Home
News

మరో రాష్ట్రంలో కూడా airtel 3జీ అవుట్

By Gizbot Bureau

ప్రముఖ దిగ్గజ టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అందిస్తోన్న 3జీ సేవలకు త్వరలో మంగళం పాడాలని నిర్ణయించింది. భారతి ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. 2020 మార్చి నాటికి దేశ వ్యాప్తంగా అందిస్తున్న 3జీ సేవలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. 22 టెలికాం సర్కిల్ల ద్వారా అందిస్తున్న 3జీ సేవలను అంచెలంచెలుగా నిలిపివేయనున్నట్టు తెలిపారు. కోల్‌కతా సహా పలు నగరాల్లో ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు వివరించారు. అయితే ఫీచర్ ఫోన్ వినియోగదారుల దృష్ట్యా 2జీ సేవలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కలకత్తాలో ఇప్పటికే 3జీ నెట్ వర్క్ షట్ డౌన్ అయింది. కాగా మరో రాష్ట్రం హరియానాలో కూడా 3జీని సంస్థ నిలిపివేసింది.

హరియానాలో 3జీ అవుట్

హరియానాలో 3జీ అవుట్

భారతీ ఎయిర్‌టెల్ ఇప్పటికే కలకత్తాలో 3జీ సేవలను ఆపివేసిన సంగతి అందరికీ విదితమే. అయితే ఇప్పుడు మరో రాష్ట్రం హరియానాలో కూడా తన 3జీ సేవలను నిలిపివేసింది. కంపెనీ ఇకపై ఈ రెండు రాష్ట్రాల్లో 3జీ సేవలను అందించబోమని 2జీ , 4జీ సేవలు మాత్రమే అందిస్తామని కంపెనీ తెలిపింది.

2020 టార్గెట్

2020 టార్గెట్

2020, ఏప్రిల్‌ నాటికి తమ నెట్‌వర్క్‌ కేవలం 2జీ, 4జీ కస్టమర్లను మాత్రమే కలిగి ఉండనుందని ఆయన అన్నారు. మార్జిన్లతోపాటు ఒక్కో కస్టమర్‌పై ఆర్జించే సరాసరి ఆదాయాన్ని(ఏఆర్‌పీయూ) పెంచుకోవడంపైనే పూర్తి దృష్టిసారించినట్లు కంపెనీ పేర్కొంది.సెప్టెంబర్ నాటికి మరో 6 నుంచి 7 సర్కిల్స్ లో LTE పై అందించే 3జీ సర్వీసులో అదనంగా 900మెగాహెడ్జ్ తో కలిపి మొత్తాన్ని షట్ డౌన్ చే.సింది. డిసెంబర్ నుంచి మార్చి నాటికి మొత్తం 3G నెట్ వర్క్ షట్ డౌన్ చేయనున్నట్టు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) బాదల్ బాగ్రి తెలిపారు. డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 3G నెట్ వర్క్ సర్వీసులు నిలిపివేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. చాలా సర్కిళ్లలో 10 నుంచి 15మెగాహెర్ట్జ్ మధ్య 2వేల 1వంద బ్యాండ్ స్పెక్ట్రమ్ ఉన్నట్టు బాగ్రి తెలిపారు. 

రూ.2వేల 866 కోట్ల నష్టాలు

రూ.2వేల 866 కోట్ల నష్టాలు

ఆర్థిక సంవత్సరం 2019 తొలి త్రైమాసికంలో టెలికం మేజర్ భారతీ ఎయిర్ టెల్ రూ.2వేల 866 కోట్లతో భారీ నష్టాన్ని చవిచూసింది. గత ఏడాదిలో ఇదే సమయానికి రూ.97.30 కోట్లు ఆర్జించింది.ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో అసాధారణ స్థితిలో రూ.1వెయ్యి 469.40 కోట్లు నష్టపోయింది. గత ఏడాది ఇదే సమయానికి రూ.362.10 కోట్లు నష్టపోయింది. కానీ, సగటున ఆదాయం అదే జూన్ త్రైమాసికంలో ఒక యూజర్‌కు (ARPU) రూ.129కు పెరిగింది. ఏడాది క్రితం జూన్ త్రైమాసికంలో రూ.105 వరకు పెరిగింది. 16 దేశాల్లో జూన్ త్రైమాసికం ముగిసే నాటికి మొత్తం మీద ఎయిర్ టెల్ కస్టమర్ బేస్ 403.7 మిలియన్ల దగ్గర నిలవగా ఏడాదిపరంగా పరిశీలిస్తే 10.9 శాతం వరకు తగ్గిపోయింది.

పెరిగిన కస్టమర్ల సంఖ్య 

పెరిగిన కస్టమర్ల సంఖ్య 

తొలి త్రైమాసికంలో ఎయిర్ టెల్ కస్టమర్ల సంఖ్య 95 మిలియన్లు ఉండగా ఇందులో 9 మిలియన్ల మంది కస్టమర్లు పెరిగారు. బాగ్రి కథనం ప్రకారం.. ఎయిర్ టెల్ 26వేలకు పైగా మొబైల్ బ్రాడ్ బ్యాండ్ బేసిడ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఎయిర్ టెల్ ARPU రూ.129 ఉండగా.. కస్టమర్ బేస్ 99శాతానికి పైగా ఉంది. కస్టమర్ బేసిడ్ నుంచి నెలవారీ డేటా వాడకం సగటున నెలకు 11.7GB వరకు ఉందని బాగ్రి చెప్పారు.

కస్టమర్లు సరాసరిగా నెలకు 11జీబీ డేటా

కస్టమర్లు సరాసరిగా నెలకు 11జీబీ డేటా

కాగా టెలికాం రంగ దీర్ఘకాల మనుగడకు చార్జీలు పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కంపెనీ నెట్‌వర్క్‌లోకి కొత్తగా 84 లక్షల మంది 4జీ కస్టమర్లు చేరారు. దీంతో కంపెనీ నెట్‌వర్క్‌లో డేటా సేవలందుకుంటున్న వినియోగదారుల సంఖ్య 12 కోట్లకు చేరుకుంది. అందులో 4జీ యూజర్ల వాటా 9.5 కోట్లు. తమ కస్టమర్లు సరాసరిగా నెలకు 11జీబీ డేటా వినియోగించుకుంటున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel shuts down 3G network in Haryana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X