Home
News

ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు

భారతీయ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల మంది వినియోగదారులు 5G సేవలను పొందుతున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని నగరాలు మరియు జిల్లాల్లో 5G సేవలను విజయవంతంగా అమలు చేయడం ద్వారా ఈ మైలురాయిని సాధించినట్లు కంపెనీ ఈ ప్రకటనలో తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్‌టెల్ 5G విస్తరణ
ఆంధ్రప్రదేశ్‌లో గత ఆరు నెలల్లో 5G వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఎయిర్‌టెల్ హైలైట్ చేసింది. తన నెట్‌వర్క్ విస్తరణ ప్రణాళిక ద్వారా తన సేవలను మొత్తం రాష్ట్రమంతటా సమర్థవంతంగా విస్తరించిందని, కస్టమర్‌లు 5Gని స్వీకరించే ప్రక్రియను సులభతరం చేసిందని కంపెనీ పేర్కొంది.

Airtel 5G Plans

Airtel యొక్క 5G నెట్‌వర్క్ ద్వారా కవర్ చేయబడిన ల్యాండ్‌మార్క్‌ ప్రదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకించి, అమరావతి స్థూపం, తిరుమల తిరుపతి దేవస్థానం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు మరియు అరకు లోయ వంటి సుందరమైన పర్యాటక ప్రదేశాలు వంటి ఐకానిక్ నిర్మాణ అద్భుతాలను కవర్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్ అంతటా తన 5G విస్తరణను కొనసాగిస్తున్నట్లు ఎయిర్‌టెల్ సూచించింది.

ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల మంది వినియోగదారుల మైలురాయిపై వ్యాఖ్యానిస్తూ, భారతి ఎయిర్‌టెల్, "ఆంధ్రప్రదేశ్‌లో 5Gని విస్తృతంగా స్వీకరించడానికి అవసరమైన నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను నిర్మించడంలో మేము గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నాము. అపరిమిత 5G సేవల యొక్క శక్తిని ఆస్వాదించడానికి అప్‌గ్రేడ్ చేసిన మా విలువైన వినియోగదారులకు మేము మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా మా కస్టమర్‌లను రాష్ట్రంలోని అత్యంత వేగవంతమైన, అత్యంత విశ్వసనీయమైన మరియు అత్యాధునిక 5G నెట్‌వర్క్‌కు స్థిరంగా కనెక్ట్ చేయడం కోసం మేము ప్రయత్నిస్తాము అని తెలియచేసారు.

5G అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము
నివేదికల ప్రకారం తమిళనాడు, గుజరాత్ మరియు జమ్మూ, కాశ్మీర్ మరియు లడఖ్‌లలో 10 మిలియన్ల 5G వినియోగదారులను అధిగమించినట్లు ఎయిర్‌టెల్ మునుపటి ప్రకటనలలో తెలియచేసింది.

వేగవంతమైన నెట్‌వర్క్ ను అభివృద్ధి చేయడానికి, వేగవంతమైన 5G రోల్‌అవుట్ మరియు 5G పరికరాల పెరుగుతున్న లభ్యతతో సహా బహుళ కారకాలతో భారతదేశంలో 5G యొక్క వేగవంతమైన విస్తరణ కు ఎయిర్టెల్ కారణమని పేర్కొంది.

త్వరలో 5G రీఛార్జ్‌ ప్యాక్‌లు రానున్నాయి
దేశంలో 5G సర్వీసులు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఉచితంగానే 5G సేవలను అందిస్తున్నాయి. అంటే 4G ప్యాక్‌పైన అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.

అయితే ఈ అన్‌లిమిటెడ్‌ డేటా సర్వీసులపై జియో, ఎయిర్‌టెల్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలో 5G రీఛార్జ్‌ ప్యాక్‌లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తు్న్నారు. దాంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉచిత సేవలను నిలిపివేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.

Best Mobiles in India

English summary
Airtel Surpasses 7.9 Million 5G Users Milestone In Andhrapradesh. 5G Coverage Cities And New Expansion Plans Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X