Home
News

Airtel, Jio, Vi టెల్కోల 1.5GB రోజువారీ డేటా దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్‌లలో బెస్ట్ ఎవరు?

ఇండియాలోని ప్రైవేట్ టెల్కోలు తమ యొక్క సబ్‌స్క్రైబర్‌ బేస్ ను పెంచుకోవడానికి మరియు ప్రస్తుతం ఉన్న సబ్‌స్క్రైబర్‌లను కాపాడుకోవడం కోసం రోజువారీ అధిక డేటా ప్రయోజనాలతో బహుళ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అధిక శాతం మంది ఆర్థికంగా అనుకూలమైన ప్లాన్‌ల కోసం వెతుకుతున్న వారందరికీ కూడా తమ యొక్క ఆపరేటర్‌లు అందించే 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌లను అందించే ప్లాన్‌లు వారికి సరైనవిగా ఉన్నాయి. దేశంలోని Jio, Airtel మరియు Vi ప్రైవేట్ టెల్కోలు 1.5GB రోజువారీ డేటాతో దీర్ఘకాలిక వాలిడిటీతో లభించే ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌లు

దీర్ఘకాలిక వాలిడిటీతో లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌ల విషయానికి వస్తే వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో తన యొక్క వినియోగదారులకు బహుళ ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ టెల్కో రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌ని అందిస్తుంది. అది రూ.666 ధర ట్యాగ్‌తో 77 రోజుల చెల్లుబాటు వ్యవధికి రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది. Vi రూ. 799 ధర వద్ద మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందిస్తుంది. ఇది 84 రోజుల చెల్లుబాటు వ్యవధికి రోజుకు 1.5GB డేటాని అందిస్తుంది. దీనితో పాటుగా టెల్కో సంవత్సరం వాలిడిటీతో రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా అందిస్తుంది. Vi నుండి రూ.2,899 మరియు రూ.3,099 ధరల వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌లు 365 రోజుల చెల్లుబాటు వ్యవధికి 1.5GB రోజువారీ డేటాను అందిస్తాయి. రూ.3,099 ప్లాన్ డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ యాక్సెస్‌తో కూడా వస్తుంది. VI నుండి ఈ ప్లాన్‌లన్నీ అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు 100SMS/రోజుకు "బింగే ఆల్ నైట్", Vi సినిమాలు మరియు టీవీ మరియు డేటా రోల్ ఓవర్ వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తాయి.

జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు

జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు

జియో టెల్కో తన యొక్క వినియోగదారులకు రోజువారి 1.5GB డేటా ప్రయోజనంతో అందించే దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే జియో 1.5GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూ.666 ధర ట్యాగ్‌తో 84 రోజుల చెల్లుబాటు వ్యవధికి అందిస్తుంది. ఈ ప్లాన్ కూడా అపరిమిత వాయిస్ కాల్స్ మరియు 100 SMS/రోజు ప్రయోజనాలతో లభిస్తుంది. అంతేకాకుండా టెల్కో రూ.2,545 ధరతో 365 రోజుల చెల్లుబాటు కాలానికి 1.5GB/రోజు ప్రయోజనంతో దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందిస్తుంది. ఏడాది పొడవునా ప్లాన్ అలాగే అపరిమిత వాయిస్ కాల్స్ మరియు 100 SMS/రోజు అందిస్తుంది. అదనంగా జియో యొక్క అన్ని OTT యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఆసక్తికరమైన విషయమేమిటంటే ఎయిర్‌టెల్ సంస్థ ఒకే రకమైన డేటా ప్రయోజనాలతో రెండు దీర్ఘకాలిక ప్లాన్‌లను తన యొక్క వినియోగదారులకు అందిస్తుంది. కానీ ఎయిర్‌టెల్ సంవత్సరకాల చెల్లుబాటుతో ఎటువంటి ప్లాన్‌ను కూడా అందించదు. ఈ టెల్కో రూ.666 ధర ట్యాగ్‌తో 77 రోజుల చెల్లుబాటు వ్యవధికి 1.5GB/రోజు అందించే రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. అలాగే రూ. 799 ధర వద్ద ఎయిర్‌టెల్ 84 రోజుల చెల్లుబాటు వ్యవధితో 1.5GB/రోజువారి డేటా ప్రయోజనంతో మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ రెండు ప్లాన్‌లు కూడా అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు 100 SMS/రోజుకు లతో పాటుగా అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క మొబైల్ ఎడిషన్ ఉచిత ట్రయల్ యాక్సెస్‌తో పాటు కొన్ని ఇతర ప్రయోజనాలను అందిస్తాయి.

Best Mobiles in India

English summary
Airtel vs Jio vs Vi: Who is The BEST of 1.5GB Daily Data Long Term Prepaid Plans?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X