తక్కువ డేటాను ఉపయోగించే వారికి సూపర్ గుడ్ న్యూస్!!!

|

ఇండియాలో గల వివిధ టెలికాం ఆపరేటర్లు అన్ని రకాల వినియోగదారులను ఆకట్టుకోవడానికి అనేక రకాల ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ప్రస్తుతం కొంత మంది రోజువారి అధిక డేటాను అందించే ప్లాన్లను ఎంచుకుంటున్నారు. మరికొంత మందికి డేటాతో పని లేని వారు మరియు తక్కువ మొత్తంలో డేటాను వినియోగించే వారు కూడా అధికంగా ఉన్నారు. ఇటువంటి వారు ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే ప్లాన్లను అధికంగా ఎంచుకుంటారు. అటువంటి వారికి ఉపయోగకరమైన ప్లాన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ప్రీపెయిడ్ ప్లాన్ లు

వినియోగదారులు రోజువారి అధిక డేటాను అందించే ప్లాన్ లను ఎంచుకున్నప్పుడు ఆ ప్లాన్లు ఎక్కువ రోజుల చెల్లుబాటుతో లభించవు. లాంగ్ వాలిడిటీతో అధిక డేటాను అందించే ప్లాన్లు ఉన్నప్పటికీ అవి అధిక ధరను కలిగి ఉన్నాయి. అలాగే దీర్ఘకాలిక చెల్లుబాటుతో తక్కువ డేటా ప్రయోజనాలను అందించే కొన్ని ఆసక్తికరమైన ప్రీపెయిడ్ ప్లాన్ లు ఉన్నాయి. ఇవి OTT ప్రయోజనాలను కూడా అదనంగా అందిస్తాయి. డేటాను ఉపయోగించడం కంటే ఎక్కువ ఫోన్ కాల్ లు చేయాలనే ఉద్దేశ్యంతో రీఛార్జ్ చేసే వ్యక్తులకు ఈ రకమైన ప్లాన్ లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వివిధ టెల్కోలు అందిస్తున్న ఇటువంటి ప్లాన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ రూ.379 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

ఎయిర్‌టెల్ రూ.379 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

భారతి ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు అలాంటి రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌లు ఎక్కువ రోజుల చెల్లుబాటుతో తక్కువ డేటా ప్రయోజనాలను కలిగి ఉంటాయి. రూ.379 ధర వద్ద లభించే మొదటి ప్లాన్ 84 రోజుల చెల్లుబాటు కాలంలో 6GB డేటాను మాత్రమే అందిస్తుంది. అయితే ఇది వినియోగదారులకు అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం యొక్క చందా మరియు హెలోటూన్‌లను కూడా ఉచితంగా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ .1,498 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు
 

ఎయిర్‌టెల్ రూ .1,498 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

డేటాను అధికంగా ఉపయోగించని వారు మొత్తం ఒక సంవత్సరం చెల్లుబాటు కాలానికి రూ.1,498 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్ ను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ మొత్తం 365 రోజుల చెల్లుబాటు కాలంలో కేవలం 24GBడేటాను మాత్రమే అందిస్తుంది. అయితే ఇది అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. ఇవి కాకుండా అదనపు ప్రయోజనాలలో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం మరియు హెలోటూన్లు మరియు ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయి.

జియో రూ.329  ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

జియో రూ.329  ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

రిలయన్స్ జియో కూడా దీర్ఘకాల చెల్లుబాటుతో తక్కువ డేటా ప్రయోజనాలను రెండు సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అందిస్తుంది. రూ.329 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్‌తో పాటు 6GB డేటాను అందిస్తుంది. అయితే జియో నుండి మరొక నెట్ వర్క్ కు కాల్ చేయడానికి నాన్ జియో కాలింగ్‌ కోసం కేవలం 3000 FUP నిమిషాలను మాత్రమే అందిస్తుంది. ఈ ప్లాన్ జియో యొక్క అన్ని యాప్ లకు కాంప్లిమెంటరీ చందాతో పాటు 1000 SMS‌లను ప్లాన్‌ మొత్తం చెల్లుబాటు కాలానికి అందిస్తాయి.

జియో రూ.1,299 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

జియో రూ.1,299 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

తక్కువ డేటాను ఉపయోగించే వారి కోసం జియో సంస్థ తన వినియోగదారుల కోసం అందిస్తున్న మరొక ప్లాన్ రూ.1,299 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ 336 రోజుల చెల్లుబాటు కాలంలో మొత్తంగా 24GB డేటాను అందిస్తుంది. అలాగే ఇది నాన్-జియో కాలింగ్ కోసం 12,000 FUP నిమిషాలను మరియు జియో-టు-జియో అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ జియో యొక్క అన్ని యాప్ లకు కాంప్లిమెంటరీ చందాను అందించడంతో పాటుగా 3,600SMS ప్రయోజనాలను అందిస్తుంది.

వోడాఫోన్ రూ.379 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

వోడాఫోన్ రూ.379 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

వోడాఫోన్ సంస్థ కూడా తన వినియోగదారులకు తక్కువ డేటా ప్రయోజనాలతో రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. వీటి యొక్క ధరలు వరుసగా రూ.379 మరియు 1,499 రూపాయలు. రూ.379 ప్రీపెయిడ్ ప్లాన్‌ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది కస్టమర్‌లకు 84 రోజుల మొత్తం చెల్లుబాటు కాలంలో 6GB డేటాతో పాటు అపరిమిత కాలింగ్, 1,000SMS ప్రయోజనాలను అందిస్తాయి.

వోడాఫోన్ రూ.1499 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

వోడాఫోన్ రూ.1499 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు

వోడాఫోన్ సంస్థ తన వినియోగదారులకు రూ.1,499 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటు కాలంతో అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ఒక సంవత్సరం చెల్లుబాటు కాలంలో అపరిమిత కాలింగ్, 3,600 SMS మరియు 24GB డేటా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లు రెండూ కూడా OTT ప్రయోజనాలను అదనంగా ఉచితంగా అందిస్తాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.499 విలువైన వోడాఫోన్ ప్లే మరియు రూ.999 విలువైన Zee5 ప్రీమియంకు చందా ఉచితంగా లభిస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Airtel vs Jio vs Vodafone: Less Data With Long Validity Plans Comparison

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X