Home
News

ఎక్కువకాలం వ్యాలిడిటీ, డేటా ప్రయోజనాలతో బెస్ట్ ఎయిర్టెల్ ప్లాన్లు!

By Maheswara

భారత టెలికాం రంగంలో ప్రజాదరణ పొందిన ఎయిర్‌టెల్ టెలికాం అనేక రకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉంది. వాటిలో చాలా వరకు ఎక్కువ డేటా ప్రయోజనాన్ని కలిగి ఉండగా, మరికొన్ని ఎక్కువ కాలం వాలిడిటీ ప్లాన్లు ఉన్నాయి. మరికొన్ని ఈ రెండు బెనిఫిట్ లు కలిగి ఉన్నాయి.

అవును, ఎయిర్‌టెల్ టెలికాం రోజువారీ ఎక్కువ డేటాతో అధిక వాలిడిటీతో కొన్ని ప్లాన్‌లను కలిగి ఉంది. ఈ ప్లాన్‌లలో అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు ఉచిత SMS లు కూడా ఉన్నాయి. కానీ ప్రధానంగా 84 రోజుల వ్యాలిడిటీ సదుపాయం ఉన్న ప్లాన్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇప్పుడు 84 రోజుల చెల్లుబాటుతో ఉన్నప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం.

Airtel Users, Looking For Best Long Time Validity And Daily Data Benefits Plans? Here Are Best Plans List.

ఎయిర్‌టెల్ రూ. 719 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు
ఎయిర్‌టెల్ టెలికాం యొక్క రూ. 719 ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం 84 రోజుల వ్యాలిడిటీ ని కలిగి ఉంది. ఈ వ్యవధిలో ప్రతిరోజూ 1.5 GB డేటా, రోజుకు 100 ఉచిత SMS లు మరియు అపరిమిత వాయిస్ కాల్‌లను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ సమయం లో మొత్తం 126GB డేటా మీకు అందుబాటులో ఉంటుంది.

ఎయిర్టెల్ యొక్క రూ. 779 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు
ఎయిర్‌టెల్ టెలికాం యొక్క కొత్త రూ. 779 ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం వ్యాలిడిటీ వ్యవధి 90 రోజులు. ఈ వ్యవధిలో ప్రతిరోజూ 1.5 GB డేటా ప్రయోజనం లభిస్తుంది. ఇది ఎయిర్‌టెల్‌తో సహా ఇతర నెట్‌వర్క్‌లకు అపరిమిత ఉచిత వాయిస్ కాల్‌లతో పాటు రోజుకు 100 ఉచిత SMSలను కూడా కలిగి ఉంటుంది. పూర్తి వ్యాలిడిటీ వ్యవధిలో మొత్తం 90 GB డేటా అందుబాటులో ఉంటుంది.

Airtel Users, Looking For Best Long Time Validity And Daily Data Benefits Plans? Here Are Best Plans List.

ఎయిర్టెల్ యొక్క రూ.839 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు
ఎయిర్టెల్ టెలికాం యొక్క రూ.839 ప్లాన్‌లో రోజుకు 2GB డేటా ప్రయోజనం ఉంటుంది. ఇందులో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాల్‌ల ప్రయోజనం ఉంటుంది. మరియు ప్రతిరోజూ 100 ఉచిత sms లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం 84 రోజుల పాటు వ్యాలిడిటీ ని కలిగి ఉంది. అదనంగా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.

ఎయిర్టెల్ యొక్క రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు
ఎయిర్టెల్ యొక్క రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్‌లో మొత్తం 56 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ సమయంలో ప్రతిరోజూ 3 GB డేటా ప్రయోజనం లభిస్తుంది. అలాగే అపరిమిత వాయిస్ కాల్స్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. అదనంగా, మీరు ప్రతిరోజూ 100 SMS ప్రయోజనాలను పొందుతారు.

ఎయిర్‌టెల్ రూ. 666 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు
ఎయిర్‌టెల్ టెలికాం యొక్క రూ. 666 ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం 77 రోజుల వ్యాలిడిటీ ని అందిస్తుంది. ఈ వ్యవధిలో ప్రతిరోజూ 1.5 GB డేటా లభిస్తుంది. ఇది రోజుకు 100 ఉచిత SMS లు మరియు అపరిమిత వాయిస్ కాల్‌లను కూడా కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Airtel Users, Looking For Best Long Time Validity And Daily Data Benefits Plans? Here Are Best Plans List.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X