Airtel vs Jio vs VI కొత్త ప్రీపెయిడ్ రీఛార్జీ ప్లాన్‌లు... యూజర్లకు ఎవరు బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నారు..??
టెలికాం సంస్థ ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా.. ఇటీవల ప్రీపెయిడ్, పోస్‌పెయిడ్ రీఛార్జీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జియో, ఎయిర్‌టెల్ కొత్త ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. వోడాఫోన్ ఐడియా కొత్త ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఈ మూడు నెట్‌వర్క్‌లలో ప్రస్తుతం మెరుగైన ప్రయోజనాలతో ఉన్న రీఛార్జీ ప్లాన్‌ల వివరాలను మీకు (Airtel vs Jio vs VI) అందిస్తున్నాం. అందులో 28 రోజుల నుంచి 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లు ఉన్నాయి.
28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్‌లు :
జియో రూ.299 ప్లాన్ : ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉండనుంది. మరియు రోజువారీ 100 SMS లు పొందవచ్చు. రోజువారీ 1.5GB హైస్పీడ్ 4G డేటాను వినియోగించుకోవచ్చు. 28 రోజుల వ్యాలిడిటిని కలిగి ఉంటుంది.

ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ రీఛార్జీ ప్లాన్ ద్వారా అన్‌లిమిడెట్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 1.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. నెలవారీ రీఛార్జీ చేయించుకొనే వారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.
వోడాఫోన్ ఐడియా రూ.349 ప్లాన్ : ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. మరియు రోజువారీ 1.5 GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. మరియు వీకెండ్ రోల్‌ఓవర్ ప్రయోజనాలు పొందవచ్చు.
56 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లు :
ఎయిర్‌టెల్ రూ.649 ప్లాన్ : ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. మరియు ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. 56 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంది. అంటే మొత్తంగా 112GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు.
జియో రూ.629 ప్లాన్ : రోజువారీ 2GB డేటాను అందించే ప్లాన్‌లో ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాతో పోల్చుకుంటే తక్కువ ధరకు అందుబాటులోకి వస్తుంది. దీంతోపాటు ఈ ప్లా్‌న్ ద్వారా అన్‌లిమిలెడ్ 5G డేటాను కూడా పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 SMS లను పొందవచ్చు.
VI రూ.649 ప్లాన్ : ఈ ప్లాన్ ద్వారా యూజర్లు రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా ప్రతి రోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. వీకెండ్ రోల్‌ఓవర్ ప్రయోజనాలు పొందవచ్చు.
84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లు :
ఎయిర్‌టెల్ రూ.859 ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా వినియోగదారులు రోజువారీ 1.5GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. 84 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది.
జియో రూ.859 ప్లాన్ : ఈ ప్లాన్ ద్వారా జియో యూజర్లు 2GB రోజువారీ డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు యూజర్లు 5G స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉంటే.. అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా ప్రతి రోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు.
VI రూ.859 ప్లాన్ : ఈ ప్లాన్ ద్వారా యూజర్లు రోజువారీ 1.5GB డేటాను పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా ప్రతి రోజు 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు అర్దరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 వరకు అన్‌లిమిటెడ్ డేటాను వినియోగించుకోవచ్చు. వీకెండ్ రోల్‌ఓవర్ ప్రయోజనాలు పొందవచ్చు.


Click it and Unblock the Notifications








