టెలికాం ఆపరేటర్లకు రెండేళ్ల తాత్కాలిక నిషేదం ఇచ్చిన కేంద్రం

|

టెలికాం ఆపరేటర్లు తమ వ్యాపారాన్ని నిర్వహించుకునేందుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుమే లైసెన్స్ ఫీజు. దీనితో పాటు తమ ఆదాయాన్ని ప్రభుత్వంతో పంచుకునే విధానం కూడా ఆపరేటర్లకు నష్టాలను తీసువచ్చింది అని టెల్కో కంపెనీలు ఆరోపణలు చేసాయి. ఈ విషయానికి సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీని కారణంగా టెలికామ్ సంస్థలు అన్ని కలిపి సుమారు 68 వేల కోట్లు ప్రభుత్వానికి చెల్లించమని కోర్టు తీర్పును ఇచ్చింది.

టెల్కో కంపెనీలు
 

కోర్టు తీర్పు ఇచ్చినప్పటికి నుండి టెల్కో కంపెనీలు తాము తీవ్రంగా నష్టపోయాము అని ఆరోపించాయి. ఆ నష్టాలను పూడుచుకోవడానికి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. అలాగే ప్రభుతం తమను ఆదుకోవాలని కూడా సూచించాయి. ఈ విషయం మీద సమావేశమైన కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొని కంపెనీలకు ఊరటను ఇచ్చాయి. రాబోయే రెండేళ్లకు వారు ఉపయోగించే స్పెక్ట్రం కోసం ఎటువంటి చెల్లింపులు చెల్లించవలసిన అవసరం లేదని ప్రభుత్వం అంగీకరించడంతో అప్పుల బారిన పడిన టెలికాం కంపెనీలకు సుమారు రూ.42,000 కోట్ల ఉపశమనం ఇచ్చింది.

BSNL Data offer RS.7 లకే 1GB మొబైల్ డేటా

టెలికమ్యూనికేషన్స్

ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సంస్థలు ఎయిర్‌టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియోలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. స్పెక్ట్రమ్ చెల్లింపులకు సంబంధించి సుమారు రూ.42వేల కోట్ల ఉపశమనం కల్పిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2020 - 21, 2021- 22 సంవత్సరాలకు సదరు కంపెనీలు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

BSNL Cashback ఆఫర్ : మెసేజ్ పంపడం ద్వారా క్యాష్‌బ్యాక్

టెలికాం

టెలికాం కాని ఆదాయాన్ని వారి లెక్కల కోసం పరిగణనలోకి తీసుకున్న తరువాత గత చట్టబద్దమైన బకాయిల్లో రూ .1.4 లక్షల కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు అక్టోబర్ 24 న ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశించిన మూడు నెలలకు బదులుగా బకాయిల చెల్లింపు కాలపరిమితులను మాఫీ చేయాలని టెల్కోలు కోరుతుండగా ఈ విషయం పూర్తిగా చట్టపరమైన సమస్య అని తేల్చి చెప్పారు.

హైవేలపై Dec 1 నుండి టోల్‌గేట్ పెమెంట్స్ కోసం ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి!! దీనిని పొందడం ఎలా?

స్పెక్ట్రం చెల్లింపులు
 

2020-21, 2021-22 సంవత్సరాలకు జరిగిన వేలంలో గెలిచిన స్పెక్ట్రం చెల్లింపులు వాయిదా పడ్డాయని సీతారామన్ తెలిపారు. ఇది చెల్లించే సమయం వరకు సమానంగా విభజించబడుతుంది. అలాగే అన్ని టెల్కోస్ దానిపై వడ్డీని చెల్లించవలసి ఉంటుంది మరియు వాటిని బ్యాంక్ గ్యారెంటీలతో తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. దీని ఫలితంగా అన్ని టెల్కోలకు కలిగే ప్రయోజనం వరుసగా భారతి ఎయిర్‌టెల్‌కు సుమారు రూ.11,746 కోట్లు, వొడాఫోన్ ఐడియాకు రూ .23,920 కోట్లు, రిలయన్స్ జియోకు రూ .6,670 కోట్లు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Airtel, Vodafone, Reliance Jio Get An Option To Seek A Two-year Moratorium On RS.42,000 Payments

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X