Home
News

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ లో 'సేఫ్ పే’ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడం ఎలా??

ఇండియాలోని ప్రైవేట్ టెలికాం సంస్థలలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ యొక్క అనుబంధ సంస్థ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ భారతదేశం అంతటా వినియోగదారులకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. కొన్ని నెలల క్రితం కంపెనీ తన కస్టమర్ల కోసం 'ఎయిర్‌టెల్ సేఫ్ పే' అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. పెరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తన ప్లాట్‌ఫారమ్ ద్వారా నిర్వహించే అన్ని రకాల లావాదేవీలను 'సేఫ్ పే'ని ప్రవేశపెట్టడంతో మరింత సురక్షితంగా చేసింది.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ యూజర్ మాత్రమే ఎయిర్‌టెల్ సేఫ్ పే యొక్క సెక్యూరిటీ ఫీచర్ ను పొందగలడు. ఈ ఫీచర్ కస్టమర్‌ల అకౌంట్ ద్వారా UPI లేదా నెట్ బ్యాంకింగ్ లావాదేవీ జరిగినప్పుడల్లా వారికి రియల్ టైమ్ అలర్ట్‌లను అందిస్తుంది. అకౌంట్ యజమాని ఎప్పటికప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకునేలా లావాదేవీ పూర్తయ్యేలోపు అలర్ట్ డెలివరీ చేయబడుతుంది. అకౌంట్ యజమాని హెచ్చరిక మెసేజ్ ద్వారా లావాదేవీని ఆమోదించే వరకు లావాదేవీ జరగదు. ఇది ప్రాథమికంగా 3-కారకాల యాక్సిస్ ప్రక్రియ. మీరు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండి ఈ ఫీచర్ ని ఎలా పొందాలి అని ఆలోచిస్తున్నారా?? అయితే దీని గురించి ఎం మరిన్ని వివరాలను పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ లావాదేవీల కోసం ‘సేఫ్ పే’ని ప్రారంభించడం ఎలా?

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ లావాదేవీల కోసం ‘సేఫ్ పే’ని ప్రారంభించడం ఎలా?

ఎయిర్‌టెల్ వినియోగదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా Airtel Payments Bankలో ‘సేఫ్ పే' యొక్క కొత్త ఫీచర్ ను ప్రారంభించవచ్చు. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ని ఓపెన్ చేయండి. ఒకవేళ లేకపోతే కనుక డౌన్ లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసి లాగిన్ అవ్వండి.

**తరువాత బ్యాంక్ విభాగం యొక్క హోమ్ స్క్రీన్‌ను కనుగొనండి లేదా బ్యాంక్ హోమ్ స్క్రీన్‌లో 'మోర్ సెట్టింగ్స్' ఎంపికలో ఉన్న పేమెంట్ సెట్టింగ్‌ల విభాగానికి వెళ్లండి.

** ఇందులో మీరు సెక్షన్‌లలో దేనిలోనైనా ‘సెక్యూర్ పే' ఎంపికను కనుగొంటారు. ఎంపికపై క్లిక్ చేసిన తర్వాత మీరు 'సేఫ్ పే'ని ప్రారంభించగల కొత్త స్క్రీన్‌కి తీసుకెళ్లబడతారు.

** ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ నుండి డెబిట్ లావాదేవీని మాన్యువల్‌గా ప్రారంభించండి. ‘సేఫ్ పే' ఫీచర్ ప్రారంభించబడినప్పుడల్లా వినియోగదారులు హెచ్చరికను అందుకుంటారు.

** ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా సెక్యూర్ పే అలర్ట్‌లు కస్టమర్లకు డెలివరీ అవుతాయని కంపెనీ తెలిపింది. వినియోగదారు అతను/ఆమె నెట్‌వర్క్ కవరేజ్ ప్రాంతంలో ఉన్నారని నిర్ధారించుకోవాలి. మెసేజ్ అలర్ట్ డెబిట్ చేయబోయే మొత్తం మరియు డబ్బు వెళ్లే వ్యక్తి పేరును చూపుతుంది.

 

డిజిటల్ సేవింగ్స్

భారతీ ఎయిర్‌టెల్ నుండి లభించే ఈ కొత్త డిజిటల్ సేవింగ్స్ అకౌంటుతో వినియోగదారులు ప్రధానంగా మూడు ప్రయోజనాలను పొందుతారు. ఇందులో మొదటిది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్‌ సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా పొందడం. దీని ధర సంవత్సరానికి 499 రూపాయలుగా ఉంటుంది. రెండవది వినియోగదారులు తమ వాలెట్‌లో డబ్బును డిపాజిట్ చేసినప్పుడల్లా ప్రతి నెలా రూ.10 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ పొందుతారు. అయితే కనీస లావాదేవీ మొత్తం రూ.1,000 ఉండాలి అన్న విషయం గుర్తుంచుకోండి. ఇంకా మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్‌లు, మొబైల్ పోస్ట్-పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్ మరియు డిటిహెచ్ బిల్లు పేమెంట్ల చెల్లింపులపై నెలకు ఒకసారి వినియోగదారుల అకౌంటుల్లోకి రూ.30 మొత్తం క్యాష్‌బ్యాక్ రూపంలో జమ చేయబడుతుంది.

ఎయిర్‌టెల్ రివార్డ్స్ 123 ప్లస్ సేవింగ్స్

ఎయిర్‌టెల్ రివార్డ్స్ 123 ప్లస్ సేవింగ్స్ అకౌంట్ కస్టమర్లు INR 1 లక్ష-2 లక్షలు, జీరో మినిమమ్ బ్యాలెన్స్ మరియు ఆటో-స్వీప్ ఫెసిలిటీతో అపరిమిత డిపాజిట్లపై 6% వడ్డీని పొందుతారు. కస్టమర్ రివార్డ్స్ 123 ప్లస్‌ని ఓపెన్ చేసిన తర్వాత లేదా అప్‌గ్రేడ్ చేసిన తర్వాత వారు సబ్‌స్క్రిప్షన్‌ను యాక్టివేట్ చేయడానికి వారి రిజిస్టర్డ్ నంబర్‌ను ఉపయోగించి డిస్నీ+ హాట్‌స్టార్ వెబ్‌సైట్ లేదా యాప్‌కి లాగిన్ అవ్వవచ్చు.

పేమెంట్స్ బ్యాంక్

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ (AePS) ప్లాట్‌ఫామ్ ఆధారంగా FY21 లో దాదాపు 50 మిలియన్లకు పైగా నగదు యొక్క విత్ డ్రా లావాదేవీలు నమోదు అయినట్లు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఈరోజు ప్రకటించింది. AePS లో బ్యాంక్ దాదాపు 7% మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఈ లావాదేవీలలో 74% కంటే ఎక్కువ టైర్ 5/6 పట్టణాలలో ఉన్న ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క బ్యాంకింగ్ పాయింట్ల ద్వారా ప్రాసెస్ చేయబడినట్లు సంస్థ ప్రకటించింది. 500,000 లకు పైగా గల బ్యాంకింగ్ పాయింట్లతో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ భారతదేశంలో అతిపెద్ద రిటైల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది మరియు ఈ బ్యాంకింగ్ పాయింట్లలో 50% AePS ఎనేబుల్ చేయబడ్డాయి.

Best Mobiles in India

English summary
Airtel Safe Pay: How to Enable ‘Safe Pay’ For Transactions on Airtel Payments Bank Account
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X