Airtel VS Jio: అదనపు డేటా కూపన్‌లతో లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే

|

కరోనా మహమ్మారి ప్రభావం అనేక సంస్థల మీద పడింది. చాలా మంది ఇంటి వద్ద ఉండి పనిచేయడం వలన వారికి ఇంటర్నెట్ అవసరం అధికంగా ఉంది. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ లేని చోట మొబైల్ ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నారు. అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు తమ యొక్క సబ్‌స్క్రైబర్‌లకు అనేక రకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నారు. టెల్కోలు అన్ని కూడా కస్టమర్లను ఆకర్షించడానికి అదనపు ప్రయోజనాలతో ప్లాన్‌లను ప్రారంభించేందుకు పోటీ పడుతున్నారు. ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ముఖ్యమైన నిర్ణయాత్మక కారకాలలో చెల్లుబాటు, డేటా పరిమితి మరియు OTT స్ట్రీమింగ్ సేవలు ఉన్నాయి.

 

సబ్‌స్క్రైబర్

ఈ డేటా-భారీ యుగంలో అదనపు డేటా అనేది మరొక అదనపు అంశం కావచ్చు. కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లు అదనపు డేటాను కూడా అందిస్తాయి. వీటిని సబ్‌స్క్రైబర్ ఇచ్చిన వ్యవధిలో రీడీమ్ చేయవచ్చు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో నుండి అందుబాటులో ఉన్న అదనపు డేటా ప్లాన్లను పరిశీలిద్దాం. సంబంధిత టెలికాం ప్రొవైడర్ వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేస్తున్నప్పుడు ఈ అదనపు డేటా ప్రయోజనాల్లో కొన్ని అందుబాటులో ఉండగా మరికొన్ని వారి మొబైల్ యాప్‌లకు మాత్రమే ప్రత్యేకమైనవిగా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల అదనపు డేటా ప్రయోజనాలు

జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల అదనపు డేటా ప్రయోజనాలు

రిలయన్స్ జియో రూ.3119 ధర వద్ద లభించే వార్షిక ప్లాన్‌తో అదనపు డేటాను అందిస్తుంది. ఇది 2GB రోజువారి డేటా, అపరిమిత కాల్‌లు మరియు 100 SMS/రోజు ప్రయోజనాలతో పాటుగా అదనంగా 10GB డేటాను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ మొత్తం వాలిడిటీలో డేటా పరిమితి 740 GB. OTT ప్రయోజనాల పరంగా 365 రోజుల చెల్లుబాటుతో కూడిన జియో వార్షిక ప్లాన్ డిస్నీ + హాట్‌స్టార్‌కు ఒక సంవత్సరం యాక్సెస్‌ను అందిస్తుంది. అలాగే జియో యొక్క సొంత ఆఫర్‌ల సూట్‌ను అందిస్తుంది.

జియో
 

జియో రూ.1066 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది 5GB అదనపు డేటా ప్రయోజనంతో కూడిన మరొక ప్యాక్. ఈ ప్లాన్ డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, జియో టీవీ మరియు జియో సినిమాలకు ఒక సంవత్సరం యాక్సెస్‌తో పాటు 2GB డేటా/రోజు, 100 SMS/రోజు మరియు అపరిమిత వాయిస్‌ని అందిస్తుంది. అదనపు డేటా ప్రయోజనాలను అందించే మరొక ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్ రూ.601 ధర వద్ద లభిస్తుంది. ఇది 28 రోజుల చెల్లుబాటుతో రోజుకు 3GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 SMS/రోజు ప్రయోజనాలతో పాటుగా 6GB అదనపు డేటాను కూడా అందిస్తుంది. ఇతర అదనపు డేటా ప్లాన్‌ల మాదిరిగానే రూ. 601 ప్యాక్ డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, జియో టీవీ మరియు జియో సినిమాకి ఒక సంవత్సరం యాక్సెస్‌తో వస్తుంది.

ఎయిర్‌టెల్ ఉచిత డేటా కూపన్‌ల ఆఫర్లు

ఎయిర్‌టెల్ ఉచిత డేటా కూపన్‌ల ఆఫర్లు

ఎయిర్‌టెల్ రూ. 699 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 3GB డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMSలను 56 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తోంది. ఈ ప్లాన్ అదనపు ప్రయోజనంగా ఉచితంగా 4GB డేటా కూపన్‌లను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ ఇతర Airtel థాంక్స్ యాప్ ప్రయోజనాలతో పాటు 56 రోజుల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను కూడా అందిస్తుంది. అలాగే రూ. 549 ధర వద్ద లభించే మరొక ప్రీపెయిడ్ ప్లాన్‌ 56 రోజుల చెల్లుబాటు కాలానికి రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్‌లు మరియు 100 SMS/రోజుకు పాటుగా 4GB డేటా కూపన్‌లను కూడా ఉచితంగా అందిస్తుంది. ఇతర Airtel థాంక్స్ యాప్ ప్రయోజనాలతో పాటు, ప్లాన్ కింద Amazon Primeకి 30 రోజుల ఉచిత ట్రయల్ యాక్సెస్ మాత్రమే ఉంది.

ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్

ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్ రూ.500 కంటే తక్కువ ధరలోని ప్లాన్‌లలో అదనపు డేటా ప్రయోజనం కోసం చూస్తున్నట్లయితే రూ. 479 మరియు రూ. 359 వంటి రెండు ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ.479 ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల చెల్లుబాటుతో రోజుకు 1.5GB డేటా, 100 SMS/రోజు మరియు అపరిమిత కాల్‌ల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అదనముగా 4GB డేటా కూపన్‌లను కూడా అందిస్తుంది. రూ.549 ప్లాన్ లాగానే యాప్ అమెజాన్ ప్రైమ్ మరియు ఇతర ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ప్రయోజనాలకు 30-రోజుల మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. మరోవైపు రూ.359 ధర వద్ద లభించే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్‌లు మరియు 100 SMS/రోజు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అదనంగా 2GB డేటా కూపన్‌ల అదనపు ఆఫర్‌తో వస్తుంది. సబ్‌స్క్రైబర్ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో సోనీలివ్, లయన్స్‌గేట్ ప్లే, ఎరోస్‌నౌ, హోయ్‌చోయ్, మనోరమ మాక్స్ - ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఛానెల్‌లలో ఏదైనా ఒకదానికి 28 రోజుల యాక్సెస్‌ను కూడా పొందుతారు.

Best Mobiles in India

English summary
Airtel VS Jio: These Prepaid Plans Available With Additional Data Coupons

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X