Home
News

మార్కెట్లోకి ఎయిర్‌టెల్ కొత్త అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్

దేశీయ టెలికాం రంగంలో వోడాఫోన్ మరియు జియో ఎయిర్‌టెల్ తో ఢీ అంటే ఢీ అంటున్నాయి .ఇందులో భాగంగా ఇతర టెలికాం దిగ్గజాలను ఎదుర్కోవడానికి దిగ్గజ టెలికామ్ సంస్థ ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రవేశపెట్టింది

By Anil

దేశీయ టెలికాం రంగంలో వోడాఫోన్ మరియు జియో ఎయిర్‌టెల్ తో ఢీ అంటే ఢీ అంటున్నాయి .ఇందులో భాగంగా ఇతర టెలికాం దిగ్గజాలను ఎదుర్కోవడానికి దిగ్గజ టెలికామ్ సంస్థ ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. రూ.299 అనే కొత్త ప్లానును ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తీసుకున్న వినియోగదారులకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు దీనితో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.అయితే ఈ రూ.299 ప్లాన్ కాలపరిమితి 45 రోజులు మాత్రమే.

టెలికాం రిపోర్ట్:

టెలికాం రిపోర్ట్:

టెలికాం రిపోర్ట్ ప్రకారం, ఎయిర్టెల్ తన వినియోగదారులకు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు మరియు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తున్నాయి . ఎయిర్టెల్ వినియోగదారులు ఇప్పుడు FUP పరిమితిని కలిగి లేనందున రోజువారీ వాయిస్ కాల్స్ పరిమితి గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

 

 

 ప్రధాన సమస్య :

ప్రధాన సమస్య :

ఈ రూ.299 ప్లాన్ తో వచ్చిన ప్రధాన సమస్య ఏమిటంటే ఇందులో ఎటువంటి డేటా ఆఫర్ ఉండదు ఇది కేవలం అపరిమిత వాయిస్ కాల్స్ చేయడనికి మాత్రమే ఉపయోగపడుతుంది.

రూ. 249,రూ. 349 :

రూ. 249,రూ. 349 :

ఈ రూ. 249,రూ. 349 ప్లాన్లలో ఎయిర్టెల్ అన్ లిమిటెడ్ డేటాను అందిస్తుంది డేటా తో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు మరియు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ల కాలపరిమితి 30 రోజులు మాత్రమే. కాగా రూ.299 ప్లాన్ కాలపరిమితి 45 రోజులు.

ఎయిర్టెల్ రూ. 1,199 పోస్ట్ పెయిడ్ ప్లాన్ :

ఎయిర్టెల్ రూ. 1,199 పోస్ట్ పెయిడ్ ప్లాన్ :

టెలికామ్ దిగ్గజం ఎయిర్టెల్ తన రూ. 1,199 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ను అప్ గ్రేడ్ చేసింది. అప్ గ్రేడిషన్ తరువాత ఈ రూ. 1,199 ప్లాన్ లో చందాదారుడు 120 జీబీ డేటా లభించబోతున్నాడు . గతంలో ఈ ప్లాన్ లో 90 జీబీ డేటా మాత్రమే లభించేది.

ఎయిర్టెల్ vs వోడాఫోన్

ఎయిర్టెల్ vs వోడాఫోన్

ఎయిర్టెల్ ఈ రూ. 1,199 ప్లాన్ ను తన ప్రత్యర్థి అయిన వోడాఫోన్ ను దెబ్బ తీయడానికే అప్ గ్రేడ్ చేసింది. కాగా ఎయిర్టెల్ తన రూ . 499 ప్లాన్ ను కూడా అప్ డేట్ చేసింది. ఈ ఆఫర్ లో భాగంగా 75 జీబీ డేటా ను అందిస్తుంది. గతం లో రూ . 499 ప్లాన్ తో 40 జీబీ డేటా మాత్రమే లభించేది.దీంతో పాటు డేటా రోల్ ఓవర్ మరియు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ,wynk టీవీ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel's new Rs 299 plan offers unlimited calling.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X