1 మిలియన్ వినియోగదారులను దాటిన ఎయిర్టెల్ వై-ఫై కాలింగ్ సర్వీస్

|

టెలికామ్ ఆపరేటర్లలో అందరికంటే ముందుగా ఎయిర్‌టెల్ ఇటీవల తన వాయిస్ ఓవర్ వై-ఫై కాలింగ్ సేవను ప్రారంభించింది. ఇది వినియోగదారులను వారి వై-ఫై కనెక్షన్ ఉపయోగించి టెల్కో-గ్రేడ్ కాల్స్ చేయడానికి అనుమతిస్తుంది.

 

ఎయిర్టెల్ వై-ఫై కాలింగ్

ఈ ప్రత్యేకమైన టెక్నాలజీను ఉపయోగించి వినియోగదారులు ఏదైనా ఛానెల్‌ని సృష్టించడానికి మరియు వై-ఫై ద్వారా ఏ నెట్‌వర్క్‌లకైనా ఫోన్ కాల్ చేయడానికి అనుమతిస్తుంది. కొత్తగా ప్రారంభమైన ఈ ఎయిర్టెల్ వై-ఫై కాలింగ్ సర్వీసును ఇప్పుడు 1 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉపయోగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

 

 

Dish SMRT Hub & Tata Sky Binge+ సెట్-టాప్-బాక్స్‌ల మధ్య తేడా...Dish SMRT Hub & Tata Sky Binge+ సెట్-టాప్-బాక్స్‌ల మధ్య తేడా...

ఇండోర్ వాయిస్ కాలింగ్
 

ఇండోర్ వాయిస్ కాలింగ్

స్మార్ట్ఫోన్ కస్టమర్లకు ఇండోర్ వాయిస్ కాలింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వై-ఫై కాలింగ్ సర్వీస్ అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీని ఉపయోగిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సేవ తప్పనిసరిగా వాయిస్ కాల్‌ల కోసం ప్రత్యేకమైన ఛానెల్‌ను రూపొందించడానికి వై-ఫై నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తుంది. అలాగే వినియోగదారులను ఏ నెట్‌వర్క్‌కైనా టెల్కో గ్రేడ్ కాల్స్ చేయడానికి అనుమతిస్తుంది. కస్టమర్‌లు సజావుగా వై-ఫై కాలింగ్‌కు మారవచ్చు కాబట్టి ఇది అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.

 

 

భారీ తగ్గింపు ధరతో ఫ్లిప్‌కార్ట్ లో Oppo K1 స్మార్ట్‌ఫోన్‌భారీ తగ్గింపు ధరతో ఫ్లిప్‌కార్ట్ లో Oppo K1 స్మార్ట్‌ఫోన్‌

ఎయిర్‌టెల్ CTO రణదీప్ సెఖోన్

ఎయిర్‌టెల్ CTO రణదీప్ సెఖోన్

ఎయిర్టెల్ వై-ఫై కాలింగ్ కోసం చాలా మంచి కస్టమర్ ప్రతిస్పందనతో మేము సంతోషిస్తున్నాము. ఎయిర్టెల్ మొబైల్ కస్టమర్లకు, ముఖ్యంగా పట్టణ మార్కెట్లలో అధిక జనాభా సాంద్రత ఉన్న ప్రాంతాలలో ఈ టెక్నాలజీ ఇండోర్ నెట్‌వర్క్ నాణ్యతను మార్చివేసింది అని భారతి ఎయిర్‌టెల్ యొక్క CTO రణదీప్ సెఖోన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వీసును భారతదేశమంతటా ప్రత్యక్షంగా ప్రసారం చేయడానికి ఎయిర్‌టెల్ కృషిచేస్తున్నది అని ఆయన చెప్పారు.

 

 

కనీస రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచిన ఎయిర్‌టెల్ & వొడాఫోన్ ఐడియాకనీస రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచిన ఎయిర్‌టెల్ & వొడాఫోన్ ఐడియా

Wi-Fi కాలింగ్

Wi-Fi కాలింగ్

ఎయిర్టెల్ యొక్క Wi-Fi కాలింగ్ ఇప్పుడు భారతదేశం అంతటా ప్రత్యక్షంగా ఉంది. ఇండియాలో అందుబాటులో ఉన్న16 బ్రాండ్లలోని సుమారు 100 కి పైగా స్మార్ట్‌ఫోన్‌ల బ్రాండ్లు ఇప్పుడు ఈ ఫీచర్‌కు మద్దతు ఇస్తున్నాయి. Wi-Fi కాలింగ్ ద్వారా కాల్‌లకు అదనపు ఛార్జీలు ఏమి వర్తించవు. కేవలం అప్లికేషన్ కోసం కనీస డేటాను మాత్రమే వినియోగిస్తుంది. వినియోగదారులు ప్రాథమికంగా అదనపు కాలింగ్ యాప్ లేదా సిమ్ కార్డు అవసరం లేకుండానే Wi-Fi కాలింగ్ సర్వీసును ఉపయోగించి ఫోన్ కాల్స్ చేయడం ప్రారంభించవచ్చు.

 

 

స్మార్ట్‌ఫోన్‌లలో  ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ సర్వీస్

స్మార్ట్‌ఫోన్‌లలో ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ సర్వీస్

భారతి ఎయిర్‌టెల్ ఈ సేవను మరో నాలుగు సర్కిల్‌లకు విస్తరించడంతో పాటు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఈ జాబితాలో కొత్తగా వున్న వాటిలో షియోమి రెడ్‌మి Y3, రెడ్‌మి 7A మరియు రెడ్‌మి నోట్ 7 ప్రో ఉన్నాయి. షియోమి రెడ్‌మి నోట్ 8 ప్రోలో MIUI 11 అప్‌డేట్ తర్వాత VoWi-Fi సర్వీస్ లభ్యత కలుగుతుంది. కొన్ని శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా వీటి అనుకూల ఫోన్‌ల జాబితాలో ఉన్నాయి.

 

 

గూగుల్ మ్యాప్స్ ద్వారా పార్కింగ్ అందుబాటును తెలుసుకోవడం ఎలా?గూగుల్ మ్యాప్స్ ద్వారా పార్కింగ్ అందుబాటును తెలుసుకోవడం ఎలా?

ఎయిర్‌టెల్

భారతీ ఎయిర్‌టెల్ ప్రతి వారం గడిచేకొద్దీ ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్‌ను మరింత సర్కిల్‌లకు దూకుడుగా విస్తరిస్తోంది. టెల్కో ప్రస్తుతం వోడాఫోన్ మరియు ఐడియా సెల్యులార్ నెట్‌వర్క్‌ను అనుసంధానించే ప్రక్రియలో ఉన్నందున వొడాఫోన్ ఐడియా VoWi-Fi సేవను ప్రారంభించకపోవచ్చు. పైన పేర్కొన్న పది సర్కిల్‌లతో పాటు అనుకూలమైన హ్యాండ్‌సెట్ ఉన్న ఎయిర్‌టెల్ కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో వై-ఫై కాలింగ్ సేవను గుర్తించగలుగుతారు ఎందుకంటే టెల్కో వివిధ సర్కిల్‌లలో అధునాతన పరీక్షను నిర్వహిస్తోంది.

Best Mobiles in India

English summary
Airtel Wi-Fi calling crosses 1 million users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X