Airtel vs Vi vs Jio: IPL చూడడానికి అవసరమైన అధిక FUP డేటాను అందించే ప్లాన్‌లు ఇవే...

|

కరోనా మహమ్మారి ఇండియాలో మొదలైనప్పటి నుండి డేటా వినియోగం మరియు దాని యొక్క డిమాండ్ భారీగా పెరిగింది. ఇంటి వద్ద నుండి పనిచేసే వారు ఇప్పుడు డేటాను అధికంగా వినియోగిస్తున్నారు. వినియోగదారులు వారి యొక్క పని మరియు వినోద అవసరాలను తీర్చుకోవడానికి విశ్వసనీయ ఇంటర్నెట్ అనుభవం కోసం గణనీయమైన సంఖ్యలో ప్రజలు ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లకు మారినప్పటికీ ఎక్కువ మంది 4G మొబైల్ డేటాపై ఆధారపడతారు. పైగా ఇప్పుడు IPL మొదలైనందున డేటా వినియోగం మరింత పెరిగింది.

FUP డేటా

భారతీయ టెలికం ఆపరేటర్లైన భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) మరియు రిలయన్స్ జియో సంస్థలు తమ యొక్క టాప్-అప్ ప్యాక్‌ల ద్వారా వినియోగదారులకు అదనపు డేటాను అందిస్తున్నాయి. కానీ ఈ ఆపరేటర్లు తమ ప్రధాన ప్రీపెయిడ్ ప్లాన్‌లలో కూడా వినియోగదారులకు అధిక డేటాను అందిస్తున్నారు. ఎయిర్టెల్, జియో మరియు Vi నుండి గరిష్ట ఫెయిర్ యూజ్ పాలసీ (FUP) డేటాను అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో గరిష్ట FUP డేటా ప్లాన్‌లు
 

రిలయన్స్ జియో గరిష్ట FUP డేటా ప్లాన్‌లు

రిలయన్స్ జియో తన వినియోగదారులకు రోజుకు 1GB నుండి 3GB వరకు డేటాను అందించే అనేక ప్లాన్‌లను అందిస్తుంది. డేటా వినియోగం కోసం వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ కంటే మొబైల్ నెట్‌వర్క్‌లపై ఎక్కువగా ఆధారపడే వారికి జియో యొక్క 3GB డేటా ప్లాన్లు సరైనవిగా ఉంటాయి. రిలయన్స్ జియో సంస్థ రోజుకు 3GB డేటాను రూ.349, రూ.401, రూ.999 ధరల వద్ద లభించే టాప్ టైర్ ప్లాన్‌లతో అందిస్తాయి. ఈ అన్ని ప్లాన్‌లు 3GB రోజువారీ డేటాతో వస్తాయి. ఇవి వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తున్నాయి. ఇంకా వినియోగదారులు రోజుకు 100 SMSలు మరియు Jio యొక్క అన్ని యాప్ లకు ఉచిత సభ్యత్వాన్ని అందిస్తుంది. FUP డేటా వినియోగం తరువాత డేటా వేగం 64 Kbps కి పడిపోతుంది. ఇందులో రూ.401 ప్లాన్ 1సంవత్సర వాలిడిటీతో డిస్నీ + హాట్స్టార్ VIP యొక్క ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనంతో వస్తుంది. రూ.349 మరియు రూ.401 ప్లాన్‌లు 28 రోజుల చెల్లుబాటును కలిగి ఉండగా రూ.999 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

వోడాఫోన్ ఐడియా గరిష్ట FUP డేటా ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా గరిష్ట FUP డేటా ప్లాన్‌లు

రూ.801, రూ.601, మరియు రూ.401 ధరల వద్ద లభించే మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లతో Vi టెల్కో గరిష్ట FUP డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లన్నీ 3GB రోజువారీ డేటాతో వస్తాయి. ఇవి వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తాయి. ఇంకా ప్రతి ప్లాన్‌లో ‘బింగే ఆల్ నైట్' ఆఫర్‌తో పాటు Vi అందించే ‘వీకెండ్ డేటా రోల్‌ఓవర్' ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. డిస్నీ + హాట్‌స్టార్ విఐపికి ఒక సంవత్సరం చందాతో ఉచితంగా లభిస్తుంది. ఈ అన్ని ప్లాన్‌లు Vi మూవీస్ & టీవీ చందాకు ఉచిత యాక్సిస్ ను అందిస్తాయి.

బోనస్ డేటా

ఈ ప్లాన్‌లు మిగిలిన వారికి కొద్దిగా విభిన్నంగా బోనస్ డేటాను కూడా అదనంగా అందిస్తుంది. రూ.401 ప్లాన్ 16GB బోనస్ డేటాను 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. అలాగే రూ.601 ప్లాన్ 32GB బోనస్ డేటాను 56 రోజుల చెల్లుబాటుకు అందిస్తుంది. చివరగా రూ.801 ప్లాన్ 48GB బోనస్ డేటాను 84 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

ఎయిర్‌టెల్ గరిష్ట FUP డేటా ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ గరిష్ట FUP డేటా ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ టెల్కో కూడా తన వినియోగదారులకు 3GB రోజువారీ డేటాను అనేక ప్లాన్‌లతో అందిస్తుంది. ఈ ప్లాన్‌లు రూ.398, రూ.448, మరియు రూ.558 ధరల వద్ద లభిస్తాయి. ఈ అన్ని ప్లాన్‌లు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100SMS మరియు 3GB రోజువారీ ఎఫ్‌యుపి డేటా ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఇవి అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ యొక్క 1 నెల OTT ప్రయోజనంను ఉచితంగా అందిస్తుంది. ఇవే కాకుండా అన్ని ప్లాన్లలో ఎయిర్టెల్ థాంక్స్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

రూ.448 ప్లాన్ వినియోగదారులకు డిస్నీ + హాట్స్టార్ విఐపి యొక్క ఉచిత చందాను 1 సంవత్సర చెల్లుబాటుకు అందిస్తుంది. రూ.398, రూ.448 ప్లాన్‌లు 28 రోజుల చెల్లుబాటుతో లభించగా రూ.588 ప్లాన్ 56 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది.

 

Best Mobiles in India

English summary
Airtel, Vi and Jio Telcos Offers Maximum FUP Data Plans For Watching IPL Matches: Here are The Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X