Home
News

Airtel : ఎయిర్‌టెల్‌ యూజర్లకు షాక్‌.. సైలెంట్‌గా ఈ ప్లాన్‌ ఎత్తివేత!

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌ల ప్రయోజనాల్లో కోత విధించింది. కొన్ని ప్లాన్‌ల వ్యాలిడిటీని తగ్గించగా.. మరికొన్ని ప్లాన్‌ల డేటా ప్రయోజనాల్లో కోత విధించింది. అయితే తాజాగా ఎయిర్‌టెల్‌ (Airtel) కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే రోజువారీ 1GB డేటాను అందించే రీఛార్జ్‌ ప్లాన్లను ఎత్తివేసింది.

తాజాగా నెలావారీగా ఉన్న కనీస రీఛార్జ్ ప్లాన్‌ రూ.189 ను ( Airtel Rs189 Recharge Plan ) తొలగించింది. దీంతో నెలవారీ రీఛార్జ్‌ ప్లాన్‌ల కోసం చూసే యూజర్లు కచ్చితంగా రూ.199 ప్లాన్‌ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్ రూ.189 ప్లాన్‌లో వాయిస్‌ కాల్స్‌ ను మాత్రమే పొందే వీలుండేది. గ్రామీణ ప్రాంతాల్లోని యూజర్లు, కేవలం కాలింగ్‌ కోసమే ఫోన్‌ ఉపయోగించే వారికి అనుకూలంగా ఉండేది.

airtel discontinued Rs189

రూ.199 ప్లాన్‌ ను ఎంచుకోవాల్సిందే..! :
ఎయిర్‌టెల్ తన రూ.189 రీఛార్జ్ ప్లాన్‌ ను తొలగించిన నేపథ్యంలో.. నెలవారీ కనీస రీఛార్జ్‌ ప్లాన్ రూ.199 గా ఉండనుంది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఈ ప్లాన్‌ ను ఎయిర్‌టెల్‌ తొలగించింది. ఎటువంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు.

రూ.199 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఎయిర్‌టెల్‌ రూ.199 రీఛార్జ్‌ ప్లాన్‌ లో (Airtel Rs199 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ లో మొత్తంగా 2GB 4G డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. అయితే ఈ ప్లాన్‌ లో భాగంగా హాలోట్యూన్స్‌ ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI మోడల్‌ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. కేవలం కాలింగ్‌ కోసమే ఫోన్‌ వినియోగిస్తున్నవారికి ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది.

త్వరలో మరో గట్టి షాక్‌ :
టెలికాం సంస్థలు ఈ సంవత్సరం చివర్లో యూజర్లకు గట్టి షాక్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. BSNL మినహా జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా సంస్థలు రీఛార్జ్ ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది. కనీసం 10-12 శాతం టారిఫ్‌ల పెంపు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

డిసెంబర్ 2025 లో ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ARPU (యూజర్‌ నుంచి వచ్చే సరాసరి ఆదాయం) పెంచుకోవడంలో భాగంగా టెలికాం సంస్థలు ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

గత సంవత్సరం కూడా ప్రైవేటు టెలికాం సంస్థలు రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలను భారీగా పెంచాయి. అయితే ధరల పెంపు అనంతరం ఈ టెలికాం ప్రొవైడర్లకు యూజర్లు గట్టి షాక్‌ ఇచ్చారు. లక్షలాది మంది యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు పోర్టింగ్‌ అయ్యారు. అయితే అనంతరం పరిస్థితిలో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం యూజర్ల పరంగా జియో అగ్రస్థానంలో ఉంది. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL ఆఖరి స్థానంలో ఉంది.

Best Mobiles in India

English summary
airtel silently discontinued Rs189 Prepaid Recharge Plan, full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X