ఇకపై ఎయిర్‌టెల్ టీవీని కంప్యూటర్ ద్వారా చూడవచ్చు,ఎలాగో తెలుసుకోండి
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు మరో శుభవార్త చెప్పింది. ఇకపై ఎయిర్‌టెల్ టీవీ వెబ్ వెర్షన్‌లోనూ లభ్యం కానుంది. ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్‌కే పరిమితమైన
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు మరో శుభవార్త చెప్పింది. ఇకపై ఎయిర్‌టెల్ టీవీ వెబ్ వెర్షన్‌లోనూ లభ్యం కానుంది. ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్‌కే పరిమితమైన ఎయిర్‌టెల్ టీవీ సేవలు ఇకపై డెస్క్‌టాప్ వెర్షన్‌లోనూ లభించనున్నాయి.ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై ఎయిర్‌టెల్ టీవీ యాప్‌లోనే కాకుండా డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్లలోనూ వెబ్‌బ్రౌజర్లలోనూ ఎయిర్‌టెల్ టీవీ సేవలను పొందవచ్చు. మరి కస్టమర్లు ఎలా పొందాలో ఓ సారి చూద్దాం.

ఎయిర్‌టెల్ టీవీ వెబ్ సేవలను పొందడానికి వినియోగదారులు మొదటగా https://www.airtelxstream.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
తర్వాత వినియోగదారులు తమ ఎయిర్‌టెల్ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది.
నమోదు చేయగానే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని వెరిఫై చేయాల్సి ఉంటుంది.
దీంతో సభ్యత్వ పక్రియ పూర్తయినట్లే. ఇక నిశ్చితంగా ఎయిర్‌టెల్ టీవీ సేవలను పొందవచ్చు.

పరిమిత సంఖ్యలో మాత్రమే
ప్రస్తుతం ఎయిర్‌టెల్ టీవీ వెబ్‌వెర్షన్‌లో పరిమిత సంఖ్యలో మాత్రమే వీడియోలు, ఇతర లైవ్ టీవీ సేవలను అందుబాటులో ఉంచారు. త్వరలో పూర్తి స్థాయిలో అన్ని వీడియో సబ్‌స్క్రిప్షన్ సర్వీసులు, లైవ్ టీవీ సేవలను అందివ్వనున్నారు.

వింక్ ట్యూబ్ మ్యూజిక్, వీడియో స్ట్రీమింగ్ యాప్
కొద్ది రోజుల క్రితం ఎయిర్‌టెల్ వింక్ ట్యూబ్ మ్యూజిక్, వీడియో స్ట్రీమింగ్ యాప్‌ను తన కస్టమర్ల కోసం లాంచ్ చేసింది. ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు ఈ యాప్ సేవలను ఉచితంగా అందిస్తున్నది. యూట్యూబ్ మ్యూజిక్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ తదితర మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌లలాగే వింక్ ట్యూబ్ మ్యూజిక్, వీడియో స్ట్రీమింగ్ యాప్ పనిచేస్తుంది. ఇందులో 40 లక్షల పాటలను, వీడియోలను అందుబాటులో ఉంచారు.

ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై మాత్రమే
ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై మాత్రమే లభిస్తున్నది. త్వరలోనే ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై కూడా ఈ యాప్‌ను లాంచ్ చేయనున్నారు. ఇక ఈ యాప్‌లో హిందీ, పంజాబీ, భోజపురి భాషలకు చెందిన పాటలు, వీడియోలను మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంచారు. త్వరలో తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ తదితర 12 భారతీయ భాషలకు చెందిన పాటలు, వీడియోలను అందుబాటులో ఉంచనున్నారు.

పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో పలు మార్పులు
ఈ మధ్య ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో పలు మార్పులు చేసింది. ఇకపై రూ.399 కు బదులుగా వినియోగదారులకు రూ.499 ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఇందులో కస్టమర్లకు 75 జీబీ డేటా, అన్‌లిమిడెట్ లోకల్, ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ కింద మూడు నెలల నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, ఏడాది పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, జీ5 సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ టీవీ ప్రీమియం, హ్యాండ్ ప్రొటెక్షన్ సర్వీస్‌లు లభిస్తాయి.

ఎయిర్‌టెల్ రూ.749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
ఎయిర్‌టెల్ రూ.749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 125 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, పైన చెప్పిన ఎయిర్ టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ సేవలు అన్నీ లభిస్తాయి. అలాగే రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 150 జీబీ డేటా, రూ.1599 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ డేటా లు వస్తాయి. అలాగే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ సేవలు అన్నీ లభిస్తాయి.


Click it and Unblock the Notifications








