జియోకు షాక్, త్వరలో ఎయిర్‌టెల్ VoLTE

స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలతో సంప్రదింపులు

|

భారతదేశపు అతిపెద్ద టెలికం సర్వీస్ ప్రొవైడర్ భారతీ ఎయిర్‌టెల్, తన 4జీ యూజర్ల కోసం త్వరలో VoLTE సపోర్ట్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు TeleAnalysis రిపోర్ట్ పేర్కొంది.

Read More : మొబైల్ చార్జర్ అమ్మినందుకు ఫ్లిప్‌కార్ట్‌కు రూ.15,000 జరిమానా

కమ్యూనికేషన్‌‌ను సరికొత్త లెవల్‌కు

కమ్యూనికేషన్‌‌ను సరికొత్త లెవల్‌కు

హై-స్పీడ్ వైర్‌లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థలలో ఒకటైన VoLTE, స్మార్ట్‌ఫోన్‌ కమ్యూనికేషన్‌‌ను సరికొత్త లెవల్‌కు తీసుకువెళ్లింది. 

ఎయిర్‌టెల్ సంప్రదింపులు..

ఎయిర్‌టెల్ సంప్రదింపులు..

VoLTE కమ్యూనికేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతున్న నేపథ్యంలో పలు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలతో ఎయిర్‌టెల్ సంప్రదింపులు జరపుతోన్నట్లు సమాచారం.

 అంతకంతకు డిమాండ్

అంతకంతకు డిమాండ్

ప్రస్తుత ట్రెండ్‌ను అంచనా వేసినట్లయితే దాదాపుగా అన్ని స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు 4G VoLTE ఫీచర్‌ను తమ ఫోన్‌లతో అందిస్తున్నాయి. 4G VoLTE కమ్యూనికేషన్‌కు అంతకంతకు డిమాండ్ పెరుగుతుండటంతో బేసిక్ ఫోన్‌లలోనూ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేస్తున్నాయి.

4జీ LTE బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్

4జీ LTE బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్

వాస్తవానికి, వాయిస్ ఓవర్ ఎల్టీఈ అనేది ఇంటర్నెట్ ద్వారా కాల్స్ చేసుకునేందుకు మరొక మార్గం. VoLTE కాల్స్ అనేవి స్టాండర్డ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా కాకుండా మొబైల్ 4జీ LTE బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ ద్వారా డెలివరీ కాబడతాయి.

హైడెఫినిషన్ వాయిస్ కాల్స్

హైడెఫినిషన్ వాయిస్ కాల్స్

VoLTE కమ్యూనికేషన్ స్టాండర్డ్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్లయితే హైడెఫినిషన్ వాయిస్ కాల్స్ చేసుకునే వీలుంటుంది. VoLTE అంటే వాయిస్ ఓవర్ ఎల్టీఈ అని అర్థం. ఈ కనెక్టువిటీ ఫీచర్.. 4జీ సర్వీస్ ద్వారా హై క్వాలిటీ వాయిస్, వీడియో ఇంకా మల్టీమీడియా సేవలను యూజర్లకు చేరువచేస్తుంది. VoLTE వ్యవస్థ ముఖ్యంగా కాల్ క్వాలిటీని మరింత మెరుగుపరుస్తుంది. 3జీ కంటే మూడు రెట్లు, 2జీ కంటే 6 రెట్ల వేగంతో డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

 

 

Best Mobiles in India

English summary
Airtel started the trial version of VoLTE. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X