ఖాతాదారులకు ఎయిర్‌టెల్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది

By Gizbot Bureau
|

దిగ్గజ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తమ ఖాతాదారులకు భారీ షాకిచ్చింది. ఇన్‌కమింగ్ కాల్స్ నిబంధనలను మార్చిన ఎయిర్‌టెల్.. ఇకపై ప్లాన్ కాలపరిమితి ముగిసిన తర్వాత ఏడు రోజులు మాత్రమే ఇన్‌కమింగ్ కాల్స్ వస్తాయని ప్రకటించింది. ఇప్పటి వరకు ఇది 15 రోజులుగా ఉండగా, ఇప్పుడు దానిని సగానికి కుదించింది.

Airtel wont allow incoming calls anymore after 7 days of validity expiry

దీంతోపాటు ఎయిర్‌టెల్ మరో షాకింగ్ ప్రకటన కూడా చేసింది. తమ ఖాతాలో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ప్లాన్ కాలపరిమితి ముగిసిన తర్వాత రీచార్జ్ చేసుకోకపోతే వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు. యూజర్ల నుంచి వచ్చే సగటు రాబడి (ఏఆర్‌పీయూ)ని పెంచుకునే దిశగా ఎయిర్‌టెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

టెలికం విశ్లేషకులు ఆశ్చర్యం

టెలికం విశ్లేషకులు ఆశ్చర్యం

ఎయిర్‌టెల్ నిర్ణయంపై టెలికం విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టెల్కో తాజా నిబంధనల వల్ల ఎయిర్‌టెల్ ఖాతాదారులు మరో నెట్‌వర్క్‌కు మారే (పోర్టబులిటీ) అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రిలయన్స్ జియో రాకతో కుదేలైన టెలికం కంపెనీలు తమ ఖాతాదారులు చేజారిపోకుండా ప్లాన్లు ప్రకటిస్తున్న సమయంలో ఎయిర్‌టెల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఖాతాదారులకు మింగుడుపడడం లేదు.

వొడాఫోన్ సంస్థ కూడా ఇదే నిర్ణయం

వొడాఫోన్ సంస్థ కూడా ఇదే నిర్ణయం

త్వరలోనే వొడాఫోన్ సంస్థ కూడా ఇదే నిర్ణయం తీసుకోబోతుందన్న ప్రచారం జరుగుతోంది. కానీ దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అయితే ఎయిర్‌టెల్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ సంస్థకే చేటు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మరింతమంది ఎయిర్‌టెల్ కస్టమర్స్ జియో వైపు మళ్లే అవకాశం ఉందంటున్నారు.

వింక్ మ్యూజిక్ యాప్ ద్వారా ఉచిత కాలర్ ట్యూన్స్
 

వింక్ మ్యూజిక్ యాప్ ద్వారా ఉచిత కాలర్ ట్యూన్స్

అయితే షాక్ ఇస్తూనే మరో శుభవార్తను అందించింది. జియో ఉచిత కాలర్ ట్యూన్స్‌ నేపథ్యంలో ఎయిర్‌టెల్ కూడా వారి కస్టమర్లకు ఉచితంగానే కాలర్ ట్యూన్స్ అందిస్తోంది. దీంతో ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్లు నచ్చిన పాటను కాలర్ ట్యూన్‌గా పెట్టుకోవచ్చు. ఎయిర్‌టెల్‌కు చెందిన యూజర్లు వింక్ మ్యూజిక్ యాప్ ద్వారా ఉచిత కాలర్ ట్యూన్స్ పొందొచ్చు. హెలో ట్యూన్స్ మార్చుకోవచ్చు. వింక్ యాప్‌లో 15 భాషలకు చెందిన 10 లక్షల పాటలు ఉన్నాయి.

 వింక్ మ్యూజిక్ యాప్‌ను డౌన్‌లోడ్

వింక్ మ్యూజిక్ యాప్‌ను డౌన్‌లోడ్

యూజర్ల ఉచిత కాలర్ ట్యూన్ కావాలని భావిస్తే వింక్ మ్యూజిక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి ఇన్‌స్టాల్ చేసుకోండి. ఎయిర్‌టెల్ యూజర్లు వింక్ మ్యూజిక్ యాప్‌ను ఓపెన్ చేయగానే ఉచిత హెలో ట్యూన్స్‌కు సంబంధించిన పాపప్ మెసేజ్ వస్తుంది. దీని సాయంతో ఫ్రీ కాలర్‌ ట్యూన్ సెట్ చేసుకోవచ్చు. అలాగే కాలర్ ట్యూన్‌ మార్చుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Airtel won't allow incoming calls anymore after 7 days of validity expiry, forces subscribers to recharge

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X