తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్‌టెల్ 4జీ పరుగో పరుగు

భారతీ ఎయిర్‌టెల్ తన ప్రాజెక్ట్ లీప్‌లో భాగంగా అప్‌గ్రేడెడ్ 4జీ నెట్‌వర్క్‌ను తెలుగు రాష్ట్రాల్లో లాంచ్ చేసింది. దీంతో ఈ ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ 4జీ స్పీడ్ మరింత పెరగబోతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డ్యుయల్ క్యారియర్ టెక్నాలజీ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్లలో ఎయిర్‌టెల్ అమర్చిన డ్యుయల్ క్యారియర్ టెక్నాలజీ.. TD-LTE (2300Mhz),FD-LTE (1800Mhz) కాంభినేషన్‌లో వర్క్ అవుతుంది. ఈ రెండు తెలుగు  ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ 4జీ సేవలు 160 పట్టణాల వరకు విస్తరించి ఉన్నాయి.

నెట్‌వ‌ర్క్ సామ‌ర్థ్యాన్ని విశ్లేషించుకుంటోంది..

ప్రాజెక్ట్ లీప్ ద్వారా ఎయిర్‌టెల్ త‌న నెట్‌వ‌ర్క్ సామ‌ర్థ్యాన్ని త‌నే విశ్లేషించుకుంటోంది. ఇందు కోసం భార‌తీ ఎయిర్‌టెల్ యాజ‌మాన్యం ఇప్ప‌టికే పెద్ద‌మొత్తంలో పెట్టుబ‌డులు పెట్టింది.

విష్యత్తు అవసరాలకు సరిపడే విధంగా..

ప్రాజెక్ట్ లీప్ ద్వారా తమ యూజర్లకు మెరుగైన నెట్‌వర్క్ సౌకర్యాలను కల్పించడంతో పాటు భవిష్యత్తు అవసరాలకు సరిపడే విధంగా నెట్‌వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది.

2016కు గాను వేగవంతమైన మొబైల్‌ నెట్‌వర్క్‌‌

2016లో అత్యంత వేగమైన మొబైల్‌ నెట్‌వర్క్‌‌గా భారతీ ఎయిర్‌టెల్‌ నిలిచిందని బ్రాడ్‌బ్యాండ్‌ టెస్టింగ్‌, నెటవర్క్‌ విశ్లేషణ అప్లికేషన్‌ ఓక్లా ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.

ఓక్లాకు చెందిన స్పీడ్‌టెస్ట్‌ యాప్‌ ద్వారా

ఓక్లాకు చెందిన స్పీడ్‌టెస్ట్‌ యాప్‌ ద్వారా దేశంలోని మొబైల్‌ వినియోగదారులపై ఆధునిక పరికరాలతో మిలియన్ల సంఖ్యలో స్పీడ్‌ టెస్టులు నిర్వహించి ఈ నివేదిక తయారు చేశారు.

ఎయిర్‌టెల్ యూజర్ల సంఖ్య 26.5 కోట్లు..

ప్ర‌స్తుతం దేశంలో 100 కోట్ల‌కు పైగా మొబైల్ వినియోగ‌దారులు ఉండ‌గా ఎయిర్‌టెల్ నెట్‌వ‌ర్క్ వాడే వారి సంఖ్య 26.5 కోట్లుగా ఉంది. అందులో యాక్టివ్‌గా ఉండే స‌బ్‌స్క్రైబ‌ర్ల సంఖ్య 96.83 శాతంగా ఉంది. 8నెలల క్రితం మార్కెట్లోకి ప్ర‌వేశించిన జియో, తన కస్టమర్ల సంఖ్యను 10 కోట్ల‌కు పెటంచుకోగలిగింది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel upgrades 4G network for a better experience. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot