ఎయిర్‌టెల్ యూజర్లు రూ.6,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు!! ఎలాగో తెలుసా??

|

ఇండియాలోని టెలికాం సంస్థలలో అధిక మంది యూజర్లను కలిగి వారిలో రెండవ స్థానంలో గల భారతీ ఎయిర్‌టెల్ భారతదేశంలో డిజిటల్ వృద్ధిని పెంచడానికి తన వంతు కృషిని చేస్తున్నది. ఈ చొరవలో భాగంగా ఎయిర్‌టెల్ వినియోగదారులను ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలను చేస్తున్నది. ప్రస్తుతం ఇండియాలో పండుగ వాతావరణం ఉన్నందున ఈ కామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్లతో అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

 

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ వినియోగదారులు ఎవరైనా సరే ఇప్పుడు సుమారు రూ.12,000 లేదా అంతకంటే ఎక్కువ ధర గల విలువైన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసినప్పుడు ఎయిర్‌టెల్ సంస్థ వారికి రూ.6,000 వరకు క్యాష్ బ్యాక్ ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించడానికి ఎయిర్‌టెల్ కంపెనీ ప్రముఖ బ్రాండ్‌లలో 150 కి పైగా స్మార్ట్‌ఫోన్‌లను షార్ట్‌లిస్ట్ చేసింది. కానీ కస్టమర్లు కొనుగోలు చేసేటప్పుడు వారి వైపు నుండి కూడా కొన్ని నిబంధనలు మరియు షరతులు పాటించాలి. ఎయిర్‌టెల్ యొక్క క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తించాలంటే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వారు ఎయిర్‌టెల్ కస్టమర్ తప్పనిసరిగా అయిఉండాలి. అంతేకాకుండా వారు రూ.249 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్రీపెయిడ్ ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ రీఛార్జ్ కూపన్ల రూపంలో 36 నెలల (3 సంవత్సరాలు) వరకు ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారతీ ఎయిర్‌టెల్ రూ.6,000 క్యాష్ బ్యాక్ ఆఫర్
 

భారతీ ఎయిర్‌టెల్ రూ.6,000 క్యాష్ బ్యాక్ ఆఫర్

భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుతం తన యొక్క వినియోగదారులకు అందించే రూ.6,000 క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని 36 నెలల వ్యవధిలో రెండు భాగాలుగా అందిస్తుంది. రూ.249 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్రీపెయిడ్ ప్యాక్‌తో 18 నెలలపాటు నిరంతర రీఛార్జ్‌లను పూర్తి చేసినప్పుడు మొదటి క్యాష్‌బ్యాక్ రూ.2,000 వినియోగదారులకు అందించబడుతుంది.  ఇంకా రూ.249 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో 36 నెలల రీఛార్జి పూర్తి చేసిన తర్వాత రూ.4,000 మిగిలి మొత్తం వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ రూపంలో అందించబడుతుంది.

జియో నెట్‌వర్క్ వైఫల్య వినియోగదారులకు రెండు రోజుల ఉచిత సర్వీస్!!జియో నెట్‌వర్క్ వైఫల్య వినియోగదారులకు రెండు రోజుల ఉచిత సర్వీస్!!

ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్

ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్

ఇది మాత్రమే కాకుండా ఎయిర్‌టెల్ సంస్థ తన యొక్క వినియోగదారులకు రూ.4,800 విలువైన ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ప్రయోజనాన్ని కూడా కస్టమర్‌లకు అందిస్తోంది. రూ.12,000 లోపు లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ కోసం స్క్రీన్ రీప్లేస్ చేయడానికి సుమారుగా అయ్యే ఖర్చు రూ .4,800. దీనిని ఎయిర్‌టెల్ యూజర్లకు ఉచితంగా అందిస్తుంది.

WhatsApp లో చాట్‌లను శాశ్వతంగా దాచడం ఎలా?WhatsApp లో చాట్‌లను శాశ్వతంగా దాచడం ఎలా?

ప్రీపెయిడ్ ప్యాక్‌

భారతీ ఎయిర్‌టెల్ యొక్క ప్రీపెయిడ్ ప్యాక్‌లతో వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఒక నెల పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఫ్రీ ట్రయల్ మరియు మరిన్నింటితో సహా ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలను ఉచితంగా పొందడానికి కూడా వినియోగదారులు అర్హులు. స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని అందించడానికి భారతీ ఎయిర్‌టెల్ భారతదేశంలోని కొన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫర్ ఆదర్శంగా కంపెనీ మొత్తం ఆదాయాలు మెరుగయ్యే అవకాశం ఉంది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్

భారతదేశం వైవిధ్యభరితమైన దేశం కాబట్టి దేశంలోని వివిధ ప్రాంతాలు వివిధ భాషల్లో కంటెంట్‌ను వినియోగించాలనుకుంటాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యూజర్లు హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ, తెలుగు, కన్నడ, మలయాళం, గుజరాతీ, పంజాబీ మరియు ఆంగ్లంతో సహా పలు భాషలలో కంటెంట్‌ను ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది. ఈ ప్లాట్‌ఫాం ఇతర OTT కంటెంట్ డిస్ట్రిబ్యూటర్‌లైన ఎపికాన్, షార్ట్స్ టీవీ, ఎరోస్ నౌ మరియు ముబి వంటి వాటితో భాగస్వామిగా ఉంది. ఇది విభిన్నమైన శైలులను వీక్షించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ విధంగా వినియోగదారులు కంటెంట్‌ని సెర్చ్ చేయడానికి వివిధ ప్లాట్‌ఫారమ్‌లకు వెళ్లవలసిన అవసరం లేదు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో తమకు ఇష్టమైన అన్ని షోలు మరియు సినిమాలను పొందవచ్చు.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ (AePS) ప్లాట్‌ఫామ్ ఆధారంగా FY21 లో దాదాపు 50 మిలియన్లకు పైగా నగదు యొక్క విత్ డ్రా లావాదేవీలు నమోదు అయినట్లు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ప్రకటించింది. AePS లో బ్యాంక్ దాదాపు 7% మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఈ లావాదేవీలలో 74% కంటే ఎక్కువ టైర్ 5/6 పట్టణాలలో ఉన్న ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క బ్యాంకింగ్ పాయింట్ల ద్వారా ప్రాసెస్ చేయబడినట్లు సంస్థ ప్రకటించింది. 500,000 లకు పైగా గల బ్యాంకింగ్ పాయింట్లతో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ భారతదేశంలో అతిపెద్ద రిటైల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది మరియు ఈ బ్యాంకింగ్ పాయింట్లలో 50% AePS ఎనేబుల్ చేయబడ్డాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Airtel Users Can Get Rs 6,000 Cashback When They Purchase New Smartphone: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X