Airtel, Jio, Vi 3నెలల వాలిడిటీతో 4G ప్రీపెయిడ్ ప్లాన్‌లు!!! రూ.400 లోపు మాత్రమే
ఇండియా యొక్క టెలికాం సంస్థలు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) మరియు రిలయన్స్ జియో తమ వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఒకరిని మించి మరొకరు ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. 2019 డిసెంబరులో టారిఫ్ పెంపు తరువాత 84 రోజుల వాలిడిటీతో లభించే ప్రీపెయిడ్ ప్లాన్ కోసం వినియోగదారులు ప్రస్తుతం సుమారుగా 600 నుండి 700 రూపాయలు చెల్లిస్తున్నారు. ఎయిర్టెల్ రూ.698 ధర వద్ద రోజుకు 2GB డేటాతో 84 రోజులు అంటే మూడు నెలల చెల్లుబాటుతో లభిస్తున్నది. అయితే కస్టమర్ల కోసం టెల్కోలు 84 రోజుల చెల్లుబాటుతో సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందిస్తున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో రూ.329 ప్రీపెయిడ్ ప్లాన్: 84 రోజుల వాలిడిటీతో
రిలయన్స్ జియో యొక్క Rs.329 ప్లాన్ 84 రోజుల వాలిడిటీ కాలానికి 6GB 4G డేటాను వినియోగదారులకు అందిస్తుంది. దీని తర్వాత డేటా స్పీడ్ 64 Kbps కి తగ్గించబడుతుంది. డేటా ప్రయోజనంతో పాటు ఇది అపరిమిత జియో-జియో వాయిస్ కాలింగ్, 3,000 నాన్-జియో FUP నిమిషాలు మరియు 1000SMS ప్రయోజాలను అందిస్తుంది. టెల్కో అందించే 6GB డేటా ప్రయోజనం మొత్తం 84 రోజుల వాలిడిటీకి అని గమనించండి. మీరు 6GB డేటా ప్రయోజనాన్ని వినియోగించిన తరువాత మరింత డేటా కోసం జియో 4G డేటా వోచర్‌లను అందిస్తోంది. ఇది కేవలం రూ.11 నుండి ప్రారంభమవుతుంది మరియు ఇది 30 రోజుల వాలిడిటీతో 50GB డేటాను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.379 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
జియో యొక్క 329 రూపాయల సరసమైన ధర వద్ద 84-రోజుల చెల్లుబాటుతో లభించే ప్లాన్ కు పోటీగా అదే చెల్లుబాటుతో ఎయిర్‌టెల్ రూ.379 ధర వద్ద ఒక ప్లాన్ ను అందిస్తున్నది. ఇది భారతదేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. దీనితో పాటుగా ఈ ప్లాన్‌లో 6GB డేటా మరియు 900SMS ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలలో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. ఇది 400 కంటే ఎక్కువ లైవ్ టివి ఛానెల్‌లను చూడటానికి వినియోగదారులను అనుమతిస్తుంది. వీటితో పాటుగా అపరిమిత పాట మార్పులతో ఉచిత హెలోటూన్స్ ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. షా అకాడమీ కోర్సుల ప్రయోజనం కూడా ఉచితంగా లబిస్తుంది. చివరగా రూ.150 ఫాస్ట్ ట్యాగ్ ప్రయోజనం కూడా ఉంది.

Vi రూ.379 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
వొడాఫోన్ ఐడియా (Vi) సంస్థ రూ.379 సరసమైన ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది భారతి ఎయిర్‌టెల్ మరియు జియో సంస్థలు అందిస్తున్న అదే 6GB 4G డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. వాయిస్ కాల్స్ ప్రయోజనాలలో భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయిన అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటుగా 1000 SMS ప్రయోజనాలను 84 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ ప్లాన్ తో Vi కస్టమర్లకు Vi Movies & TV యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








