జియోహాట్‌స్టార్ ఫ్రీ కావాలా.. ఎయిర్‌టెల్ vs జియో రెండూ ఫ్రీగా అందిస్తున్నాయ్.. ఏది బెస్ట్?
Free JioHotstar Subscription: జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ కలిసిపోయి జియోహాట్‌స్టార్‌గా కొత్త అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. దాంతో "గేమ్ ఆఫ్ థ్రోన్స్", "హౌస్ ఆఫ్ ది డ్రాగన్" లాంటి బ్లాక్‌బస్టర్ సిరీస్‌లు మళ్లీ హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చాయి. మీరూ మీ మొబైల్ లేదా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో పాటు జియోహాట్‌స్టార్ ఫ్రీగా చూడాలనుకుంటున్నారా, అయితే ఎయిర్‌టెల్, జియో రెండూ అదిరిపోయే ప్రీపెయిడ్, ఫైబర్ ప్లాన్స్‌తో మీ ముందుకు వచ్చేశాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం, ఏ ప్లాన్ మీకోసం పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుందో చూసేద్దాం. ముందుగా జియోహాట్‌స్టార్ ఉచితంగా అందించే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చూద్దాం. ఇండియాలో నంబర్ 2 టెలికాం ఆపరేటర్ అయిన ఎయిర్‌టెల్, కొన్ని అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్రీగా ఇస్తోంది. వాటిలో టాప్ ప్లాన్స్ ఇవే.

* ఎయిర్‌టెల్ జియోహాట్‌స్టార్ ఫ్రీ ప్లాన్స్
రూ.3,999 (1 సంవత్సరం సబ్‌స్క్రిప్షన్) ప్లాన్‌లో జియోహాట్‌స్టార్ మొబైల్ ఏడాది మొత్తం ఫ్రీ. డేటా విషయానికొస్తే రోజుకి 2.5GB (4G) డేటా వస్తుంది, అలాగే అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా ఉంది. అంతేకాదు, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకి 100 SMSలు ఫ్రీ. ఇంకా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, ఫ్రీ హలోట్యూన్స్ లాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
రూ.1,029 ప్లాన్‌లో మూడు నెలల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ. ఇందులో రోజుకి 2GB (4G) డేటా, అన్‌లిమిటెడ్ 5G డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకి 100 SMSలు వస్తాయి. అంతేకాదు, ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, రివార్డ్స్‌మినీ, అపోలో 24|7 సర్కిల్, ఫ్రీ హలోట్యూన్స్ లాంటి ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
నెల రోజులు జియోహాట్‌స్టార్ మొబైల్ కావాలనుకుంటే రూ.398 ప్లాన్‌ను ట్రై చేయొచ్చు. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో రోజుకి 2GB (4G) డేటా, అన్‌లిమిటెడ్ 5G డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకి 100 SMSలు ఇస్తారు. ఇంకా ఫ్రీ హలోట్యూన్స్ కూడా ఉంది.
* జియో ప్రీపెయిడ్, జియోఫైబర్ ప్లాన్స్‌తో జియోహాట్‌స్టార్
జియో కూడా డిస్నీ+ హాట్‌స్టార్ ప్లేస్‌లో జియోహాట్‌స్టార్‌ని తీసుకొచ్చింది. ప్రీపెయిడ్, జియోఫైబర్, జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసుల్లో ఇప్పుడు జియోహాట్‌స్టార్ ఫ్రీగా లభిస్తుంది. ముందుగా జియో ప్రీపెయిడ్ ప్లాన్ విత్ జియోహాట్‌స్టార్ ప్లాన్లు చూద్దాము. వాటిలో మొదటిది రూ.949 ప్లాన్. మూడు నెలల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఈ ప్లాన్‌లో ఫ్రీ.
డేటా వచ్చేసి రోజుకి 2GB (4G), అన్‌లిమిటెడ్ 5G డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా ఉన్నాయి. జియోటీవీ, జియోక్లౌడ్ లాంటి అదనపు బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. అలాగే రూ.999 జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో 150 Mbps స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా, జియోహాట్‌స్టార్ ఫ్రీ.
రూ.1,499 జియోఫైబర్ ఫ్లాన్‌తో 300 Mbps స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా, జియోహాట్‌స్టార్ ఫ్రీ. రూ.2,499 జియోఫైబర్ ప్లాన్‌తో 500 Mbps స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా, జియోహాట్‌స్టార్ ఫ్రీ. రూ.3,999, రూ.8,499 ప్లాన్స్ కింద 1 Gbps స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా, జియోహాట్‌స్టార్ ఫ్రీగా లభిస్తుంది.
జియోఫైబర్ ప్లాన్స్‌లో జియోహాట్‌స్టార్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ లైట్, ఇంకా 8 ఇతర ఓటీటీ యాప్స్ కూడా ఫ్రీగా లభిస్తాయి. వాటి ద్వారా మీరు ఎన్నో సినిమాలను వెబ్ సిరీస్ లు షోస్, ఫ్రీగా చూడొచ్చు. ఫలితంగా చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. బోల్డంత వినోదాన్ని అందుకోవచ్చు.
* జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్స్ (వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్) విత్ జియోహాట్‌స్టార్
రూ.599 ప్లాన్‌తో 1,000GB డేటా, 30 Mbps స్పీడ్, జియోహాట్‌స్టార్, 800+ టీవీ ఛానల్స్, 9 ఓటీటీ యాప్స్ ఫ్రీ వంటి బెనిఫిట్స్ లభిస్తాయి. రూ.899, రూ. 1,199 ప్లాన్స్ కింద 1,000GB డేటా, 100 Mbps స్పీడ్, జియోహాట్‌స్టార్, 800+ టీవీ ఛానల్స్, 13 ఓటీటీ యాప్స్ ఫ్రీ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
* ఏ ప్లాన్ బెస్ట్
ఒక సంవత్సరం జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కావాలంటే ఎయిర్‌టెల్ రూ.3,999 ప్లాన్ ఒక్కటే మీకు ఆప్షన్. మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ కావాలనుకుంటే జియో రూ.949 ప్రీపెయిడ్ ప్లాన్ ఎయిర్‌టెల్ రూ.1,029 ప్లాన్ కంటే చౌకగా దొరుకుతుంది. బ్రాడ్‌బ్యాండ్‌తో జియోహాట్‌స్టార్ కావాలంటే జియోఫైబర్, జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్స్‌లో ఇతర ఓటీటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
చూస్తే జియోనే ఎక్కువ రకాల ప్లాన్స్‌లో జియోహాట్‌స్టార్ ఆఫర్ చేస్తోంది. కానీ, ఏడాది జియోహాట్‌స్టార్ కావాలంటే మాత్రం ఎయిర్‌టెల్ టాప్ ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్. సో, మీ అవసరాలకు తగ్గట్టుగా ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి.


Click it and Unblock the Notifications








