జియోతో చావో రేవో తేల్చుకుంటాం: ఎయిర్‌టెల్

Written By:

టెలికం దిగ్గజ కంపెనీ 'ఎయిర్‌టెల్‌' తన ప్రత్యర్థి 'రిలయన్స్‌ జియో'కి పోటీనివ్వడానికి రెడీ అవుతోంది. 2018, మార్చి నాటికి ఎలాగైనా వాయిస్‌ ఓవర్‌ లాంగ్‌ టర్మ్‌ ఎవొల్యూషన్‌ (వీవోఎల్‌టీఈ) సర్వీసును దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

బీ రెడీ, నోకియా 8 రిలీజ్ డేట్ వచ్చేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు

ఈ  వీవోఎల్‌టీఈ సాయంతో 4జీ టెక్నాలజీతో ఫోన్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు దేశవ్యాప్తంగా వీవోఎల్‌టీఈ సర్వీసును అందుబాటులోకి తీసుకువస్తామని భారతీ ఎయిర్‌టెల్‌ (ఇండియా, దక్షిణాసియా) ఎండీ, సీఈవో గోపాల్‌ విట్టల్‌ తెలిపారు.

రిలయన్స్‌ జియో మాత్రమే

కాగా దేశంలో కేవలం రిలయన్స్‌ జియో మాత్రమే వీవోఎల్‌టీఈ టెక్నాలజీ సాయంతో 4జీ నెట్‌వర్క్‌లో వాయిస్‌ కాల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. మిగిలిన టెల్కోలన్నీ వాటి 2జీ, 3జీ నెట్‌వర్క్స్‌ సాయంతోనే 4జీ కస్టమర్లకు వాయిస్‌ కాల్స్‌ను అందిస్తున్నాయి.

3జీ నెట్‌వర్క్‌

ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే భారత్‌లో 3జీ నెట్‌వర్క్‌ చాలా వేగంగా అంతరిస్తుందని విట్టల్‌ అభిప్రాయపడ్డారు.

తాము ఆ దారిలో

జియో 4జీ ఫీచర్‌ ఫోన్‌ ఆవిష్కరణపై స్పందిస్తూ.. తాము ఆ దారిలో ప్రయాణించబోమని పేర్కొన్నారు. జియో ఫీచర్‌ ఫోన్‌ వల్ల 4జీ సర్వీసులకు కొత్త విభాగం ఏర్పాటవుతుందని తెలిపారు.

ఈ ఫీచర్‌ ఫోన్‌ ధర ఎక్కువ

ప్రస్తుత మార్కెట్‌ పరంగా చూస్తే ఈ ఫీచర్‌ ఫోన్‌ ధర ఎక్కువగా ఉందన్నారు. ప్రత్యర్థి కంపెనీలను ఎదుర్కోవడానికి పోటీ ధరల విధానాన్ని అవలంభిస్తున్నాం. దీన్నే కొనసాగిస్తాం అన్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel to take on Reliance Jio with VoLTE service rollout by March 2018 Read more aat gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot