Home
News

Airtel మాస్టర్ ప్లాన్లో వినియోగదారులకు షాక్.. ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీలో కోతలు..!

భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా ఉన్న ఎయిర్‌టెల్ తన ARPU (Average Revenue Per User) ను పెంచాలనే ఉద్దేశంతో తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా భారతి ఎయిర్‌టెల్ తన రూ.219 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క చెల్లుబాటు గడువును తగ్గించింది. టెలికాం రంగంలో భారీ పెట్టుబడుల నేపథ్యంలో, ఎయిర్‌టెల్ లాభాలను మెరుగుపరచేందుకు దశలవారీగా ప్రీపెయిడ్ ప్లన్స్ టారిఫ్ మార్పులను చేస్తున్నది.

ఇందులో భాగంగా ప్రస్తుతం ఎయిర్‌టెల్ రూ. 219 ప్లాన్ లో 3GB డేటా, 30 ఎస్ఎంఎస్ లు, అని లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తుంది. అయితే తాజగా ఎయిర్‌టెల్ ఈ ప్లాన్ లో స్వల్ప మార్పులు చేసింది. ఇందులో అవే లాభాలు కొనసాగుతున్నాయి.. కానీ, ఇందులో ఒకే ఒక్క మార్పు చేసింది. అదే ప్లాన్ చెల్లుబాటు గడువు (Validity).

Airtel

గడువు 30 రోజుల నుండి 28 రోజులకే తగ్గింపు:
అంతకుముందు ఈ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటు గడువుతో అందుబాటులో ఉండేది. కానీ, ఇప్పుడు అదే ప్లాన్ 28 రోజుల మాత్రమే చెల్లుబాటు అయ్యే విధంగా మార్పు చేయబడింది. దీనితో వినియోగదారుడికి ఒక రోజుకు ప్లాన్ ఖర్చు రూ.7.82గా ఖర్చు అవుతుంది.

ఈ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ చాలా ప్రత్యేకంగా 30 రోజుల వాలిడిటీతో అందించేది. కానీ, ఇప్పుడు అది కూడా 28 రోజులకు తగ్గించడంతో.. 30 రోజుల చెల్లుబాటు గడువు ఉన్న ప్లాన్‌లు మరింత తగ్గిపోతున్నాయి.

భవిష్యత్తులో టారిఫ్ పెంపు?
ఎయిర్‌టెల్ ఇటీవలే టారిఫ్ పెంపును మద్దతు చేస్తూ పలుమార్లు ప్రకటనలు చేసింది. టెలికాం రంగంలో పెట్టుబడి అవసరాలు అధికంగా ఉన్న పరిస్థితులలో, కంపెనీ తన సగటు ఆదాయాన్ని (ARPU) రూ.300కి పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే, 2024 జూలైలో చివరిసారిగా టెలికాంలు టారిఫ్‌ను పెంచాయి. ఈ పెంపు వల్ల ARPU మెరుగుపడినప్పటికీ, మార్కెట్‌లో SIM అనుసంధానం (SIM consolidation) వంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే, 2025లో టారిఫ్ పెంపు ఉండకపోవచ్చని.. 2026లో మాత్రం మరోసారి టారిఫ్ పెంపు జరిగే అవకాశం ఉందని టెలికాం రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ ప్లాన్‌లో వాలిడిటీ తగ్గింపు వినియోగదారులకు కొంత అసౌకర్యంగా అనిపించినా, టెలికాం కంపెనీల వ్యూహపరంగా కీలకమైన నిర్ణయంగా నిలుస్తోంది. మరిన్ని 30 రోజుల ప్లాన్‌లను ఎంచుకునే ఎంపికలు తగ్గిపోతుండటంతో, వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా కొత్త ప్లాన్‌లను పరిగణించాల్సిన అవసరం ఉంది.

ఎయిర్‌టెల్ రోమింగ్ (IR) ప్యాక్స్:
భారతి ఎయిర్‌టెల్ తన అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ (IR) ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్లు విదేశాల్లో ఉన్న సమయంలో నిరంతరంగా కనెక్టివిటీని కల్పించేందుకు రూపొందించబడ్డాయి. ఎయిర్‌టెల్ రెండు ప్రధాన ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.

ఇందులో మొదటిగా, ఎయిర్‌టెల్ రూ. 4000 ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్. ఇది తరచూ విదేశాలకు ప్రయాణించే వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ ప్లాన్ 365 రోజుల భారీ వాలిడిటీతో వస్తుంది. విదేశాల్లో ఉపయోగించేందుకు ఇందులో 5GB డేటా, అలాగే స్థానిక దేశాలకు 100 నిమిషాల ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్, 100 SMSలు అందుబాటులో ఉంటాయి.

అంతేకాక, భారతదేశంలో కూడా ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ రోజుకు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు పొందవచ్చు. అదనంగా, ఈ ప్లాన్‌తో ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీ, 24x7 కస్టమర్ సపోర్ట్, ల్యాండ్ అయిన వెంటనే ఆటోమేటిక్ యాక్టివేషన్, ఆటో-రిన్యూవల్ ఆప్షన్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ ప్లాన్ ప్రపంచవ్యాప్తంగా 189 దేశాల్లో పనిచేస్తుంది.

అలాగే తక్కువకాలిక ప్రయాణికుల కోసం రూ. 789 ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ కేవలం 5 రోజుల అంతర్జాతీయ రోమింగ్ (IR) ప్యాక్‌ను అందిస్తుంది. చిన్న ట్రిప్‌లకు వెళ్లేవారిని దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రత్యేకంగా రూపొందించింది ఎయిర్‌టెల్. ఈ ప్యాక్ కూడా ఏకంగా 189 దేశాల్లో పనిచేస్తుంది. దీనితో, విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, తక్కువ ఖర్చుతో కనెక్టివిటీని అందించడంలో ఎయిర్‌టెల్ మరో ముందడుగు వేసింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel Users Alert: Rs 219 Prepaid Plan Now Valid for 28 Days Instead of 30 Days
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X