Home
News

Vi యొక్క ఈ ప్లాన్ ఎయిర్‌టెల్, జియో కంటే ఎంతో మెరుగ్గా ఉంది!!

భారతదేశంలో అతి కొద్ది కాలంలోనే నంబర్ వన్ టెలికాం ఆపరేటర్ గా రిలయన్స్ జియో ఎదిగింది. ఇది ఇతర ఆపరేటర్లతో పోలిస్తే చౌకైన ఆఫర్లను అందిస్తూ వినియోగదారులను అదికంగా ఆకట్టుకున్నది. అంతేకాకుండా దాని నెట్‌వర్క్ సేవలు కూడా భారతదేశమంతటా స్థిరంగా ఉన్నాయి. అయితే వోడాఫోన్ ఐడియా (Vi) యొక్క ఒక ప్లాన్ అందించే ప్రయోజనాలు జియో అందించే ప్రయోజనాలను వెనుకకు నెట్టింది. భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో మరియు వొడాఫోన్ ఐడియా సంస్థల మూడు ప్రైవేట్ ఆపరేటర్లు రూ.599 ఒకే ధర వద్ద ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తున్నాయి. అయితే రూ.599 ధర వద్ద లభించే ప్లాన్ యొక్క ప్రయోజనాలను గమనిస్తే కనుక ఇతర ఆపరేటర్లు అందించే దానికంటే వోడాఫోన్ ఐడియా ప్లాన్ ఎంతో మెరుగ్గా ఉంది. వీటి గురించి మరింత నిశితంగా పరిశీలించడానికి ముందుకు చదవండి.

భారతీ ఎయిర్‌టెల్ రూ .599 ప్లాన్

భారతీ ఎయిర్‌టెల్ రూ .599 ప్లాన్

భారతీ ఎయిర్‌టెల్ అందించే రూ.599 ప్లాన్ యొక్క ఆఫర్‌ల విషయానికి వస్తే ఇది వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS లు మరియు 2GB రోజువారీ డేటా ప్రయోజనాలను 56 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. దీనికి అదనంగా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఒక నెల ట్రయల్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్, ఫ్రీ హెలోట్యూన్స్, ఒక సంవత్సరం షా అకాడమీ కోర్సు మరియు డిస్నీ+ హాట్ స్టార్ VIP యొక్క ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో పాటుగా అదనంగా FASTag లావాదేవీలపై రూ.100 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

రిలయన్స్ జియో రూ .599 ప్లాన్

రిలయన్స్ జియో రూ .599 ప్లాన్

రిలయన్స్ జియో యొక్క రూ.599 ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే వినియోగదారులు ఎయిర్‌టెల్ ప్లాన్ లాగానే దాదాపు అదే ప్రయోజనాలను పొందుతారు. 2GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు100 SMS లు వంటి ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ ఎయిర్‌టెల్ ప్లాన్‌తో వినియోగదారులు పొందే 56 రోజులకు బదులుగా 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ అదనంగా JioSecurity, JioTV, JioCloud, JioCinema మరియు JioNews సహా Jio అప్లికేషన్‌లతో కూడిన అదనపు ప్రయోజనాలు Jio యొక్క ప్లాన్‌తో అందించబడతాయి.

వొడాఫోన్ ఐడియా రూ .599 ప్లాన్

వొడాఫోన్ ఐడియా రూ .599 ప్లాన్

వోడాఫోన్ ఐడియా టెల్కో రూ.599 ధర వద్ద అందించే ప్లాన్‌ను 84 రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు అందిస్తుంది. కానీ ఇది 1.5GB రోజువారీ డేటాను అందిస్తుంది. ఇది Jio మరియు Airtel రెండూ తమ వినియోగదారులకు అందించే దానికంటే తక్కువ. ఇతర ప్రయోజనాలు ఒకే విధంగా ఉంటాయి. ఇది అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS/రోజు పాటు Vi మూవీస్ & టీవీ యొక్క అదనపు ప్రయోజనంతో పాటుగా ఉంటుంది.

వోడాఫోన్ ఐడియా

జియో మరియు ఎయిర్‌టెల్ ప్లాన్ కంటే వోడాఫోన్ ఐడియా యొక్క ఈ ప్లాన్ ఎలా బాగుంటుందని మీరు ఆలోచిస్తున్నారా?? Vi తన వినియోగదారులకు అందించే రెండు ప్రత్యేకమైన ఆఫర్ల కారణంగా ఇది మెరుగ్గా ఉంది. ఈ రెండు ఆఫర్లలో ఒకటి ‘డేటా రోలోవర్' కాగా మరొకటి ‘బింగే ఆల్ నైట్' ఆఫర్. డేటా రోల్‌ఓవర్ ఆఫర్ అనేది వినియోగదారులకు వారి అదనపు డేటాను వారం నుండి సేవ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా వారు వీక్ ఎండ్ లో దీనిని ఉపయోగించవచ్చు. అలాగే బింగే ఆల్ నైట్ ఆఫర్‌తో వినియోగదారులు తమ రోజువారీ డేటా పరిమితిని ప్రభావితం చేయకుండా ప్రతిరోజూ 12 AM మరియు 6 AM మధ్య అపరిమిత డేటాను వినియోగించవచ్చు.

Best Mobiles in India

English summary
Airtel vs Jio vs VI: Rs.599 Price Plan Which One is Better and Offers More Benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X