నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో మెరుగైన ప్రయోజనాలు అందించేది ఎవరు??

|

ఇండియా యొక్క ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా(Vi)వంటివి తమ వినియోగదారులకు అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లకు ప్రసిద్ధి చెందారు. ఈ ప్లాన్‌లు తమ యూజర్లకు హై-స్పీడ్ డేటా, వాయిస్ కాలింగ్ మరియు SMS వంటి ప్రయోజనాలతో నిండి ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా ప్రీపెయిడ్ ప్లాన్‌ల యొక్క విభిన్న సర్వీస్ చెల్లుబాటు వ్యవధి చందాదారులకు ఉపయోగపడుతుంది.

 

ప్రీపెయిడ్ ప్లాన్‌

నెలవారీ ఇంటర్నెట్ అవసరాలు తీర్చబడతాయో లేదో నిర్ధారించడానికి 28 రోజుల సర్వీస్ వాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్‌లను చందాదారులు తరచుగా ఎంచుకుంటారు. భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో మరియు వోడాఫోన్ ఐడియా ప్రైవేట్ టెల్కోలు తగినంత డేటా బ్యాలెన్స్‌తో 28 రోజుల చెల్లుబాటు కాలంలో అందించే ఉత్తమ విలువైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మీ ఫోన్‌లో ఈ యాప్‌లు ఉన్నాయా? చాలా ప్రమాదం.. వెంటనే డెలిట్ చేయండి...మీ ఫోన్‌లో ఈ యాప్‌లు ఉన్నాయా? చాలా ప్రమాదం.. వెంటనే డెలిట్ చేయండి...

రిలయన్స్ జియో రూ .199 ప్రీపెయిడ్ ప్లాన్
 

రిలయన్స్ జియో రూ .199 ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో రూ.199 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్ రోజువారీ డేటా ప్రయోజనాలను అందించే అత్యుత్తమమైన ప్లాన్‌లలో ఒకటి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కింద వినియోగదారులు 28 రోజుల చెల్లుబాటు కాలంలో ప్రతిరోజూ 1.5GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు. అంటే మొత్తంగా 42GB డేటాను పొందుతారు. FUP పరిమితి ముగిసిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbps కి తగ్గుతుంది. హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటాతో పాటు వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు మరియు రోజుకు 100 SMS లను పొందుతారు. అదనపు ప్రయోజనాలలో Jio JioTV, JioCinema, JioSecurity మరియు JioCloud వంటి వివిధ యాప్‌లకు సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందుతారు.

భారతీ ఎయిర్‌టెల్ రూ .249 ప్రీపెయిడ్ ప్లాన్

భారతీ ఎయిర్‌టెల్ రూ .249 ప్రీపెయిడ్ ప్లాన్

జియో సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుండగా భారతీ ఎయిర్‌టెల్ మాత్రం కొద్దిగా అధిక ధర వద్ద తన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఇది రిలయన్స్ జియోతో పోలిస్తే ప్రీమియం సెగ్మెంట్ ధరను కలిగి ఉంటుంది. రూ.249 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్ సబ్‌స్క్రైబర్‌లకు మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఎయిర్‌టెల్ అందించే అదనపు ప్రయోజనాలు రిలయన్స్ జియో కంటే మెరుగైనవిగా ఉంటాయి. రూ.249 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు 28 రోజుల వాలిడిటీ కాలానికి రోజువారీ 1.5GB ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. FUP డేటా పరిమితిని చేరుకున్న తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbps కి తగ్గుతుంది. దీనితో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్‌లో చేర్చబడ్డాయి. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఎయిర్‌టెల్ అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ యొక్క ఒక నెల ఉచిత ట్రయల్‌ను అందిస్తుంది. ఇది మాత్రమే కాకుండా వినియోగదారులు అపోలో 24/7 కి 3 నెలల సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, ఉచిత హలో ట్యూన్‌లు, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ మరియు షా అకాడమీ నుండి ఒక సంవత్సరం పాటు ఉచిత ఆన్‌లైన్ కోర్సులు పొందవచ్చు.

వోడాఫోన్ ఐడియా రూ .249 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా రూ .249 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో కూడా 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందించే ప్రీపెయిడ్ ప్లాన్ ఎయిర్‌టెల్ సంస్థ అందించే అదే ధర ట్యాగ్‌తో లభిస్తుంది. ఇది కూడా రోజువారీ 1.5GB ఇంటర్నెట్ డేటాను మరియు వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ కింద వోడాఫోన్ ఐడియా 28 రోజుల పాటు ప్రతిరోజూ 1.5GB ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు మరియు రోజుకు 100 SMS లను అందిస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాలలో వీక్ ఎండ్ డేటా రోల్‌ఓవర్ సదుపాయం, Vi మూవీస్ మరియు టీవీకి సబ్‌స్క్రిప్షన్ మరియు బింగ్ ఆల్ నైట్ ఫీచర్ వంటివి ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Airtel vs Jio vs VI: 28 Days Validity Prepaid Plans Offers & Benefits

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X