Home
News

రూ.3కే 1జీబి 4జీ డేటా.. ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ బెస్ట్ ప్రీ-పెయిడ్ ప్లాన్స్ ఇవే!

ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ వంటి లీడింగ్ టెలికమ్ సంస్థలు సెప్టంబర్ 2018కిగాను పలు ఆసక్తికర కాంబో ప్లాన్‌లను మార్కెట్లో లాంచ్ చేసాయి

ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ వంటి లీడింగ్ టెలికమ్ సంస్థలు సెప్టంబర్ 2018కిగాను పలు ఆసక్తికర కాంబో ప్లాన్‌లను మార్కెట్లో లాంచ్ చేసాయి. ఈ ప్లాన్‌లు 80 రోజుల కంటే ఎక్కువు వ్యాలిడిటీతో లభ్యమవుతున్నాయి. వాటిలో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లకు సంబంధించిన వివరాలను నేటి ప్రత్యేక కథనంలో భాగంగా మీతో షేర్ చేసుకుంటున్నాం..

జియో రూ.399, రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్స్

జియో రూ.399, రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్స్

సెప్టంబర్ 2018కిగాను రూ.399, రూ.499 టారిఫ్‌లలో రెండు సరికొత్త ప్లాన్‌లను జియో అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిలో మొదటి ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుండగా, రెండవ ప్లాన్ 91 రోజుల వ్యాలిడిటీతో లభిస్తోంది. ఈ రెండు ప్లాన్‌లలో డేటా అలానే వాయిస్ బెనిఫిట్స్ ఒకే విధంగా ఉంటాయి. ప్లాన్ పిరియడ్‌లో భాగంగా రోజుకు 1.5జీబి 4జీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అలానే 100 వరకు మెసేజెస్ యూజర్‌కు అందుబాటులో ఉంటాయి. రూ.399 ప్లాన్‌లో భాగంగా లభిస్తోన్న 126జీబి డేటాను రూ.399తో డివైడ్ చేసినట్లటే ఒక జీబి డేటా ఖరీదు మూడు రూపాయుల పదహారు పైసలుగా ఉంది. రూ.499 ప్లాన్‌లో భాగంగా లభిస్తోన్న 136జీబి డేటాను రూ.399తో డివైడ్ చేసినట్లటే ఒక జీబి డేటా ఖరీదు మూడు రూపాయుల ముప్పై పైసలుగా ఉంది.

 

 

జియో రూ.448, రూ.498 ప్రీపెయిడ్ ప్లాన్స్

జియో రూ.448, రూ.498 ప్రీపెయిడ్ ప్లాన్స్

రోజుకు 1.5జీబి కంటే ఎక్కువ ఇంటర్నెట్ డేటాను కోరకునే వారి కోసం రూ.448, రూ.498 ప్లాన్‌లను జియో అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిలో మొదటి ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుండగా, రెండవ ప్లాన్ 91 రోజుల వ్యాలిడిటీతో లభిస్తోంది. ఈ రెండు ప్లాన్‌లలో డేటా అలానే వాయిస్ బెనిఫిట్స్ ఒకే విధంగా ఉంటాయి. ప్లాన్ పిరియడ్‌లో భాగంగా రోజుకు 2జీబి 4జీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అలానే 100 వరకు మెసేజెస్ యూజర్‌కు అందుబాటులో ఉంటాయి. రూ.448 ప్లాన్‌లో భాగంగా లభిస్తోన్న 168జీబి డేటాను ప్లాన్ ఖరీదుతో డివైడ్ చేసినట్లటే ఒక జీబి డేటా ఖరీదు రెండు రూపాయుల అరవై ఆరు పైసలుగా ఉంది. రూ.499 ప్లాన్‌లో భాగంగా లభిస్తోన్న 182జీబి డేటాను మొత్తం ప్లాన్ ఖరీదుతో డివైడ్ చేసినట్లయితే ఒక జీబి డేటా ఖరీదు రెండు రూపాయుల డబ్బైమూడు పైసలుగా ఉంది.

