Airtel సాహసం, సంవత్సరం పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, 300 జిబి డేటా

టెలికం రంగంలో దూసుకుపోతున్న అతి పెద్ద టెలికాం భారతి ఎయిర్‌టెల్‌ మరో ముందడుగు వేసింది.

By Hazarath
|

టెలికం రంగంలో దూసుకుపోతున్న అతి పెద్ద టెలికాం భారతి ఎయిర్‌టెల్‌ మరో ముందడుగు వేసింది. తమ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్ అమల్లోకి తీసుకువచ్చింది. తమ నెట్‌వర్క్ వాడుతున్న ప్రీపెయిడ్‌ ఖాతాదారులకోసం సరికొత్త వార్షిక పథకాన్ని ప్రవేశపెట్టింది. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, ఉచిత డేటా, ఎస్‌ఎంఎస్‌లతో మూడు రకాల ప్లాన్లను అమల్లోకి తీసుకువచ్చింది.

 

దిమ్మతిరిగేలా కొత్త టెక్నాలజీ , మీ చెమటే మీ పాస్‌వర్డ్ !దిమ్మతిరిగేలా కొత్త టెక్నాలజీ , మీ చెమటే మీ పాస్‌వర్డ్ !

రూ. 3999, రూ. 1999, రూ. 999 ప్లాన్లు

రూ. 3999, రూ. 1999, రూ. 999 ప్లాన్లు

ఎయిర్‌టెల్‌ వెబ్‌‌సైట్‌ లో పొందుపర్చిన సమాచారం ప్రకారం నేషనల్ రోమింగ్, ఎస్ఎమ్ఎస్ ఫ్రీ (100 ఎస్ఎంఎస్ /రోజుకు), రూ. 3999, రూ. 1999, రూ. 999 ల రీచార్జి ప్లాన్‌ను ప్రీ పెయిడ్‌ కస్టమర్లకు అందిస్తోంది.

రూ.3999 రీచార్జ్‌ ప్లాన్‌ లో..

రూ.3999 రీచార్జ్‌ ప్లాన్‌ లో..

రూ.3999 రీచార్జ్‌ ప్లాన్‌ లో 300 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. 360 రోజులు చెల్లుబాటయ్యేలా ఈ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. అన్‌ లిమిటెడ్‌ కాలింగ్‌ ఉంటుంది.

రూ.1999 రీచార్జ్‌..

రూ.1999 రీచార్జ్‌..

రూ.1999 రీచార్జ్‌పై 180 రోజుల (ఆరునెలలు) కాలపరిమితిలో.. 125 జీబీ డేటా, అన్‌ లిమిటెడ్‌ కాలింగ్‌ (నేషనల్ రోమింగ్), 100 ఎస్ఎంఎస్లు రోజుకు ఉచితం.

రూ. 999 రీచార్జ్‌
 

రూ. 999 రీచార్జ్‌

రూ. 999 రీచార్జ్‌పై 90 రోజులు(మూడు నెలలు) వ్యవధిలో 60 జీబీ డేటా, దీంతోపాటు నేషనల్ రోమింగ్ & ఎస్ఎమ్ఎస్‌లు (100 ఎస్ఎంఎస్ / రోజుకు) ఉచితం. అన్‌ లిమిటెడ్‌ కాలింగ్‌.

జియోకు షాకిచ్చేలా..

జియోకు షాకిచ్చేలా..

కాగా టెలికాం మార్కెట్‌లో నెలకొన్ని తీవ్ర పోటీనేపథ్యంలో తాజాగా ఈవార్షిక ప్లాన్లను లాంచ్‌ చేసింది. రిలయన్స్‌ జియో 360 రోజులకు రూ.9999 లకు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, డేటా సేవలను అందిస్తోంది.. జియోకు షాకిచ్చేలా ఎయిర్‌ టెల్‌ తన కస్టమర్లకు సరికొత్త ఆకర్షణీయ రీచార్జ్‌ప్లాన్లను లాంచ్‌ చేయడం విశేషం.

Best Mobiles in India

English summary
Airtel Special Recharge Offer: 300 GB Data, Unlimited Calls For 360 Days Read more at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X