Home
News

అధికంగా డేటాను ఉపయోగిస్తుంటారా.. అయితే రోజువారీ 3GB డేటాను అందించే ప్లాన్‌లు ఇవిగో..!

ఎయిర్‌టెల్‌ తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం ప్రస్తుతం అనేక రీఛార్జ్‌ ప్లాన్లను అందిస్తోంది. యూజర్ల కాలింగ్‌, డేటా, SMS లతోపాటు ఓటీటీ అవసరాలకు అనుగుణంగా అనేక ప్లాన్‌ ను తీసుకొచ్చింది. అయితే అధికంగా డేటాను ఉపయోగించే యూజర్ల కోసం రోజువారీ 3GB డేటాను ( Airtel 3GB Data Plans ) అందించే ప్లాన్‌ లను కూడా కలిగి ఉంది. దీంతోపాటు మొత్తంగా 3GB డేటాను అందించే మరో రీఛార్జ్‌ ప్లాన్‌ కూడా ఉంది. ఈ ప్లాన్‌ల పూర్తి ప్రయోజనాల వివరాలు.

* ఎయిర్‌టెల్‌ రూ.838 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌ లో ( Airtel Rs838 Recharge Plan ) భాగంగా ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్‌ యూజర్లు అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్‌ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ప్రతి రోజు 3GB డేటాను ఉపయోగించుకోవచ్చు.

Airtel Rs838  Rs1798 Prepaid Recharge plans

దీంతోపాటు 5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్‌ ను కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ లో భాగంగా అమెజాన్ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను పొందవచ్చు. దీంతోపాటు ఎయిర్‌టెల్‌ Xstream ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ను కూడా పొందవచ్చు. ఇందులో 20 కి పైగా ఓటీటీలు ఉంటాయి.

దీంతోపాటు ఎయిర్‌టెల్ యూజర్లు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ మోడల్‌ వార్షిక ప్లాన్ ధర రూ.17 వేలుగా ఉంటుందని ఎయిర్‌టెల్‌ తెలిపింది. అయితే యూజర్లు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. హలోట్యూన్స్‌ ను కూడా ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంటుంది.

* ఎయిర్‌టెల్ రూ.1798 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌ లో భాగంగా ఎయిర్‌టెల్‌ యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, STD కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 3GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.

దీంతోపాటు ఈ ప్లాన్‌ లో ( Airtel Rs1798 Recharge Plan ) 5G నెట్‌వర్క్‌, 5G స్మార్ట్‌ఫోన్‌ కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను పొందవచ్చు. పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. హలోట్యూన్స్‌ ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.

* ఎయిర్‌టెల్‌ రూ.219 రీఛార్జ్ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌ లో రోజువారీ డేటాను పొందలేకపోయినా, మొత్తం వ్యాలిడిటీలో 3GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్‌, STD కాల్స్‌ చేసుకోవచ్చు. దీంతోపాటు మొత్తంగా 300 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.

ఈ ప్లాన్‌ లో ( Airtel Rs219 Recharge Plan ) పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు హలోట్యూన్స్‌ ను కూడా ఉచితంగా పొందవచ్చు. స్పామ్‌ నుంచి రక్షణ పొందేలా ప్రత్యేక ఫీచర్‌ ను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Airtel Rs838, Rs1798 Prepaid Recharge plans Offers Daily 3GB Data, unlimited calling
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X