ఆపిల్ వాచ్‌లో ఎయిర్‌టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!

|

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ యాజమాన్యంలోని మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ Wynk మ్యూజిక్ ఇప్పుడు ఆపిల్ వాచ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ మ్యూజిక్ యాప్ ఆప్షనల్ ఇన్-యాప్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. ఇది వినియోగదారులు తమ డివైజ్ స్టోరేజ్‌లో వారికి నచ్చిన పాటలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అనుమతిని ఇవ్వడమే కాకుండా వారు కోరుకున్నప్పుడు సంగీతాన్ని ప్లే చేయడానికి కూడా అనుమతిని ఇస్తుంది. వినియోగదారులు ఆపిల్ వాచ్ లో Wynk మ్యూజిక్ యాప్ ప్లాట్‌ఫారమ్‌లో సంగీతాన్ని లేదా ఏదైనా ఇతర ఆడియోను నేరుగా ప్లే చేయడం కోసం వారి ఐఫోన్ ని తాకాల్సిన అవసరం లేకుండా నియంత్రించగలరని నిర్ధారిస్తుంది. ఇంకా డౌన్‌లోడ్ చేయబడిన పాటలు మరియు ప్లేజాబితాలను నేరుగా ఆపిల్ వాచ్ నుండి యాక్సెస్ చేయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్

ఎయిర్‌టెల్ యాజమాన్యంలోని మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ Wynk మ్యూజిక్ యొక్క సబ్‌స్క్రిప్షన్ నెలకు రూ.120 ధర వద్ద అందుబాటులో ఉంది. వినియోగదారులు వారి కొనుగోలు నిర్ధారణ సమయంలో వారి ఐట్యూన్స్ అకౌంట్ ద్వారా ఛార్జీ విధించబడుతుంది. ఐట్యూన్స్ ద్వారా సబ్‌స్క్రిప్షన్ ప్రస్తుత సబ్‌స్క్రిప్షన్ వ్యవధి ముగియడానికి కనీసం 24 గంటల ముందు మాన్యువల్‌గా రద్దు చేయబడే వరకు ప్రతి నెలా పునరుద్ధరించబడుతుంది.

ఎయిర్‌టెల్ Wynk మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌

ఎయిర్‌టెల్ Wynk మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌

ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ అందించే Wynk మ్యూజిక్ అనేది భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్. దీనిని ఎయిర్‌టెల్ కస్టమర్‌లకు ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్‌తో నెలకు రూ.60 ధర వద్ద అందిస్తుంది. అయితే ఇతరులకు ఈ సబ్‌స్క్రిప్షన్‌ను రూ.120 నెలవారీ ప్రాతిపదికన అందిస్తుంది. వినియోగదారులు మొదటి నెల సబ్‌స్క్రిప్షన్‌ను ఉచిత ట్రయల్‌గా అందించబడుతుంది. అలాగే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో వినియోగదారులు తమకు కావలసినన్ని పాటలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఎయిర్‌టెల్ Wynk మ్యూజిక్
 

ఎయిర్‌టెల్ Wynk మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లో సుమారు 2.8 మిలియన్లకు పైగా పాటలు ఉన్నాయి. ఇది అంతర్జాతీయ మరియు భారతీయ సంగీతం రెండింటి కలయికతో ఉంటాయి. ఆడియో డెలివరీ నాణ్యత అనేది 320/256 Kbps వద్ద ఉంటుంది. వినియోగదారులు ప్రయాణ సమయాలలో Wynk మ్యూజిక్ ద్వారా తమకు నచ్చిన పాటలను వినడానికి అనుమతిని ఇస్తుంది. Wynk మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లో మూడ్‌లలో ప్రత్యేకంగా నిర్వహించబడిన ప్లేజాబితాలను కూడా అందిస్తుంది. అన్నింటికంటే ఉత్తమమైనది ఎయిర్‌టెల్ వినియోగదారులు తమకు నచ్చిన ఏదైనా పాటను కాలర్ రింగ్ బ్యాక్ టోన్‌గా కూడా సెట్ చేయడానికి కూడా Wynk మ్యూజిక్ ని ఉపయోగించవచ్చు. ఈ యాప్‌తో హిందీ మరియు ఆంగ్ల భాషలలో పరస్పర చర్య చేయడానికి మద్దతు ఉంది. వినియోగదారులు తమకు ఇష్టమైన సంగీతం మరియు పాడ్‌క్యాస్ట్‌లను సౌకర్యవంతంగా వినడానికి ఇవన్నీ ఇప్పుడు ఆపిల్ వాచ్ లో అందుబాటులో ఉంటాయి.

Best Mobiles in India

English summary
Airtel Wynk Music Streaming Platform Access Now Available on Apple Watch

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X