Home
News

రోజువారీ 1GB డేటాలో మెరుగ్గా ఉన్న ప్రైవేట్ టెల్కోల ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే

ఇండియాలో కరోనా వైరస్ మొదలైనప్పటి నుండి చాలా మంది ఇంటికి మాత్రమే పరిమితం అయ్యి ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నారు. ఇటువంటి వారికి అధిక డేటా అవసరం అవుతుంది. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరు రెండు రకాల సీఎం లను వాడుతూ ఉంటారు. ఒకదానికి అధికంగా ఉండే డేటాతో రీఛార్జ్ చేయగా మరొక దానిని తక్కువ డేటాతో రీఛార్జ్ చేస్తూ ఉంటారు.

ప్రైవేట్ ఆపరేటర్లు

వోడాఫోన్ ఐడియా (Vi), భారతి ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో వంటి ప్రైవేట్ ఆపరేటర్లు తమ వినియోగదారులకు ఎంచుకోవడానికి అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నారు. ఈ ప్లాన్‌లు రోజుకు 1GB FUP డేటా నుంచి 4GB వరకు డేటాను అందిస్తాయి. కొంతమంది వినియోగదారులకు అధికంగా మొబైల్ డేటా అవసరం లేనందున సిమ్ యాక్టీవ్ లో ఉంచడం కోసం మరియు తక్కువ మొత్తంలో డేటాను వినియోగించడం కోసం 1GB రోజువారీ డేటా ప్లాన్ వారికి అనువైనది కాదు. టెలికాం ఆపరేటర్లు తమ వినియోగదారులకు అందించే 1GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో టెలికాం సంస్థ తన యొక్క వినియోగదారులకు 1GB రోజువారీ FUP డేటాతో ఒకే ప్రీపెయిడ్ ప్లాన్‌ను మాత్రమే అందిస్తుంది. రూ.149 ధర వద్ద లభించే ఈ ప్లాన్ కేవలం 14 రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలతో అందిస్తుంది. అలాగే Jio యొక్క అన్ని యాప్లకు కాంప్లిమెంటరీ యాక్సెస్ ను అందిస్తుంది. వినియోగదారు FUP డేటాను అయిపోయిన తర్వాత స్పీడ్ 64 Kbps కి పడిపోతుంది.

భారతి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ రోజువారీ 1GB FUP డేటాతో రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌లు వరుసగా రూ.199 మరియు రూ.219 ధరతో లభిస్తాయి. రూ.219 ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో మరియు రూ.199 ప్లాన్ 24 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ రెండు ప్లాన్‌ల యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇవి రెండు కూడా వినియోగదారులకు 1GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS లను అందిస్తున్నాయి. FUP డేటా వినియోగం తరువాత ఇంటర్నెట్ వేగం 64 Kbpsకు తగ్గించబడుతుంది.

వోడాఫోన్ ఐడియా(Vi) ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా(Vi) ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో కూడా 1GB FUP డేటాతో రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. రూ.148 మరియు రూ.219 ధరల వద్ద లభించే ఈ ప్లాన్లు ఒకే రకమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. రూ.148 ప్లాన్ 18 రోజుల చెల్లుబాటుతో లభించగా రూ.219 ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ రెండు ప్లాన్‌లతో వినియోగదారులు 1GB డేటా ప్రయోజనాలతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను పొందుతారు. అయితే రూ.219 ప్లాన్‌తో కంపెనీ "యాప్ / వెబ్ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్" కింద వినియోగదారులకు 2GB డేటాను బోనస్ గా అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel vs Jio vs Vi: 1GB Daily Data Prepaid Plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X