Home
News

Airtel, Reliance Jio and VI Plans: Rs.200 ధర లోపు లభించే అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్లాన్‌లు ఇవే...

ఇండియాలోని టెలికాం ఆపరేటర్లు మార్కెట్లో గల పోటీని తట్టుకోవడానికి తమ వినియోగదారులను కాపాడుకోవడానికి మరియు వినియోగదారుల బేస్ ను పెంచుకోవడానికి అపరిమిత కాలింగ్ మరియు అపరిమిత డేటా వంటి మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను తమ సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్ లతో అందించడం ప్రారంభించాయి. ఇప్పుడు టెలికం ఆపరేటర్లు వేర్వేరు ధరల వద్ద బహుళ ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నారు. ఇండియాలోని టెలికం ఆపరేటర్లు రూ.200 ధర లోపు అపరిమిత కాలింగ్‌తో లభించే అత్యంత సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రూ .150 ధర లోపు అందించే ఎయిర్టెల్ ప్రీపెయిడ్  ప్లాన్‌లు

రూ .150 ధర లోపు అందించే ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

రూ.200 ధర లోపు ఎయిర్‌టెల్ సంస్థ వినియోగదారులకు ఐదు ప్లాన్‌లను వివిధ చెల్లుబాటుతో అందిస్తుంది.

*** ఎయిర్‌టెల్ రూ.19 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్ దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు రెండు రోజుల పాటు అపరిమిత కాలింగ్‌ను అందిస్తుంది. అలాగే ఇది 200MB డేటాను అందిస్తుంది. అయితే ఆఫర్‌లో SMS ప్రయోజనం అందుబాటులో లేదు.

*** ఎయిర్‌టెల్ రూ.129 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్ 1GB డేటాతో పాటుగా అపరిమిత కాలింగ్ మరియు 300SMS ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. ఇది ఎయిర్టెల్ థాంక్స్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది.


*** ఎయిర్‌టెల్ రూ.149 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్ 300SMS మరియు 2GB డేటాతో పాటు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్‌ ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది.

 

రూ .200 ధర లోపు అందించే ఎయిర్టెల్ ప్రీపెయిడ్  ప్లాన్‌లు

రూ .200 ధర లోపు అందించే ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

*** ఎయిర్‌టెల్ యొక్క రూ .179 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇది అపరిమిత కాలింగ్, రోజుకు 2GB డేటా మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ఎయిర్టెల్ థాంక్స్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

*** ఎయిర్‌టెల్ రూ 199 ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 100SMS , మరియు రోజుకు 1GB డేటా ప్రయోజనాలను 24 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

 

రూ.150 ధర లోపు రిలయన్స్ జియో ప్రీపెయిడ్  ప్లాన్‌లు

రూ.150 ధర లోపు రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో రూ .200 ధర లోపు మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లను రూ .129, రూ .149, రూ .199 ధరల వద్ద అందిస్తుంది.

*** రిలయన్స్ జియో రూ.129 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ కాలంలో 2GB డేటా, జియో నెట్‌వర్క్‌కు అపరిమిత కాలింగ్ మరియు ఇతర నెట్‌వర్క్‌లకు 1000FUP నిమిషాల కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది.

*** రిలయన్స్ జియో యొక్క రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 1GB డేటా ప్రయోజనంతో పాటుగా జియో-టు-జియో అపరిమిత కాలింగ్ మరియు ఇతర నెట్‌వర్క్‌లకు 1000FUP నిమిషాలను కాలింగ్ ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

 

రూ .200 ధర లోపు రిలయన్స్ జియో ప్రీపెయిడ్  ప్లాన్‌లు

రూ .200 ధర లోపు రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు

*** రిలయన్స్ జియో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు కాలంలో రోజుకు 1.5GB డేటా ఆధారంగా మొత్తంగా 42GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ అందిస్తున్న ఇతర ప్రయోజనాలలో రోజుకు 100 SMS, అపరిమిత ఆన్-నెట్ కాలింగ్ మరియు 1000 నిమిషాల ఆఫ్-నెట్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది.

రూ .200 ధర లోపు VI ప్రీపెయిడ్  ప్లాన్‌లు

రూ .200 ధర లోపు VI ప్రీపెయిడ్ ప్లాన్‌లు

*** VI రూ .19 ప్రీపెయిడ్ ప్లాన్ ఎయిర్‌టెల్ యొక్క రూ.19 ప్లాన్‌కు సమానమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇది 2 రోజుల చెల్లుబాటుతో అపరిమిత కాలింగ్ మరియు 200MB డేటా వంటి ప్రయోజనాలను అందిస్తుంది.


*** VI రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 1GB డేటా, అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను 24 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

*** VI రూ.129 ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం వాలిడిటీ కాలంలో 2GB డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్ మరియు 300 SMS ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

*** VI యొక్క రూ.149 ప్రీపెయిడ్ వెబ్ ఎక్స్‌క్లూజివ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ కాలంలో 3GB డేటా, అపరిమిత కాలింగ్ మరియు 300 SMS ప్రయోజనాలను అందిస్తుంది.

 

Best Mobiles in India

English summary
Airtel vs Reliance vs Jio Vs Vi: Unlimited Calling Plans Under Rs. 200
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X