జియో రూ.799కి కౌంటర్ వేసిన ఎయిర్‌టెల్, అదనపు డేటా షురూ !

Written By:

జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌కి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్‌తో కౌంటర్ ఇచ్చింది. ఎయిర్‌టెల్ సంస్థ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు అందుబాటులో ఉంచిన రూ.799 ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పటి వరకు ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు రోజూ 3జీబీ మొబైల్ డేటా లభించేది. కాగా దీని పరిమితిని మరో 500 ఎంబీ పెంచారు.

బిఎస్ఎన్ఎల్ న్యూ ఆఫర్, ఈ రోజే లాస్ట్..

దీంతో ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు ఇప్పుడు రోజూ 3.5జీబీ డేటా చొప్పున 28 రోజుల వాలిడిటీకి గాను మొత్తం 98 జీబీ డేటా వినియోగదారులకు లభిస్తుంది. దీంతో పాటు కస్టమర్లకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ లభిస్తాయి. వీటిని రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాల చొప్పున వాడుకోవాల్సి ఉంటుంది. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

రజనీకాంత్ రాజకీయ వార్త ఆలస్యం, వాట్సప్ డౌన్, అసలు న్యూస్ ఏంటంటే..?

కాగా జియోలో ఇదే ప్లాన్ ద్వారా వినియోగదారులకు రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. అయితే ఇది జియోలో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌గా ఉంది.
ఎయిర్‌టెల్‌లో ఇప్పుడు లభిస్తున్న ప్లాన్లపై ఓ లుక్కేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 199 ప్లాన్

వ్యాలిడిటీ 28 రోజులు
అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి కాల్స్
అన్‌లిమిటెడ్ ఎసెమ్మెస్‌లు
1 జిబి డేటా

రూ. 349 ప్లాన్

వ్యాలిడిటీ 28 రోజులు
అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి కాల్స్
అన్‌లిమిటెడ్ ఎసెమ్మెస్‌లు
రోజుకు 1.5 జిబి డేటా

రూ. 448 ప్లాన్

వ్యాలిడిటీ 70 రోజులు
అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి కాల్స్
అన్‌లిమిటెడ్ ఎసెమ్మెస్‌లు
రోజుకు 1 జిబి డేటా

రూ. 549 ప్లాన్

వ్యాలిడిటీ 28 రోజులు
అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి కాల్స్
అన్‌లిమిటెడ్ ఎసెమ్మెస్‌లు
రోజుకు 2.5 జిబి డేటా

రూ. 799ప్లాన్

వ్యాలిడిటీ 28 రోజులు
అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి కాల్స్
అన్‌లిమిటెడ్ ఎసెమ్మెస్‌లు
రోజుకు 3.5 జిబి డేటా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel updates Rs 799 pack with 3.5GB daily data to compete with Reliance Jio More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot