84 రోజుల పాటు వాడుకున్నోళ్లకు వాడుకున్నంత..
టెలికం దిగ్గజాల మధ్య వార్ మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. జియో తెరతీసిన ధరల యుద్ధం దెబ్బకి అన్ని టెల్కోలు భారీ నష్టాలను మూటగట్టుకున్న సంగతి విదితమే
టెలికం దిగ్గజాల మధ్య వార్ మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. జియో తెరతీసిన ధరల యుద్ధం దెబ్బకి అన్ని టెల్కోలు భారీ నష్టాలను మూటగట్టుకున్న సంగతి విదితమే. అయితే జియోకు పోటీగా బరిలో నిలవడానికి అన్ని కంపెనీలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. వీటిల్లో బెస్ట్ ఏదో మీరే సెలక్ట్ చేసుకోండి.

ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్
జియో ‘ధన్ ధనా ధన్' పేరుతో తెచ్చిన రూ.399 ఆఫర్‌కు పోటీగా ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం తానూ అదే ధరతో కొత్త ప్లాన్ ప్రకటించింది. 84 రోజులు చెల్లుబాటయ్యే ఈ ప్లాన్ కింద ప్రీపెయిడ్ కస్టమర్లు ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమితంగా లోకల్, ఎస్‌టిడి కాల్స్ చేసుకోవచ్చు.

4జి సిమ్ ఉన్న ప్రీపెయిడ్ కస్టమర్లు మాత్రమే
ఇంకా ఈ 84 రోజుల్లో రోజుకు ఒక జిబి చొప్పున 84 జిబిల డేటా వినియోగించుకోవచ్చు. 4జి ఫోన్లు ఉండి 4జి సిమ్ ఉన్న ప్రీపెయిడ్ కస్టమర్లు మాత్రమే ఈ ఆఫర్‌కు అర్హులు.

వొడాఫోన్ రూ. 352 ప్లాన్
84 రోజుల పాటు చెల్లుబాటయ్యే ఈ ప్లాన్ కింద రోజుకు 1 జిబి హై స్పీడ్ 4జీ డేటాను వినియోగించుకోవచ్చు. అన్ లిమిటెడ్ ఎసెమ్మెస్, కాల్స్ కూడా చేసుకోవచ్చు.

జియో రూ.399 ప్లాన్
రోజుకు 1 జిబి డేటా చొప్పున 84 రోజుల పాటు చెల్లుబాటయ్యే విధంగా ఉంటుంది. కాల్స్ అపరిమితం.

జియో రూ.309 ప్లాన్
ఈ ప్లాన్ లో మీరు రోజుకు 1జిబి డేటా చొప్పున 56 రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. కాల్స్ అపరిమితం.


Click it and Unblock the Notifications








