ఎయిర్‌టెల్ స్మార్ట్‌ఫోన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందడానికి యూజర్లు 24 గంటల్లో రీఛార్జ్ చేసుకోవాలి...

|

భారతి ఎయిర్‌టెల్ ఇటీవల తన యొక్క వినియోగదారుల కోసం కొత్తగా స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌ను విడుదల చేసింది. ఇందులో టెల్కో వారు ఆఫర్‌లోని అన్ని నిబంధనలు మరియు షరతులను పాటిస్తే వారికి రూ. 6,000 నగదు ప్రయోజనాన్ని అందజేస్తుంది. కానీ ఆఫర్ యొక్క ప్రయోజనాన్ని పొందడానికి వినియోగదారులు రూ.249 ప్లాన్‌తో లేదా అంతకంటే ఎక్కువ ధర వద్ద లభించే ప్లాన్ లతో 3 సంవత్సరాలు లేదా 36 నెలల పాటు లాంగ్ టర్మ్ రీఛార్జ్ చేసుకోవాలి. కాబట్టి యూజర్లు ప్రస్తుత ప్లాన్ గడువు ముగిసిన 24 గంటలలోపు వినియోగదారులు అర్హత కలిగిన ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలని టెల్కో కోరుతోంది. వినియోగదారులు దీన్ని చేయకపోతే కనుక ఇది నిరంతర రీఛార్జ్‌గా పరిగణించబడదు మరియు ప్రయోజనాలు అందించబడవు. దీనికి సంబందించిన మరిన్ని వివరాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఎయిర్‌టెల్ స్మార్ట్‌ఫోన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌

ఎయిర్‌టెల్ యొక్క ఈ ఆఫర్ ముందుగా అక్టోబర్ 8, 2021న లేదా ఆ తర్వాత కొనుగోలు చేసిన స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే కొనుగోలు చేసిన హ్యాండ్‌సెట్ 4G ఆండ్రాయిడ్ డివైస్ మాత్రమే అయి ఉండాలి. కొత్త 4G స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ చేసిన తర్వాత, అర్హత కలిగిన రీఛార్జ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవడానికి వినియోగదారులు 30 రోజుల విండోను కలిగి ఉంటారు. వినియోగదారులు ఇంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే కనుక వారికి ఈ ఆఫర్ వర్తించదు.

OTT సబ్స్క్రిప్షన్ భారీగా పెరిగింది!! కానీ టీవీ సేవలకు మించి లేదు...OTT సబ్స్క్రిప్షన్ భారీగా పెరిగింది!! కానీ టీవీ సేవలకు మించి లేదు...

ఎయిర్‌టెల్ - స్మార్ట్‌ఫోన్
 

ఎయిర్‌టెల్ - స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌కు సంబంధించిన వినియోగదారు అర్హత గల రీఛార్జ్‌ని మొదటిసారిగా చేస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ వినియోగదారులకు రెండు విడతలుగా అందించబడుతుంది. వినియోగదారులు 18 నెలల పాటు అర్హత గల ప్లాన్‌తో నిరంతరం రీఛార్జ్ చేసుకుంటే కనుక వినియోగదారుల యొక్క ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంటులో రూ.2,000 జమ చేయబడుతుంది. ఇంకా 36 నెలలు పూర్తయిన తర్వాత యూజర్ల యొక్క ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంటులోకి మిగిలిన రూ.4,000 మొత్తాన్ని అందుకుంటారు. ఈ క్యాష్‌బ్యాక్ మొత్తం వినియోగదారు అకౌంటుకు చేరుకోవడానికి 90 రోజుల వరకు పడుతుంది. క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ఎంచుకోవడానికి అర్హత ఉన్న వినియోగదారులందరికీ కంపెనీ నుండి కమ్యూనికేషన్ పంపబడుతుందని మరియు దానిని అంగీకరించడానికి వారికి 15 రోజుల సమయం ఉంటుందని గమనించండి. ఇప్పటికి ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ లేని వినియోగదారులు తప్పనిసరిగా అకౌంటుని కలిగి ఉండాలి. భారతి ఎయిర్‌టెల్ నుండి క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు ఏ స్మార్ట్‌ఫోన్‌లు అర్హత పొందాయని మీరు ఆలోచిస్తున్నట్లయితే దిగువన పరిశీలించండి.

YouTube లో కొత్త ఫీచర్ 'New To You ' ! ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.YouTube లో కొత్త ఫీచర్ 'New To You ' ! ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

ఎయిర్‌టెల్

భారతీ ఎయిర్‌టెల్ ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై మాత్రమే క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో ఆండ్రాయిడ్ ఫోన్‌లు మాత్రమే ఉన్నాయి. వీటిలో Xiaomi, Vivo, Samsung, Oppo, Realme, Tecno, Nokia, Infinix, Itel, Lenovo, Lava మరియు Motorola వంటి బ్రాండ్‌లను Airtel తన క్యాష్‌బ్యాక్ ఆఫర్ కింద చేర్చింది. ఇది భారతదేశంలో 4G పరికరాల మరింత విస్తరణకు సహాయపడుతుంది మరియు టెల్కో తన ప్రతి కస్టమర్ నుండి మరింత సంపాదించడంలో కూడా సహాయపడుతుంది.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ (AePS) ప్లాట్‌ఫామ్ ఆధారంగా FY21 లో దాదాపు 50 మిలియన్లకు పైగా నగదు యొక్క విత్ డ్రా లావాదేవీలు నమోదు అయినట్లు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఈరోజు ప్రకటించింది. AePS లో బ్యాంక్ దాదాపు 7% మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఈ లావాదేవీలలో 74% కంటే ఎక్కువ టైర్ 5/6 పట్టణాలలో ఉన్న ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క బ్యాంకింగ్ పాయింట్ల ద్వారా ప్రాసెస్ చేయబడినట్లు సంస్థ ప్రకటించింది. 500,000 లకు పైగా గల బ్యాంకింగ్ పాయింట్లతో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ భారతదేశంలో అతిపెద్ద రిటైల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది మరియు ఈ బ్యాంకింగ్ పాయింట్లలో 50% AePS ఎనేబుల్ చేయబడ్డాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Airtel Smartphone Cashback Offer to Get it Users Need to Recharge Within 24 Hours

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X