Home
News

Airtel, Jio,Vi: రూ .700 ధర లోపు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో బెస్ట్ ఎవరు?

ఇండియాలోని టెలికాం రంగంలో గల ప్రైవేట్ ఆపరేటర్లు అందరూ కూడా తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు మెరుగైన ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తూ తమ చందాదారుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. ఇటీవల కాలంలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు తమ ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో కొన్ని ప్లాన్‌ల యొక్క ధరలను పెంచడం మరియు కొత్త ప్లాన్‌లను ప్రారంభించడం వంటి కొన్ని చిన్న చిన్న మార్పులు చేశారు.

ఎయిర్‌టెల్

వీటిలో భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో మరియు వోడాఫోన్ ఐడియా(Vi) టెలికాం ఆపరేటర్లు అధిక మొత్తంలో డేటా ప్రయోజనాలతో నిండిన విభిన్న పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ముఖ్యంగా వొడాఫోన్ ఐడియా(Vi) సంస్థ తన చందాదారుల సంఖ్యను పెంచడానికి ఇటీవల కొత్తగా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించింది. అయితే మేము ఇప్పుడు రూ.700 ధర లోపు గల ఉత్తమమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారతీ ఎయిర్‌టెల్ రూ .499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

భారతీ ఎయిర్‌టెల్ రూ .499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

భారతీ ఎయిర్‌టెల్ వినియోగదారులు ఒక నెలలో రూ.700 ధరలోపు ఉత్తమమైన ప్రయోజనాలతో లభించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే మీకు రూ.499 ధర వద్ద లభించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మెరుగ్గా ఉంటుంది. ఈ ప్లాన్ అపరిమిత లోకల్, STD మరియు రోమింగ్ కాలింగ్ ప్రయోజనాలను మరియు రోజుకు 100 SMS లను అందిస్తుంది. డేటా ప్రయోజనాల విషయానికొస్తే వినియోగదారులు 75GB నెలవారీ డేటాను పొందుతారు. అలాగే 200GB వరకు రోల్‌ఓవర్ సౌకర్యం కూడా ఉంటుంది. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ మరియు డిస్నీ+హాట్‌స్టార్ VIP చందాలను ఒక సంవత్సరం చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఇది మాత్రమే కాకుండా వినియోగదారులకు లైఫ్ లాంగ్ షా అకాడమీ యాక్సిస్, హ్యాండ్‌సెట్ ప్రొటెక్షన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌టీమ్ యాప్ ప్రీమియం మరియు వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌లకు ఉచిత యాక్సిస్ లభిస్తుంది.

రిలయన్స్ జియో రూ .599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో రూ .599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ టెల్కోకు పోటీగా రిలయన్స్ జియో మరిన్ని అధిక ప్రయోజనాలతో తన యొక్క వినియోగదారులకు రూ.599 ధర వద్ద పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ను అందిస్తున్నది. ఈ ప్లాన్ వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. డేటా ప్రయోజనాల విషయానికొస్తే ఇది నెలకు 100GB డేటాను అందిస్తుంది. అలాగే 200GB వరకు రోల్‌ఓవర్‌ సదుపాయం కూడా ఉంది. FUP పరిమితి తర్వాత 1GB డేటా కోసం Jio రూ.10 ఛార్జ్ చేస్తుంది. ఈ ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్నీ+హాట్‌స్టార్ వంటి OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్‌లకు యాక్సిస్ ను అందిస్తుంది. అలాగే వినియోగదారులు JioTV, JioCinema, JioNews వంటి అన్ని జియో యాప్‌లకు ఉచిత యాక్సిస్ ను పొందుతారు.

వొడాఫోన్ ఐడియా రూ .699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

వొడాఫోన్ ఐడియా రూ .699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో టెల్కోలకు పోటీగా రూ.699 ధర వద్ద ఒక పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత డేటా ప్రయోజనాలను అందిస్తుంది. వినియోగదారులు వారి వినోద అవసరాల కోసం అపరిమిత డేటాను హై-స్పీడ్ తో ఆస్వాదించవచ్చు. అదనపు ప్రయోజనాలలో డిస్నీ+హాట్‌స్టార్ మరియు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌కు 1-సంవత్సరం పాటు సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. అదనంగా Vi సినిమాలు మరియు టీవీకి కూడా ఉచిత యాక్సెస్ ను పొందుతారు. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ వన్-టైమ్ బెనిఫిట్ అని పోస్ట్‌పెయిడ్ యూజర్లు తప్పక గమనించాలి. అయితే మరే ఇతర ప్లాన్‌తోనూ ఉపయోగించకపోతే మాత్రమే ఇది వర్తిస్తుంది.

Best Mobiles in India

English summary
Airtel vs Jio vs Vi: Which One is The Best Postpaid plan under Rs.700
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X