ఇంకా ఇలాంటి రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయని మీకు తెలుసా..?
ఎయిర్‌టెల్ ప్రస్తుతం భారత టెలికాం రంగంలో యూజర్ల పరంగా రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్‌ను అందిస్తోంది. అయితే యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌టెల్ అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. అయితే గతంలో 30, 60, 90 రోజుల వ్యాలిడిటీతో అనేక రీఛార్జ్ ప్లాన్లు ఉండేవి. అయితే క్రమంగా ఆ తరహా వ్యాలిడిటీని అందించే ప్లాన్‌లను ఎయిర్‌టెల్ చాలావరకు తొలగించింది.
ప్రస్తుతం 28, 56, 84 రోజుల వ్యాలిడిటీలో ఎక్కువ రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. గతంలో తరహా నెలవారీ రీఛార్జ్ ప్లాన్‌లు కావాలని భావించే యూజర్ల కోసం 30, 60, 90 రోజుల వ్యాలిడిటీతో కొన్ని ప్లాన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌ల వివరాలు.

రూ.319 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో (Airtel Rs319 Recharge Plan) భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ తోపాటు రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 1.5GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ నెలరోజులుగా ఉంటుంది.
ఈ ప్లాన్‌లో యూజర్లు ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మరియు గూగుల్ వన్ ద్వారా 30GB వరకు క్లౌడ్ స్టోరేజీని పొందవచ్చు. మరియు హలోట్యూన్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
రూ.379 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs379 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్ కాల్స్, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB 4G డేటా, అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.
దీంతోపాటు ఈ ప్లాన్‌లో గూగుల్ వన్ ద్వారా 30GB క్లౌడ్ స్టోరేజీని పొందవచ్చు. మరియు ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. హలో ట్యూన్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.
రూ.429 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs429 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను పొందవచ్చు. రూ.5 టాక్‌టైంను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో రోజువారీ 2.5GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5G డేటా ను కూడా వినియోగించుకోవచ్చు. మరియు హలో ట్యూన్స్‌ను ఉచితంగా పొందవచ్చు. పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI మోడల్ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ నెలరోజులుగా ఉంది.
రూ.619 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs619 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ప్రతిరోజు 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 1.5GB డేటా 4G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 60 రోజులుగా ఉంది. ఎయిర్‌టెల్ యూజర్లు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ఉచితంగా హలోట్యూన్స్‌ను వినియోగించుకోవచ్చు.
రూ.929 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు రోజువారీ అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 100 SMS లను పొందవచ్చు. మరియు రోజువారీ 1.5GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్‌లో (Airtel Rs929 Recharge Plan) భాగంగా పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. మరియు ఉచితంగా హలోట్యూన్స్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది.


Click it and Unblock the Notifications








