Airtel Wi-Fi broadband తక్కువ ధరలో అందిస్తున్న ప్లాన్‌లు
ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లుగా ఇప్పుడు టెలికాం సర్వీసు ప్రొవైడర్లు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ లు ఈ గేమ్‌లోకి ప్రవేశించారు. సర్వీసు ప్రొవైడర్లు లాభదాయకమైన ప్లాన్లను తక్కువ ధరల వద్ద అధిక వేగంతో ఎక్కువ డేటాను అందిస్తున్నారు.

ఇటీవలే ఎయిర్టెల్ భారతదేశంలో తన వై-ఫై సర్వీస్ కోసం తన స్వంత ప్రణాళికలతో వచ్చింది. ఎయిర్‌టెల్ వై-ఫై బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు వివిధ OTT సేవలకు యాక్సిస్ ను అందిస్తున్నది.

ఎయిర్టెల్ తన వై-ఫై సర్వీస్ వినియోగదారుల కోసం ఎంచుకోవడానికి నాలుగు బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలను కలిగి ఉన్నాయి. ఎయిర్‌టెల్ యొక్క ఈ ప్యాక్ లు 100 Mbps వేగంతో 799 రూపాయల నుండి ప్రారంభమవుతాయి. ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ అందిస్తున్న మరిన్ని ప్లాన్ లలో మీకు ఉపయోగకరమైన వై-ఫై ప్లాన్ ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ రూ.799 బేసిక్ ప్లాన్
ఎయిర్‌టెల్ వై-ఫై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లలో మీరు తక్కువ ధరలో ఎంచుకోవడానికి బేసిక్ ప్లాన్ రూ.799ల వద్ద ఉంది. ఈ ప్లాన్ 100mbps వేగంతో 100GB పరిమిత డేటాను అందిస్తుంది. ఇది ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌కు యాక్సిస్ ను అందించడం వంటి అదనపు ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ఈ ప్లాన్‌ను అపరిమిత ప్లాన్‌గా మార్చడానికి యూజర్లు మరో 299 రూపాయలతో రీఛార్జి చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ అదనపు రీఛార్జ్ ప్లాన్ ఏదైనా టాప్-అప్ ప్లాన్‌ను అపరిమిత ప్లాన్‌గా మార్చడానికి కూడా ఉపయోగపడుతుంది.

రూ.999 ఎంటర్టైన్మెంట్ ప్లాన్
ఎయిర్‌టెల్ అందిస్తున్న రెండవ వై-ఫై ప్లాన్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ యొక్క ధర 999 రూపాయలు. ఈ ప్లాన్ 200Mbps వేగంతో 500GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ అందిస్తున్న అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఇది అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, Zee 5 ప్రీమియం మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ వంటి యాప్ లకు ఉచిత యాక్సెస్ ను అందిస్తుంది.

రూ .1,499 ప్రీమియం ప్లాన్
ఎయిర్టెల్ యొక్క మూడవ వై-ఫై ప్లాన్ ప్రీమియం ప్లాన్ యొక్క ధర 1,499 రూపాయలు. ఇది 300 Mbps వేగాన్ని కలిగి ఉండి 500 GB డేటాను అందిస్తుంది. ఈ ప్యాక్ యొక్క అదనపు ప్రయోజనాలలో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, Zee 5 ప్రీమియం మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ లకు ఉచిత యాక్సిస్ వంటివి ఉన్నాయి. ఈ ప్రీమియం ప్లాన్ మరియు రూ .999ల ఎంటర్టైన్మెంట్ ప్లాన్ మధ్య ఉన్న తేడా ఏమిటంటే డేటాను ప్రసారం చేసే వేగం మరియు డేటాలో గల వ్యత్యాసం.

3,999 రూపాయల విఐపి ప్లాన్
ఎయిర్టెల్ తన జాబితాలో అందిస్తున్న నాల్గవ మరియు చివరి వై-ఫై ప్లాన్ అత్యంత ఖరీదైనది. దీని యొక్క ధర నెలకు రూ.39999. ఈ ప్లాన్ అపరిమిత డేటాను 1Gbps వేగంతో అందిస్తుంది. అపరిమిత డేటాను అధిక వేగంతో పొందాలనుకునే ప్రీమియం వినియోగదారులకు ఇది బాగా సరిపోతుంది. ఈ ప్లాన్ అందిస్తున్న అదనపు ప్రయోజనాలలో భాగంగా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, Zee5 ప్రీమియం మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ వంటి యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








