ఇప్పుడు ఎయిర్‌టెల్ టీవీ ప్రసారాలను పెన్‌డ్రైవ్‌లో రికార్డ్ చేసుకోవచ్చు

Posted By:

నచ్చిన టీవీ ప్రసారాలను రికార్డ్ చేసుకుని మళ్లి చూసుకునే విధంగా సెట్-టాప్-బాక్స్ సర్వీసులు ఇదివరుకే ఓ ప్రత్యేక సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చాయి. సెట్-టాప్-బాక్స్‌ల వినియోగం అధిక ఖర్చుతో కూడుకుని ఉండటంతో చాలా మందిప్రజలు కేబుల్ సర్వీసులనే ఇష్టపడుతున్నారు. తాజాగా, ఎయిర్‌టెల్ ఓ సరికొత్త ఫీచర్‌తో కూడిన సెట్-టాప్-బాక్స్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్పెషల్ ఫీచర్‌లో భాగంగా వినియోగదారుడు తమకు నచ్చిన టీవీ ప్రసారాలను పెన్‌డ్రైవ్ లేదా ఇతర స్టోరేజ్ డివైజ్‌లలో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ కొత్త సర్వీసుతో కూడిన సెట్ టాప్ బాక్స్‌ను ఎయిర్‌టెల్ పాత ధరకే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

ఇప్పుడు ఎయిర్‌టెల్ టీవీ ప్రసారాలను పెన్‌డ్రైవ్‌లో రికార్డ్ చేసుకోవచ్చు

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

దేశంలోని ప్రముఖ డైరెక్ట్ - టూ- హోమ్ టెలివిజన్ ఆపరేటర్ టాటా స్కై (Tata Sky), ‘ఎవ్రీవేర్ టీవీ' (Everywhere TV) పేరుతో సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను ప్రకటించింది. ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ యాప్‌ను ఆయా ఆపరేటింగ్ సిస్టంలను సపోర్ట్ చేసే డివైజ్‌లలో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా టాటా స్కై ప్రసారాలను వీక్షించవచ్చు. ఈ అప్లికేషన్ 50 ఛానళ్లకు సంబంధించిన ప్రసారాలను చేరువస్తుంది. నెలసరి అద్దె క్రింది రూ.60 చెల్లించాల్సి ఉంటుంది. ఔత్సాహికులు ఈ అప్లికేషన్‌ను యాపిల్ ఇంకా గూగుల్ ప్లే స్టోర్‌లోకి లాగినై డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot