Airtel WiFi Calling : మరింత వేగంగా విస్తరిస్తున్న సర్వీస్
భారతి ఎయిర్‌టెల్ తన Wi-Fi కాలింగ్ యొక్క సర్వీసును ఇప్పుడు మరింత సర్కిల్‌లకు చురుకుగా విస్తరిస్తోంది. మొదటగా ఇండియాలో ఎయిర్‌టెల్ మొత్తంగా ఆరు సర్కిల్‌లలో Wi-Fi కాలింగ్ లేదా VoWi-Fi సర్వీసును అందుబాటులో తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ సేవను 10 సర్కిల్‌లకు విస్తరించినట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.

ఎయిర్‌టెల్ Wi-Fi కాలింగ్ ఇప్పుడు గుజరాత్, యుపి (వెస్ట్), కేరళ మరియు మహారాష్ట్ర సర్కిల్‌లలోకి కూడా అందుబాటులోకి వచ్చింది. ఇంతకుముందు ఈ సర్వీసు డిల్లీ ఎన్‌సిఆర్, ముంబై, కోల్‌కతా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు సర్కిల్‌లలో అందుబాటులో ఉంది. ఈ సర్వీస్ విస్తరణతో పాటు వీటి యొక్క అనుకూల స్మార్ట్‌ఫోన్ల జాబితా కూడా మరింత పెరిగింది. ఇందులో రెడ్‌మి 7A, రెడ్‌మి నోట్ 7 ప్రో, రెడ్‌మి Y3 వంటి షియోమి ఫోన్‌లు ఇప్పుడు ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్‌కు మద్దతు ఇస్తున్నాయి. దీని గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ VoWi-Fi VS జియో VoWi-Fi
ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని జియో కంటే ముందు VoWi-Fi సేవను ప్రారంభించడం ద్వారా భారతి ఎయిర్‌టెల్ రిలయన్స్ జియోను ఓడించగలిగింది. జియో తన VoWi-Fi సేవను కేవలం మూడు సర్కిల్‌లలో ప్రారంభించగా ఎయిర్‌టెల్ తన Wi-Fi కాలింగ్ సర్వీసును ఇప్పుడు పది సర్కిల్‌లలో అందుబాటులో తీసుకువచ్చింది. డిల్లీ ఎన్‌సిఆర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, యుపి (పశ్చిమ), మహారాష్ట్ర, ముంబై, కోల్‌కతా ప్రాంతాలలో ఈ సర్వీస్ ప్రారంభించింది. మరొక వైపు రిలయన్స్ జియో తన VoWi-Fi సేవలను కేరళ, మహారాష్ట్ర మరియు కోల్‌కతా సర్కిల్‌లలో మాత్రమే అందిస్తోంది.

బ్రాడ్‌బ్యాండ్‌తో VoWi-Fi సర్వీస్
VoWi-Fi కాలింగ్ సర్వీస్ ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్‌తో మాత్రమే పనిచేస్తుందని మొదట భారతి ఎయిర్‌టెల్ తెలిపింది. తరువాత ఇతర బ్రాడ్‌బ్యాండ్ ఆపరేటర్లలో ACT ఫైబర్నెట్, స్పెక్ట్రా వంటి మరిన్నింటిలో కూడా దీనిని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సర్వీస్ స్థానిక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ISP) తో కూడా కలిసి పనిచేస్తోంది. ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఉన్న వినియోగదారులకు ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుందని ఎయిర్టెల్ వెబ్‌సైట్ ఇప్పటికే పేర్కొంది.

మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ సర్వీస్
భారతి ఎయిర్‌టెల్ ఈ సేవను మరో నాలుగు సర్కిల్‌లకు విస్తరించడంతో పాటు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఈ జాబితాలో కొత్తగా వున్న వాటిలో షియోమి రెడ్‌మి Y3, రెడ్‌మి 7A మరియు రెడ్‌మి నోట్ 7 ప్రో ఉన్నాయి. షియోమి రెడ్‌మి నోట్ 8 ప్రోలో MIUI 11 అప్‌డేట్ తర్వాత VoWi-Fi సర్వీస్ లభ్యత కలుగుతుంది. కొన్ని శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా వీటి అనుకూల ఫోన్‌ల జాబితాలో ఉన్నాయి.

మొత్తంమీద ఎయిర్టెల్ వై-ఫై కాలింగ్ ఇప్పుడు ఆపిల్, శామ్సంగ్, షియోమి మరియు వన్ ప్లస్ అనే నాలుగు బ్రాండ్ల నుండి 40 స్మార్ట్‌ఫోన్‌లకు మద్దతు ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ల అనుకూలత జాబితా రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతుంది. VoWi-Fi మద్దతును జోడించడానికి టెలికాం ఆపరేటర్లతో రియల్మే కూడా జతకలవనున్నది.

భారతీ ఎయిర్‌టెల్ ప్రతి వారం గడిచేకొద్దీ ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్‌ను మరింత సర్కిల్‌లకు దూకుడుగా విస్తరిస్తోంది. టెల్కో ప్రస్తుతం వోడాఫోన్ మరియు ఐడియా సెల్యులార్ నెట్‌వర్క్‌ను అనుసంధానించే ప్రక్రియలో ఉన్నందున వొడాఫోన్ ఐడియా VoWi-Fi సేవను ప్రారంభించకపోవచ్చు. పైన పేర్కొన్న పది సర్కిల్‌లతో పాటు అనుకూలమైన హ్యాండ్‌సెట్ ఉన్న ఎయిర్‌టెల్ కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో వై-ఫై కాలింగ్ సేవను గుర్తించగలుగుతారు ఎందుకంటే టెల్కో వివిధ సర్కిల్‌లలో అధునాతన పరీక్షను నిర్వహిస్తోంది.


Click it and Unblock the Notifications