మే 2021 నెలలో ప్రైవేట్ టెల్కోల యొక్క ఉత్తమమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు ఇవే!!!

|

ఇండియాలో కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటికి చాలా మంది వినియోగదారులు ఇంటి వద్ద ఉండే పనిచేస్తున్నారు. ఇటువంటి వారు తమ యొక్క అవసరాల కోసం అధికంగా డేటాను వినియోగించడం కోసం కొత్తగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లను ఎంచుకున్నారు. అయితే బ్రాడ్‌బ్యాండ్ వినియోగం లేనిచోట దానికి బదులుగా ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ఎంచుకుంటున్నారు.

పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌

అపరిమిత వాయిస్ కాలింగ్, అధిక డేటా ప్రయోజనాలతో రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ లేదా వొడాఫోన్ ఐడియా(Vi) టెలికాం సంస్థలు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నారు. అన్ని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు తగినంత అధిక వేగంతో మెరుగైన 4G డేటాను అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నారు. ప్రతి టెల్కో అందించే ఉత్తమమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ ఇంటి వద్ద నుండి పనిచేసే వినియోగదారులకు సహాయం చేయడంలో ఎంతవరకు తగిన విలువను అందిస్తుందో వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో యొక్క ఉత్తమమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో యొక్క ఉత్తమమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్

** ఇంటి వద్ద నుండి పనిచేసే వినియోగదారులకు రిలయన్స్ జియో రూ.799 ధర వద్ద పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఇది 150GB డేటాను 1 బిల్లింగ్ చక్రానికి చెల్లుబాటులో ఉంచుతుంది. ఒక బిల్లింగ్ చక్రం అంటే 1 నెల. ఈ 150GB డేటాను వినియోగించిన తరువాత వినియోగదారులు వినియోగించే ప్రతి గిగాబైట్ డేటాకు రూ.10 చొప్పున వసూలు చేస్తారు.

** యూజర్లు 200GB వరకు డేటా రోల్‌ఓవర్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఈ ప్లాన్‌తో పాటు 2 సిమ్ కార్డులు అదనంగా ఇవ్వబడతాయి. దీనిని చందాదారుడు వారి కుటుంబ సభ్యులకు ఇవ్వవచ్చు. ఈ ప్లాన్‌తో యూజర్లు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను పొందుతారు.

** ఇంకా ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ మరియు డిస్నీ + హాట్‌స్టార్ VIP యొక్క ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాల 1 సంవత్సరం ఉచిత సబ్స్క్రిప్షన్ తో వస్తుంది. వినియోగదారులు JioNews, JioTV, JioCloud మరియు JioSecurity తో సహా అన్ని Jio అనువర్తనాలకు కాంప్లిమెంటరీ సభ్యత్వాన్ని పొందుతారు.

 

భారతి ఎయిర్‌టెల్ ఉత్తమమైన 4G పోస్ట్‌పెయిడ్ ప్లాన్

భారతి ఎయిర్‌టెల్ ఉత్తమమైన 4G పోస్ట్‌పెయిడ్ ప్లాన్

భారతి ఎయిర్‌టెల్ టెల్కో రూ.749 ధర వద్ద తన యొక్క ఉత్తమమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ను ఇంటి వద్ద నుండి పని చేయాలనుకునే వినియోగదారునికి అందిస్తుంది. ఈ ప్లాన్ మొత్తం చెల్లుబాటు కాలానికి 125GB డేటాతో వస్తుంది. ఇది కూడా వినియోగదారులకు 2 సిమ్ కార్డులను అందిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలతో వస్తుంది. ఈ ప్లాన్‌లో అదనంగా OTT ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ వినియోగదారులకు 200GB వరకు డేటా రోల్ఓవర్ ప్రయోజనాన్ని అందిస్తుంది. అలాగే వినియోగదారులు డిస్నీ + హాట్స్టార్ VIP మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క ఒక సంవత్సరం చందాతో పాటు ఇతర కాంప్లిమెంటరీ యాక్సిస్ లో ఎయిర్టెల్ థాంక్స్ వంటి ప్రయోజనాలను కూడా పొందుతారు.

వోడాఫోన్ ఐడియా(Vi) ఉత్తమమైన 4G పోస్ట్‌పెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) ఉత్తమమైన 4G పోస్ట్‌పెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో ఇంటి వద్ద నుంచి పనిచేసే తన యొక్క పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు రూ.699 ధర వద్ద ఉత్తమమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌ వినియోగదారులకు అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలతో లభిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత డేటాతో వస్తుంది కాబట్టి ఇందులో డేటా రోల్‌ఓవర్ సౌకర్యం అవసరం లేదు.

ఈ ప్లాన్‌తో వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్నీ + హాట్‌స్టార్ VIP యొక్క OTT ప్రయోజనాలను ఒక సంవత్సరం చెల్లుబాటుతో పొందుతారు. వినియోగదారులకు అందుబాటులో ఉన్న Vi మూవీస్ & టీవీ యాప్ యొక్క ఉచిత చందా కూడా ఉంది. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ జియో మరియు ఎయిర్‌టెల్ యొక్క రూ.799 మరియు రూ.749 ఆఫర్‌ల కంటే చౌకైనది మాత్రమే కాకుండా వినియోగదారులు తమ కొనుగోలుపై ఎక్కువ డేటాను వినియోగించుకునే సౌలభ్యాన్ని కూడా అందిస్తుంది.

 

Best Mobiles in India

English summary
Airtel vs jio vs Vi: These are The Best Postpaid Plans on May 2021

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X