Home
News

Airtel vs Vi రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్: ప్రయోజనాలలో బెస్ట్ ఏది??

దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలు అన్ని కూడా ఇటీవలి టారిఫ్‌ల పెంపుదలను అమలుచేసారు. దీని ద్వారా వారు అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌ల పూర్తి ధరల జాబితాను మార్చాయి. భారతదేశంలోని అన్ని ప్రైవేట్ టెల్కోలు తమ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను దాదాపు 20% వరకు పెంచాయి. వినియోగదారులు దీన్ని తెలుసుకోవడం మరియు సర్దుబాటు చేయడం కోసం కొంత సమయం కావాలి. భారతి ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా తమ యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఒకే విధమైన టారిఫ్‌లలో అందిస్తున్నాయి. అయితే అవి అందించే ఆఫర్‌లు విబిన్నంగా మరియు ప్రత్యేకమైనవిగా ఉన్నాయి. వారు విభిన్న ప్రయోజనాలతో చాలా ప్లాన్‌లను అందిస్తున్నప్పటికీ సాధారణంగా ఉపయోగించే ప్లాన్‌లలో ఒకటి 1.5GB రోజువారీ డేటా ప్లాన్. ఇది సాధారణంగా వినియోగదారులకు సరిపోతుంది. ఈ రెండు టెల్కోలు రూ. 299 ధర వద్ద అందించే ప్లాన్‌ యొక్క వివరణాత్మక ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ ఐడియా(Vi) రూ.299 ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) రూ.299 ప్లాన్

వోడాఫోన్ ఐడియా లేదా Vi దాని అపరిమిత ప్రీపెయిడ్ ప్లాన్‌ల జాబితాలో 1.5GB రోజువారి డేటా ప్రయోజనంతో రూ.299 ధర వద్ద ఒక ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు వ్యవధి 28 రోజులు. ఇది రోజుకు 100 SMSలతో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాలలో "బింగే ఆల్ నైట్" ఫీచర్‌ను కలిగి ఉంది. దీనితో వినియోగదారులు అర్ధరాత్రి 12 నుండి ఉదయం 6 గంటల వరకు అపరిమిత ఇంటర్నెట్‌ని ఉపయోగించుకునేలా అనుమతిస్తుంది. వినియోగదారులు సోమవారం నుండి శుక్రవారం రోజులలో ఉపయోగించని డేటాను శనివారం మరియు ఆదివారం రోజులలో ఉపయోగించడానికి వీలును కల్పిస్తుంది. దీనిని "వీకెండ్ రోల్ ఓవర్" ప్రయోజనం అని కూడా పిలుస్తారు. దీనితో పాటు వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ప్రతి నెలా 2GB డేటా బ్యాకప్ పొందుతారు.

భారతీ ఎయిర్‌టెల్  రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్

భారతీ ఎయిర్‌టెల్ రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్

భారతీ ఎయిర్‌టెల్ కూడా ఇదే ధర వద్ద ఇదేవిధమైన ప్లాన్‌ను కూడా అందిస్తోంది. రూ.299 ధరతో వినియోగదారులు 28 రోజుల చెల్లుబాటు వ్యవధిలో ప్రతిరోజూ 1.5GB ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు. డేటా పరిమితికి మించిన తరువాత వినియోగదారులు 64 Kbps వేగంతో అపరిమిత ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు. ఈ ప్యాక్ నిజంగా అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMSల ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క మొబైల్ ఎడిషన్ యొక్క ఉచిత ట్రయల్ యాక్సెస్, ఉచిత Wynk సంగీతం మరియు షా అకాడమీ మరియు అపోలో సర్కిల్ యాక్సెస్‌తో సహా కొన్ని ఇతర ఆఫర్‌లు ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

