నిమిషాల్లో కొత్త సిమ్ యాక్టివేషన్, ఆధార్ ఉంటే చాలు

కొత్త మొబైల్ కనెక్షన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ భాతరదేశపు ప్రముఖ టెలికామ్ ఆపరేటర్లు అయన భారతి ఎయిర్‌టెల్ , వొడాఫోన్‌లు తమ స్టోర్‌లలో ఈ-కేవైసీ (e-KYC) సర్వీసును అమల్లోకి తీసుకువచ్చాయి. ఈ-కేవైసీ సర్వీస్ అందుబాటులోకి రావటం ద్వారా కొత్తగా మొబైల్ సిమ్ కొనుగోలు చేసేవారు గుర్తింపు పత్రం క్రింద ఆధార్ కార్డును ఇస్తే సరిపోతోంది.

నిమిషాల్లో కొత్త సిమ్ యాక్టివేషన్, ఆధార్ ఉంటే చాలు

Read More : రిలయన్స్ జియో 4జీ సిమ్‌లను సపోర్ట్ చేసే ఫోన్‌లు ఇవే!

నిన్న.. మొన్నటి వరకు కొత్త సిమ్ కనెక్షన్ పొందలాంటే అప్లికేషన్ ఫిల్ చేయటంతో పాటు ఫోటో, అడ్రస్ ప్రూఫ్ వంటి ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి వచ్చేది. ఈ తతంగం మొత్తం పూర్తయ్యి, సిమ్‌ యాక్టివేషన్‌ అవ్వాటానికి దాదాపు ఒక రోజు సమయం పట్టేది.

నిమిషాల్లో కొత్త సిమ్ యాక్టివేషన్, ఆధార్ ఉంటే చాలు

Read More : సామ్‌సంగ్‌కు పెద్ద షాక్..?

ఇక పై ఇలాంటి తతంగం ఉండదు. కొత్త మొబైల్‌ కనెక్షన్‌ కావాలనుకొనే వ్యక్తి ఆధార్‌తోపాటు వేలి ముద్ర నమోదు ద్వారా తక్షణం కొత్త మొబైల్‌ కనెక్షన్‌ పొందడంతోపాటు వెంటనే సిమ్‌ను కూడా యాక్టివేట్‌ చేసుకోవచ్చు. ఈ-కేవైసీ సర్వీసును ఎయిర్‌టెల్ ఇప్పటికే ఢిల్లీలో ప్రారంభించగా. వోడాఫోన్ నేటి నుంచి దేశవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. Trai గణాంకాల ప్రకారం భారతి ఎయిర్ టెల్ దేశవ్యాప్తంగా 25.4 కోట్ల చందాదారులను కలిగి ఉంది. మరోవైపు వొడాఫోన్ కస్టమర్ బేస్ 19.8 కోట్లుగా ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆధార్ కార్డుతో 10 లాభాలు

మీకు ఆధార్ కార్డ్ ఉన్నట్లయితే 10 రోజుల్లో పాస్‌పోర్ట్ పొందవచ్చు.

ఆధార్ కార్డుతో 10 లాభాలు

బ్యాంక్ అకౌంట్‌ను సులువుగా ఓపెన్ చేయవచ్చు.

ఆధార్ కార్డుతో 10 లాభాలు

పదవీవిరమణ చేసి, పెన్షన్ పొందుతున్న ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగులు త్రాము బ్రతికే ఉన్నామని నిరూపించుకునేందుకు ప్రతి సంవత్సరం వెరిఫికేషన్ నిమిత్తం ప్రభుత్వ అధికారుల ముందు హాజరుకావల్సిన అవసరం లేకుండా, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానం ద్వారా తాము జీవించే ఉన్నామని డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌‌ను పొందవచ్చు.

ఆధార్ కార్డుతో 10 లాభాలు

మీకు ఆధార్ కార్డ్ ఉన్నట్లయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం చాలా సులువు.

ఆధార్ కార్డుతో 10 లాభాలు

తమ ఆధార్ నెంబర్‌ను రిజిస్లర్ చుసుకోవటం ద్వారా పెన్షనర్లు నెలవారీ ఫించన్‌ను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పొందవచ్చు.

ఆధార్ కార్డుతో 10 లాభాలు

ఆధార్ నెంబర్‌ను రిజిస్లర్ చుసుకోవటం ద్వారా ప్రావిడెంట్ ఫండ్ డబ్బు సలువుగా మీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

ఆధార్ కార్డుతో 10 లాభాలు

మీకు ఆధార్ కార్డ్ ఉన్నట్లయితే ప్రభుత్వం అందిస్తోన్న డిజిటల్ లాకర్ సిస్టం సేవలను ఉపయోగించుకోవచ్చు. ఈ లాకర్ సిస్టంలో విలువైన డాక్యుమెంట్లను భద్రపరుచుకోవచ్చు.

ఆధార్ కార్డుతో 10 లాభాలు

మీకు ఆధార్ కార్డ్ ఉన్నట్లయితే ఎల్పిజి సబ్సిడీ నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

ఆధార్ కార్డుతో 10 లాభాలు

మీ ఆధార్ కార్డ్ ఓటర్ ఐడీకి లింక్ చేయబడుతుంది.

ఆధార్ కార్డుతో 10 లాభాలు

పేదలందరికీ బ్యాంక్ అకౌంట్లను సమకూర్చడం ద్వారా ఆర్థిక అస్పృశ్యతని, తద్వారా పేదరికాన్ని నిర్మూలించే లక్ష్యంతో జన్ ధన్ యోజనా పథకాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. జన్ ధన్ యోజన అకౌంట్ ఓపెన్ చేయలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel, Vodafone roll out e-KYC for instant SIM activation. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting