Just In
Don't Miss
- News
చిన్నారులతో అశ్లీల కార్యకలాపాలు చేయిస్తున్న వారిపై తమిళ పోలీసుల కొరడా
- Finance
మాంద్యం దెబ్బ, మోడీ ప్రభుత్వం కొత్త ప్లాన్: PFపై ఉద్యోగులకు శుభవార్త!
- Movies
బాలయ్య-వినాయక్ మళ్లీ మొదటికి.. ఆ చిత్రాన్ని మించి..నిర్మాత అతడే
- Sports
వీడియో: వన్‌డౌన్‌లో శివమ్ దూబేని పంపడం వెనుక ప్రధాన కారణమిదే!
- Lifestyle
డయాబెటిస్ మరియు జుట్టు రాలడం: డయాబెటిస్ వల్ల పురుషులకు జుట్టు రాలవచ్చు, బట్టతల రావచ్చు ఎలాగో తెలుసా?
- Automobiles
హోండా యాక్టివా కొంటున్నారా..? అదిరిపోయే ఆఫర్లు మీ కోసం..
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
Airtel 3జీ షట్‌డౌన్, 4జీకి వెంటనే అప్‌గ్రేడ్ అవ్వండి
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ఎయిర్ టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. భారత మూడో అతిపెద్ద టెలికం ఆపరేటర్ ఎయిర్ టెల్ వచ్చే ఏడాది మార్చి నాటికి 3జీ నెట్వర్క్ సేవలను దేశవ్యాప్తంగా నిలిపి వేయనున్నట్లు వెల్లడించింది.తొలుత కోల్‌కతా సర్కిల్‌తో ఈ ప్రక్రియను మొదలుపెట్టింది. సెప్టెంబరు నాటికి మరో 6-7 సర్కిళ్లలో, డిసెంబరు నుంచి వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా సేవలను ఆపివేయనున్నట్లు భారతీ ఎయిర్టెల్ ఇండియా, దక్షిణాసియా విభాగ సీఈఓ గోపాల్ విఠల్ తెలిపారు.
2020, ఏప్రిల్ నాటికి తమ నెట్వర్క్ కేవలం 2జీ, 4జీ కస్టమర్లను మాత్రమే కలిగి ఉండనుందని ఆయన అన్నారు. మార్జిన్లతోపాటు ఒక్కో కస్టమర్‌పై ఆర్జించే సరాసరి ఆదాయాన్ని(ఏఆర్పీయూ) పెంచుకోవడంపైనే పూర్తి దృష్టిసారించినట్లు కంపెనీ పేర్కొంది.

సెప్టెంబర్ నాటికి మరో 6 నుంచి 7 సర్కిల్స్ లో
LTE పై అందించే 3జీ సర్వీసులో అదనంగా 900మెగాహెడ్జ్ తో కలిపి మొత్తాన్ని షట్ డౌన్ చేశాం. ఈ ప్రయోగం బాగా పనిచేసింది. సెప్టెంబర్ నాటికి మరో 6 నుంచి 7 సర్కిల్స్ లో కూడా 3G సర్వీసులను షట్ చేయనున్నాం. డిసెంబర్ నుంచి మార్చి నాటికి మొత్తం 3G నెట్ వర్క్ షట్ డౌన్ చేయనున్నట్టు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) బాదల్ బాగ్రి తెలిపారు.

రూ.2వేల 866 కోట్ల నష్టాలు
డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 3G నెట్ వర్క్ సర్వీసులు నిలిపివేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. చాలా సర్కిళ్లలో 10 నుంచి 15మెగాహెర్ట్జ్ మధ్య 2వేల 1వంద బ్యాండ్ స్పెక్ట్రమ్ ఉన్నట్టు బాగ్రి తెలిపారు. ఆర్థిక సంవత్సరం 2020లో తొలి త్రైమాసికంలో టెలికం మేజర్ భారతీ ఎయిర్ టెల్ రూ.2వేల 866 కోట్లతో భారీ నష్టాన్ని చవిచూసింది. గత ఏడాదిలో ఇదే సమయానికి రూ.97.30 కోట్లు ఆర్జించింది.

16 దేశాల్లో కస్టమర్ బేస్ 403.7 మిలియన్లు
ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో అసాధారణ స్థితిలో రూ.1వెయ్యి 469.40 కోట్లు నష్టపోయింది. గత ఏడాది ఇదే సమయానికి రూ.362.10 కోట్లు నష్టపోయింది. కానీ, సగటున ఆదాయం అదే జూన్ త్రైమాసికంలో ఒక యూజర్‌కు (ARPU) రూ.129కు పెరిగింది. ఏడాది క్రితం జూన్ త్రైమాసికంలో రూ.105 వరకు పెరిగింది. 16 దేశాల్లో జూన్ త్రైమాసికం ముగిసే నాటికి మొత్తం మీద ఎయిర్ టెల్ కస్టమర్ బేస్ 403.7 మిలియన్ల దగ్గర నిలవగా ఏడాదిపరంగా పరిశీలిస్తే 10.9 శాతం వరకు తగ్గిపోయింది.

పెరిగిన కస్టమర్ల సంఖ్య
తొలి త్రైమాసికంలో ఎయిర్ టెల్ కస్టమర్ల సంఖ్య 95 మిలియన్లు ఉండగా ఇందులో 9 మిలియన్ల మంది కస్టమర్లు పెరిగారు. బాగ్రి కథనం ప్రకారం.. ఎయిర్ టెల్ 26వేలకు పైగా మొబైల్ బ్రాడ్ బ్యాండ్ బేసిడ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఎయిర్ టెల్ ARPU రూ.129 ఉండగా.. కస్టమర్ బేస్ 99శాతానికి పైగా ఉంది. కస్టమర్ బేసిడ్ నుంచి నెలవారీ డేటా వాడకం సగటున నెలకు 11.7GB వరకు ఉందని బాగ్రి చెప్పారు.

కస్టమర్లు సరాసరిగా నెలకు 11జీబీ డేటా
టెలికాం రంగ దీర్ఘకాల మనుగడకు చార్జీలు పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కంపెనీ నెట్‌వర్క్‌లోకి కొత్తగా 84 లక్షల మంది 4జీ కస్టమర్లు చేరారు. దీంతో కంపెనీ నెట్‌వర్క్‌లో డేటా సేవలందుకుంటున్న వినియోగదారుల సంఖ్య 12 కోట్లకు చేరుకుంది. అందులో 4జీ యూజర్ల వాటా 9.5 కోట్లు. తమ కస్టమర్లు సరాసరిగా నెలకు 11జీబీ డేటా వినియోగించుకుంటున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది.
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
18,200
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090