రూ.299 ధరలోపు మరిన్ని ఆఫర్‌లు

రూ.299 ధరలోపు మరిన్ని ఆఫర్‌లు

రెండు టెల్కోలు రూ.299 ధర లోపు మరికొన్ని అపరిమిత ఆఫర్‌ల ప్లాన్ లను అందిస్తున్నాయి. వాటిలో Vi టెల్కో రూ.199 ధర వద్ద అపరిమిత వాయిస్ కాలింగ్ ప్లాన్‌తో రోజుకు 1GB డేటాను అందిస్తుంది. అలాగే వినియోగదారులు రోజుకు 100 SMSలను కూడా 18 రోజుల చెల్లుబాటు వ్యవధికి పొందుతారు. అలాగే వినియోగదారులు రూ.219 ధర వద్ద లభించే ప్లాన్ తో 21 రోజుల చెల్లుబాటు వ్యవధికి అవే ప్రయోజనాలను పొందవచ్చు. జాబితాలో చివరిది రూ.249 ధర వద్ద లభించే అపరిమిత వాయిస్ కాలింగ్ ప్యాక్. ఇది 21 రోజుల చెల్లుబాటు వ్యవధిలో రోజుకు 1.5GB డేటా మరియు రోజుకు 100 SMSల ప్రయోజనాలను అందిస్తుంది.

ఎయిర్‌టెల్

మరోవైపు ఎయిర్‌టెల్ కూడా రూ.155 ధరతో కూడిన ప్లాన్‌ను అందిస్తోంది. ఇది 24 రోజుల చెల్లుబాటు వ్యవధికి 1GB డేటాను అందిస్తుంది. వినియోగదారులు అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు మొత్తం 300 SMSలను కూడా పొందుతారు. రూ.179 ధర వద్ద లభించే ప్లాన్ తో వినియోగదారులు 28 రోజుల చెల్లుబాటు వ్యవధితో 2GB మొత్తం డేటాతో అవే ప్రయోజనాలను పొందవచ్చు. చివరగా, వినియోగదారులు రూ.239 ధర వద్ద లభించే ప్లాన్ తో 24 రోజుల వ్యవధిలో ప్రతిరోజూ 1GB డేటాను పొందవచ్చు. వినియోగదారులు అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMSలను కూడా పొందుతారు. పేర్కొన్న అన్ని ప్లాన్‌లు అమెజాన్ ప్రైమ్ వీడియో ఉచిత ట్రయల్ మొబైల్ ఎడిషన్‌కు కూడా యాక్సెస్‌తో వస్తాయి.

ఎయిర్‌టెల్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్

మొబైల్ డేటా, ఫోన్ కాల్స్ మరియు SMS ప్రయోజనాల విషయానికి వస్తే ఎయిర్‌టెల్ యొక్క రూ.3359 ప్రీపెయిడ్ ప్లాన్ రోజువారి 2GB డేటా, 100 SMS మరియు అపరిమిత కాల్‌ల ప్రయోజనాలతో లభిస్తుంది. FUP డేటా తర్వాత వినియోగదారులు 64 Kbps వేగంతో అపరిమిత డేటాను యాక్సిస్ చేయడానికి అనుమతిస్తుంది. అదేవిధంగా SMS పరిమితుల తర్వాత Airtel స్థానిక SMSకి రూ.1 మరియు STD టెక్స్ట్ సందేశానికి రూ. 1.50 వసూలు చేస్తుంది.

Vi వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్

Vi వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో ఈ మూడింటిలో అధిక మొత్తంలో డేటా ప్రయోజనాలను అందిస్తుంది. రూ.3099 ధర వద్ద లభించే వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ కింద అందించే రోజువారీ డేటా, కాల్‌లు మరియు SMS పరిమితులలో 1.5GB రోజువారీ డేటా, 100 SMS మరియు అపరిమిత కాల్‌లు ఉన్నాయి. అదనంగా టెల్కో రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పరిమితులు లేకుండా రాత్రి డేటాను అందిస్తుంది. వినియోగదారు వారంలోని ఉపయోగించని డేటాను వారాంతం వరకు కూడా తీసుకెళ్లవచ్చు. ప్రతి నెలా 2GB బ్యాకప్ డేటా కూడా అందించబడుతుంది. Vi యొక్క రూ. 2899 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ క్రింద అదే ఉచిత అపరిమిత రాత్రి డేటా మరియు వారాంతపు డేటా రోల్‌ఓవర్ ప్రయోజనాలు కూడా అందించబడతాయి. అయితే ఈ ప్లాన్ లో డిస్నీ + హాట్‌స్టార్ ప్రయోజనం లేదు.

Best Mobiles in India

English summary
Airtel vs Vi Rs.299 Prepaid Plan: Daily Data and OTT Benefits and Other Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X