Home
News

రూ.50 లోపు లభించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే...!

టెలికాం రంగంలో రోజురోజుకు వార్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దిగ్గజాలు తమ కస్టమర్లను కాపాడుకునేందుకే ప్రాధాన్యాత ఇస్తున్నాయి.

By Anil

టెలికాం రంగంలో రోజురోజుకు వార్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దిగ్గజాలు తమ కస్టమర్లను కాపాడుకునేందుకే ప్రాధాన్యాత ఇస్తున్నాయి. అందులో భాగంగా తక్కవు ధరలకే డేటా ప్లాన్లను అందిస్తూ వస్తున్నాయి. ఓ కంపెనీ ఆఫర్ రిలీజ్ చేయగానే మరో కంపెనీ దాని కన్నా తక్కువ ధరలో మెరుగైన ఆఫర్ ను అందించేందుకు రెడీ అవుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జియో రాకతో టెలికం రంగం ఒక్కసారిగా కుదుపులకు లోనై ఇప్పుడిప్పుడే కొంచెం తేరుకుంటోంది. జియో ఆఫర్ల సునామి దెబ్బకు దిగ్గజాలన్నీ కోట్ల నష్టాలను చవిచూశాయి. ఇప్పుడు జియో కూడా ఫ్రీ నుంచి డబ్బుల్లోకి తమ ఆఫర్లను మార్చడంతో టెలికం రంగం కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మార్కెట్లో రూ.50 లోపు లభిస్తున్న బెస్ట్ ప్లాన్లపై ఓ లుక్కేద్దాం.

Airtel రూ.35, రూ.47 ప్రీపెయిడ్  ప్లాన్స్...

Airtel రూ.35, రూ.47 ప్రీపెయిడ్ ప్లాన్స్...

యూజర్ల కోసం ఎయిర్టెల్ రూ. 35 ప్లాన్ ,రూ.47 ప్లాన్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది .ఈ రూ.35 ప్లాన్ తో యూజర్ కు రోజుకు 100 MB డేటా లభిస్తుంది. అలాగే ఈ ప్లాన్ లో 26.66 రూపాయల టాక్ టైమ్ వస్తుంది, లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ 1p / sec వద్ద వసూలు చేస్తాయి.అయితే ఈ ప్లాన్ ప్రస్తుతం తమిళ్ నాడు,పంజాబ్ లో మాత్రం అందుబాటులో ఉంది . ఈ రూ.47 ప్లాన్ తో యూజర్ కు రోజుకు 500 MB డేటా లభిస్తుంది. అలాగే ఈ ప్లాన్ లో 125 నిమిషాల టాక్ టైమ్ వస్తుంది.

Vodafone  రూ.47 ప్రీపెయిడ్ ప్లాన్...

Vodafone రూ.47 ప్రీపెయిడ్ ప్లాన్...

యూజర్ల కోసం వోడాఫోన్ రూ.47 ప్లాన్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది .ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ప్లాన్‌లో భాగంగా రోజుకు 500 MB డేటా చొప్పున వాడుకోవల్సి ఉంటుంది అలాగే రోజుకి 50 SMS పొందవచ్చు. ఈ ప్లాన్ లో 125 నిముషాలు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు . ఇది అన్ని రోమింగ్ STD మరియు లోకల్ కాల్స్ కు వర్తిస్తాయి.

Jio రూ.49 ప్రీపెయిడ్ ప్లాన్...

Jio రూ.49 ప్రీపెయిడ్ ప్లాన్...

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ప్లాన్‌లో భాగంగా రోజుకు 1 జీబి డేటా చొప్పున వాడుకోవల్సి ఉంటుంది అలాగే అపరిమిత కాల్స్, 50 SMS, మరియు జియో యాప్ సూట్‌ను కూడా ఉచితంగా యాక్సిస్ చేసుకునే వీలుంటుంది.. అయితే ఈ ప్లాన్ రిలయన్స్ జీయోఫోన్ యూజర్లకు మాత్రమే పరిమితం చేయబడింది.

BSNL రూ.19 ప్రీపెయిడ్ ప్లాన్...

BSNL రూ.19 ప్రీపెయిడ్ ప్లాన్...

యూజర్ల కోసం BSNL రూ .19 ప్లాన్ ను మార్కెట్ లోకి ప్రవేశ పెట్టింది .ఇది చెన్నై, తమిళనాడు సర్కిల్స్ లభించే ఎస్.టి.వి. మాత్రమే. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 54 రోజులు మాత్రమే . అయితే, ఉచిత డేటా, ఎస్ఎంఎస్, కాలింగ్ అందిస్తున్న పోటీదారులతో పోలిస్తే, BSNL యొక్క ప్రణాళిక ప్రాథమికంగా ఒక రేటు కట్టర్, ఇక్కడ BSNL నంబర్లకు అవుట్-నెట్ కాల్స్ కు నిమిషానికి 15 పైసలు మాత్రమే , ఇతర నెట్ వర్కులకు ఆఫ్-నెట్ కాల్స్ ధరకే ఉంటుంది అంటే నిమిషానికి 35 పైసలు.

Best Mobiles in India

English summary
Airtel vs Vodafone vs Reliance Jio vs BSNL : Prepaid combo recharge plans under Rs 50 compared.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X