 

 

ఎయిర్‌టెల్ రూ.399, రూ.509 ప్రీపెయిడ్ ప్లాన్స్

ఎయిర్‌టెల్ రూ.399, రూ.509 ప్రీపెయిడ్ ప్లాన్స్

సెప్టంబర్ 2018కిగాను ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన రూ.399 ప్లాన్, జియో రూ.399 ప్లాన్‌‌కు డైరెక్ట్ కాంపిటీటర్‌గా నిలుస్తుంది. అయితే డేటా బెనిఫిట్స్ విషయానికి వచ్చేసరికి రోజుకు 100 ఎంబి డేటా తగ్గుతుంది. వాస్తవానికి ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్ 70 రోజుల వ్యాలిడిటితోనే లభిస్తోంది. అయితే ఎయిర్‌టెల్ మొబైల్ యాప్ ద్వారా ఈ ప్లాన్‌ను కొనుగోలు చేసినట్లయితే 84 రోజుల వ్యాలిడిటీని యూజర్ పొందే వీలుంటుంది. ప్లాన్ పిరియడ్‌లో భాగంగా రోజుకు 1.4జీబి డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్‌లో భాగంగా లభిస్తోన్న 117జీబి డేటాను మొత్తం ప్లాన్ ఖరీదుతో డివైడ్ చేసి చూసినట్లయితే ఒక జీబి డేటా ఖరీదు మూడు రూపాయుల నలబై ఒక్క పైసలుగా ఉంది. ఇదే సమయంలో ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన రూ.509 ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో లభిస్తోంది. ప్లాన్ పిరియడ్ లో భాగంగా 126జీబి 4జీ డేటా యూజర్‌కు అందుబాటులో ఉంటుంది.

ఎయిర్‌టెల్ రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్...

ఎయిర్‌టెల్ రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్...

సెప్టంబర్ 2018కిగాను ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన రూ.499 ప్లాన్, జియో రూ.498 ప్లాన్‌కు డైరెక్ట్ కాంపిటీటర్‌గా నిలిచింది. అయితే ప్లాన్ వ్యాలిడిటీ విషయానికి వచ్చేసరికి 81 రోజులు మాత్రమే ప్లాన్ పని చేస్తుంది. ప్లాన్‌లో భాగంగా రోజుకు 2జీబి డేటాతో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. ఇదే సమయంలో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను కూడా పంపుకోవచ్చు. ఎయిర్‌టెల్ రూ.499 ఆఫర్ క్రింద లభిస్తోన్న 164జీబి డేటాను ప్లాన్ ఖరీదుతో డివైడ్ చేసి చూసినట్లయితే ఒక జీబి డేటా ఖరీదు మూడు రూపాయుల నాలుగు పైసలుగా ఉంది.

వొడాఫోన్ రూ.458, రూ.509 ప్రీపెయిడ్ ప్లాన్స్..

వొడాఫోన్ రూ.458, రూ.509 ప్రీపెయిడ్ ప్లాన్స్..

సెప్టంబర్ 2018కిగాను వొడాఫోన్ అందిస్తోన్న అత్యుత్తమ ప్లాన్‌లలో రూ.458 ప్లాన్ ఒకటి. 84 రోజుల వ్యాలిడిటీతో లభిస్తోన్న ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 1.4జీబి 4జీ డేటాతో పాటు వారానికి 1000 నిమిషాల కాల్స్, రోజుకు 100 మెసేజెస్ అందుబాటులో ఉంటాయి. వొడాఫోన్ రూ.458 ఆఫర్ క్రింద లభిస్తోన్న 117.6జీబి డేటాను ప్లాన్ ఖరీదుతో డివైడ్ చేసి చూసినట్లయితే ఒక జీబి డేటా ఖరీదు మూడు రూపాయుల ఎనబై తొమ్మిది పైసులుగా ఉంది. ఇదే సమయంలో వొడాఫోన్ ఆఫర్ చేస్తోన్న రూ.509 ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 1.4జీబి 4జీ డేటాతో పాటు వారానికి 1000 నిమిషాల కాల్స్ ఇంకా రోజుకు 100 మెసేజెస్ అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్ క్రింద లభిస్తోన్న 126జీబి డేటాను మొత్తం ప్లాన్ ఖరీదుతో డివైడ్ చేసి చూసినట్లయితే ఒక జీబి డేటా ఖరీదు నాలుగు రూపాయుల మూడు పైసుగా ఉంది.

 

 

వొడాఫోన్ రూ.569 ప్రీపెయిడ్ ప్లాన్..

వొడాఫోన్ రూ.569 ప్రీపెయిడ్ ప్లాన్..

రోజుకు 1.5జీబి కంటే ఎక్కువ ఇంటర్నెట్ డేటాను కోరకునే ప్రీపెయిడ్ యూజర్స్ కోసం రూ.569 ప్రీపెయిడ్ ప్లాన్ ను వొడాఫోన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీతో లభిస్తోన్న ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 3జీబి హై-స్పీడ్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అలానే ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel vs Jio vs Vodafone: Best long validity prepaid plans to buy in September 2018.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X