స్టోరేజీని ఉపయోగించుకోవచ్చు. ఎయిర్‌టెల్‌ Xstream ప్లే ప్రీమియం, ఆపిల్ మ్యూజిక్‌ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. ఉచిత హలోట్యూన్స్‌, పెర్‌ఫ్లెక్సిటి ప్రో ఏఐ మోడల్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel Rs838 Prepaid Recharge Plan Offers 3GB Daily Data and OTT subscriptions
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X