1 మిలియన్ వినియోగదారులను దాటిన ఎయిర్టెల్ వై-ఫై కాలింగ్ సర్వీస్

|

టెలికామ్ ఆపరేటర్లలో అందరికంటే ముందుగా ఎయిర్‌టెల్ ఇటీవల తన వాయిస్ ఓవర్ వై-ఫై కాలింగ్ సేవను ప్రారంభించింది. ఇది వినియోగదారులను వారి వై-ఫై కనెక్షన్ ఉపయోగించి టెల్కో-గ్రేడ్ కాల్స్ చేయడానికి అనుమతిస్తుంది.

ఎయిర్టెల్ వై-ఫై కాలింగ్
 

ఈ ప్రత్యేకమైన టెక్నాలజీను ఉపయోగించి వినియోగదారులు ఏదైనా ఛానెల్‌ని సృష్టించడానికి మరియు వై-ఫై ద్వారా ఏ నెట్‌వర్క్‌లకైనా ఫోన్ కాల్ చేయడానికి అనుమతిస్తుంది. కొత్తగా ప్రారంభమైన ఈ ఎయిర్టెల్ వై-ఫై కాలింగ్ సర్వీసును ఇప్పుడు 1 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉపయోగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Dish SMRT Hub & Tata Sky Binge+ సెట్-టాప్-బాక్స్‌ల మధ్య తేడా...

ఇండోర్ వాయిస్ కాలింగ్

ఇండోర్ వాయిస్ కాలింగ్

స్మార్ట్ఫోన్ కస్టమర్లకు ఇండోర్ వాయిస్ కాలింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వై-ఫై కాలింగ్ సర్వీస్ అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీని ఉపయోగిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సేవ తప్పనిసరిగా వాయిస్ కాల్‌ల కోసం ప్రత్యేకమైన ఛానెల్‌ను రూపొందించడానికి వై-ఫై నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తుంది. అలాగే వినియోగదారులను ఏ నెట్‌వర్క్‌కైనా టెల్కో గ్రేడ్ కాల్స్ చేయడానికి అనుమతిస్తుంది. కస్టమర్‌లు సజావుగా వై-ఫై కాలింగ్‌కు మారవచ్చు కాబట్టి ఇది అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.

భారీ తగ్గింపు ధరతో ఫ్లిప్‌కార్ట్ లో Oppo K1 స్మార్ట్‌ఫోన్‌

ఎయిర్‌టెల్ CTO రణదీప్ సెఖోన్

ఎయిర్‌టెల్ CTO రణదీప్ సెఖోన్

ఎయిర్టెల్ వై-ఫై కాలింగ్ కోసం చాలా మంచి కస్టమర్ ప్రతిస్పందనతో మేము సంతోషిస్తున్నాము. ఎయిర్టెల్ మొబైల్ కస్టమర్లకు, ముఖ్యంగా పట్టణ మార్కెట్లలో అధిక జనాభా సాంద్రత ఉన్న ప్రాంతాలలో ఈ టెక్నాలజీ ఇండోర్ నెట్‌వర్క్ నాణ్యతను మార్చివేసింది అని భారతి ఎయిర్‌టెల్ యొక్క CTO రణదీప్ సెఖోన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వీసును భారతదేశమంతటా ప్రత్యక్షంగా ప్రసారం చేయడానికి ఎయిర్‌టెల్ కృషిచేస్తున్నది అని ఆయన చెప్పారు.

కనీస రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచిన ఎయిర్‌టెల్ & వొడాఫోన్ ఐడియా

Wi-Fi కాలింగ్
 

Wi-Fi కాలింగ్

ఎయిర్టెల్ యొక్క Wi-Fi కాలింగ్ ఇప్పుడు భారతదేశం అంతటా ప్రత్యక్షంగా ఉంది. ఇండియాలో అందుబాటులో ఉన్న16 బ్రాండ్లలోని సుమారు 100 కి పైగా స్మార్ట్‌ఫోన్‌ల బ్రాండ్లు ఇప్పుడు ఈ ఫీచర్‌కు మద్దతు ఇస్తున్నాయి. Wi-Fi కాలింగ్ ద్వారా కాల్‌లకు అదనపు ఛార్జీలు ఏమి వర్తించవు. కేవలం అప్లికేషన్ కోసం కనీస డేటాను మాత్రమే వినియోగిస్తుంది. వినియోగదారులు ప్రాథమికంగా అదనపు కాలింగ్ యాప్ లేదా సిమ్ కార్డు అవసరం లేకుండానే Wi-Fi కాలింగ్ సర్వీసును ఉపయోగించి ఫోన్ కాల్స్ చేయడం ప్రారంభించవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లలో  ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ సర్వీస్

స్మార్ట్‌ఫోన్‌లలో ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ సర్వీస్

భారతి ఎయిర్‌టెల్ ఈ సేవను మరో నాలుగు సర్కిల్‌లకు విస్తరించడంతో పాటు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఈ జాబితాలో కొత్తగా వున్న వాటిలో షియోమి రెడ్‌మి Y3, రెడ్‌మి 7A మరియు రెడ్‌మి నోట్ 7 ప్రో ఉన్నాయి. షియోమి రెడ్‌మి నోట్ 8 ప్రోలో MIUI 11 అప్‌డేట్ తర్వాత VoWi-Fi సర్వీస్ లభ్యత కలుగుతుంది. కొన్ని శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా వీటి అనుకూల ఫోన్‌ల జాబితాలో ఉన్నాయి.

గూగుల్ మ్యాప్స్ ద్వారా పార్కింగ్ అందుబాటును తెలుసుకోవడం ఎలా?

ఎయిర్‌టెల్

భారతీ ఎయిర్‌టెల్ ప్రతి వారం గడిచేకొద్దీ ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్‌ను మరింత సర్కిల్‌లకు దూకుడుగా విస్తరిస్తోంది. టెల్కో ప్రస్తుతం వోడాఫోన్ మరియు ఐడియా సెల్యులార్ నెట్‌వర్క్‌ను అనుసంధానించే ప్రక్రియలో ఉన్నందున వొడాఫోన్ ఐడియా VoWi-Fi సేవను ప్రారంభించకపోవచ్చు. పైన పేర్కొన్న పది సర్కిల్‌లతో పాటు అనుకూలమైన హ్యాండ్‌సెట్ ఉన్న ఎయిర్‌టెల్ కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో వై-ఫై కాలింగ్ సేవను గుర్తించగలుగుతారు ఎందుకంటే టెల్కో వివిధ సర్కిల్‌లలో అధునాతన పరీక్షను నిర్వహిస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Airtel Wi-Fi calling crosses 1 million users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X