Home
News

ఎయిర్‌టెల్ యూజర్లకి బ్యాడ్ న్యూస్, ఆ ప్లాన్లను తీసేసింది !

దేశీయ టెలికం రంగంలో మకుటం లేని మహారాజుగా దూసుకుపోతున్న దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ యూజర్లకు బ్యాడ్ న్యూస్ ని అందించేందుకు రెడీ అయింది. ఈ దిగ్గజ సంస్థ చౌక పోస్ట్‌–పెయిడ్‌ ప్యాకేజీల నుంచి క్ర

దేశీయ టెలికం రంగంలో మకుటం లేని మహారాజుగా దూసుకుపోతున్న దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ యూజర్లకు బ్యాడ్ న్యూస్ ని అందించేందుకు రెడీ అయింది. ఈ దిగ్గజ సంస్థ చౌక పోస్ట్‌–పెయిడ్‌ ప్యాకేజీల నుంచి క్రమంగా తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఖాతాదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) పెంచే చర్యల్లో భాగంగా రూ.499 దిగువన ఉన్నటువంటి ఆఫర్ల నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం.

ఎయిర్‌టెల్ యూజర్లకి బ్యాడ్ న్యూస్, ఆ ప్లాన్లను తీసేసింది !

ఇందులో భాగంగానే ఈ మధ్య రూ.299 ప్లాన్‌ను పక్కనపెట్టిన ఎయిర్‌టెల్‌.. క్రమంగా రూ.349, రూ.399 ప్యాకేజీల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తోందని టెలికం రంగ నిపుణులు చెబుతున్నారు.

మూడేళ్లపాటు కొనసాగిన తీవ్రపోటీ

మూడేళ్లపాటు కొనసాగిన తీవ్రపోటీ

రిలయన్స్‌ జియో రంగ ప్రవేశంతో ఈ రంగంలో మూడేళ్లపాటు కొనసాగిన తీవ్రపోటీ ఇప్పుడు నెమ్మదిగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2018 డిసెంబర్‌ నాటికి ఈ సంస్థకు 28.4 కోట్ల కస్టమర్‌ బేస్‌ ఉంది.

రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్

రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్

ఇదిలా ఉంటే ఎయిర్‌టెల్ కొత్తగా రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించింది. భారతదేశంలోని యూజర్లందరికీ ఈ రెండు ప్లాన్లు అందుబాటులో ఉంటాయి. ఆ ప్లాన్లే రూ.129, రూ.249. అయితే ఈ ప్లాన్లలో ఓ ప్లాన్ కు కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజిని అందిస్తోంది. ఇందులో రూ.249 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవినియోగదారులకి రూ.4 లక్షల లైఫ్ ఇన్స్యూరెన్స్ లభిస్తుంది.

రూ.249 ప్లాన్
దీంతో పాటు రూ.249 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్, ఎస్‌టీడీ, నేషనల్ రోమింగ్ వాయిస్ కాల్స్, రోజుకు 2జీబీ 3జీ లేదా 4జీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దీంతో పాటు ఎయిర్‌టెల్ రూ.129 కు మ‌రో నూత‌న ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా ప్ర‌వేశ‌పెట్టింది. ఇందులో క‌స్ట‌మ‌ర్లకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ల‌భిస్తాయి.

ఏడాదిపాటు నార్టాన్ మొబైల్ సెక్యూరిటీ

ఏడాదిపాటు నార్టాన్ మొబైల్ సెక్యూరిటీ

ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు ఎయిర్‌టెల్ టీవీ ప్రీమియం, వింక్ మ్యూజిక్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. రూ.249 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. దీంతోపాటు ఏడాదిపాటు నార్టాన్ మొబైల్ సెక్యూరిటీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. రూ.249 ప్లాన్‌లో ఇప్పటివరకు ఎవ్వరు ఇవ్వలేని విధంగా లైఫ్ ఇన్స్యూరెన్స్ కవరేజిని ఎయిర్ టెల్ అందిస్తోంది.

రూ.4 లక్షల వరకు బీమా

రూ.4 లక్షల వరకు బీమా

రూ.249 ప్లాన్‌పై ఏకంగా రూ.4 లక్షల వరకు బీమా సౌకర్యాన్ని అందిస్తోంది.హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్స్యూరెన్స్ లేదా భారతీ ఆక్సా నుంచి ఈ ఇన్స్యూరెన్స్ లభిస్తుంది.ఒకసారి రీఛార్జ్ చేసుకున్నవారి మొబైల్‌కు పాలసీకి సంబంధించిన ఎస్ఎంఎస్ వస్తుంది.

క్లెయిమ్ ఎలా ?

క్లెయిమ్ ఎలా ?

ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకున్న వెంట‌నే క‌స్ట‌మ‌ర్ల‌కు ఒక ఎస్ఎంఎస్ వ‌స్తుంది. అందులో పాల‌సీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, కేవైసీ ఎలా ఇవ్వాలి.. అనే వివ‌రాలు ఉంటాయి. వాటిని న‌మోదు చేస్తే క‌స్ట‌మ‌ర్ తన ఫోన్ లో ఎయిర్‌టెల్ యాప్ నుంచి పాల‌సీ కాపీని పొంద‌వ‌చ్చు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ లేదా భార‌తీ ఆక్సా నుంచి ఆ పాల‌సీ ఇష్యూ అవుతుంది.వినియోగదారుల వయసు 18 నుంచి 54 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎయిర్‌టెల్ యాప్‌ నుంచి కస్టమర్లు పాలసీకి సంబంధించిన కాపీని పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel scraps low-value postpaid plans.The Sunil Mittal-led mobile operator has now made Rs 499 the entry price point for its postpaid customers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X