Home
News

40 ల‌క్ష‌ల పాట‌ల‌ు, వీడియోల‌ు, Airtel వింక్ ట్యూబ్ మ్యూజిక్‌లో

ఎయిర్‌టెల్ వినియోగదారుల‌కు కంపెనీ అదిరిపోయే శుభ‌వార్త‌ను అందించింది. వింక్ ట్యూబ్ మ్యూజిక్‌, వీడియో స్ట్రీమింగ్ యాప్‌ను త‌న క‌స్ట‌మ‌ర్ల కోసం ఎయిర్‌టెల్ కొత్త‌గా లాంచ్ చేసింది. క‌స్ట‌మ‌ర్ల‌కు ఈ యాప్‌

ఎయిర్‌టెల్ వినియోగదారుల‌కు కంపెనీ అదిరిపోయే శుభ‌వార్త‌ను అందించింది. వింక్ ట్యూబ్ మ్యూజిక్‌, వీడియో స్ట్రీమింగ్ యాప్‌ను త‌న క‌స్ట‌మ‌ర్ల కోసం ఎయిర్‌టెల్ కొత్త‌గా లాంచ్ చేసింది. క‌స్ట‌మ‌ర్ల‌కు ఈ యాప్‌ సేవ‌ల‌ను ఉచితంగా అందిస్తున్న‌ది. యూట్యూబ్ మ్యూజిక్‌, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ త‌దిత‌ర మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌ల‌లాగే వింక్ ట్యూబ్ మ్యూజిక్, వీడియో స్ట్రీమింగ్ యాప్‌ ప‌నిచేస్తుంది. ఇందులో 40 ల‌క్ష‌ల పాట‌ల‌ను, వీడియోల‌ను అందుబాటులో ఉంచారు. ప్ర‌స్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై మాత్ర‌మే ల‌భిస్తున్న‌ది.

40 ల‌క్ష‌ల పాట‌ల‌ు, వీడియోల‌ు, Airtel వింక్ ట్యూబ్ మ్యూజిక్‌లో

త్వ‌రలోనే ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై కూడా ఈ యాప్‌ను లాంచ్ చేయ‌నున్నారు. ఇక ఈ యాప్‌లో హిందీ, పంజాబీ, భోజ‌పురి భాష‌ల‌కు చెందిన పాట‌లు, వీడియోల‌ను మాత్ర‌మే ప్ర‌స్తుతం అందుబాటులో ఉంచారు. త్వ‌ర‌లో తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌రాఠీ త‌దిత‌ర 12 భార‌తీయ భాష‌ల‌కు చెందిన పాట‌లు, వీడియోల‌ను అందుబాటులో ఉంచ‌నున్నారు.

వింక్ యాప్ ధర, ఇతర వివరాలు

వింక్ యాప్ ధర, ఇతర వివరాలు

Airtel నుంచి వచ్చిన వింక్ యాప్ ఎయిర్‌టెల్‌ యూజర్లకి ఉచితంగా లభిస్తోంది. అదే ఇతర టెలికం యూజర్లకు అయితే 30 రోజుల పాటు ఉచితంగా లభిస్తుంది ఆ తర్వాత దానికి అమౌంట్ పేచేయాల్సి ఉంటుంది.నెలకి రూ.99 చొప్పున పే చేసి దీని సేవలు పొందవచ్చు. దీని సైజు కూడా చాలా తక్కువ. కేవలం 5ఎంబి మాత్రమే ఉంటుంది.ఆండ్రాయిడ్ ఫోన్స్ ఆండ్రాయిడ్ డో మోడల్స్ లోనూ ఈ యాప్ పనిచేస్తుంది. ఆసక్తి కలిగిన వారు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ ఆఫర్లు

ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ ఆఫర్లు

ఇదిలా ఉంటే ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ పేరుతో కొత్త పోగ్రాంను ప్రారంభించింది. ఈ ప్రోగ్రాం ద్వారా విభిన్న సేవలు, అలాగే కస్టమర్లకు వినూత్న అనుభవం ఇచ్చేలా విస్తృతం చేసేందుకు కంపెనీ సంసిద్ధమైంది. ఎయిర్‌టెల్‌ధ్యాంక్స్‌ ద్వారా మరింత కంటెంట్‌, డివైజ్‌, సెక్యూరిటీ, వాణిజ్య సేవలు, వీఐపీ కస్టమర్‌ కేర్‌, టాప్‌ బ్రాండ్స్‌ నుంచి వినూత్న ఆఫర్లను కస్టమర్ల ముందుకు తీసుకువస్తున్నట్టు ఎయిర్‌టెల్‌ పేర్కొంది.

థ్యాంక్స్‌ ప్రోగ్రాంలో భాగంగా

థ్యాంక్స్‌ ప్రోగ్రాంలో భాగంగా

టెలికాం పరిశ్రమలోనే తొలిసారిగా థ్యాంక్స్‌ ప్రోగ్రాంలో భాగంగా ప్రీపెయిడ్‌ కస్టమర్లకు అమెజాన్‌ ప్రైమ్‌ ప్రయోజనాలను అందిస్తోంది. రూ 299కే అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌తో పాటు, రోజుకు 2.5 జీబీ డేలా, 28 రోజుల పాటు అపరిమిత కాల్స్‌ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చేలా ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ను రీడిజైన్‌ చేసినట్టు సంస్ధ తెలిపింది.

రూ.48, రూ.98 మరియు రూ. 119 రీఛార్జ్ ప్లాన్స్‌

రూ.48, రూ.98 మరియు రూ. 119 రీఛార్జ్ ప్లాన్స్‌

ఎయిర్‌టెల్ కొత్తగా రూ.48, రూ.98 రీఛార్జ్ ప్లాన్స్‌ని రూపొందించడం విశేషం. రూ.48 రీఛార్జ్ చేసుకుంటే 28 రోజులకు 3 జీబీ డేటా లభిస్తుంది. రూ.98 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజులకు 10 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 10 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా వాడుకోవచ్చు. ఈ ప్లాన్స్‌తో వాయిస్ కాల్ బెనిఫిట్స్ రావు.

ఎయిర్టెల్ తాజాగా రూ.99,రూ.119 ప్లాన్ గా రివైజ్ చేసింది.ఈ ప్లాన్లు రీఛార్జి చేసుకున్న వినియోగదారుడికి 2 జీబీ డేటా తో పాటు 300 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు మాత్రమే.రూ.119 ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికొస్తే ఈ ప్లాన్ ఒక్కో సర్కిల్‌లో ఒక్కో ప్రయోజనాన్ని అందిస్తోంది. ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రం 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 300 ఎస్సెమ్మెస్‌లను 28 రోజుల కాలపరిమితితో అందిస్తున్నట్టు ఎయిర్‌టెల్ తెలిపింది. కొందరు యూజర్లకు మాత్రం 1జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 300 ఎస్సెమ్మెస్‌లు 14 రోజుల కాలపరిమితితో అందిస్తున్నట్టు తెలిపింది. అయితే, వాయిస్ కాల్స్ విషయంలో ఎటువంటి ఎఫ్‌యూపీ నిబంధన లేదు. అయితే, 2 జీబీ డేటా ప్రయోజనాలు మాత్రం కొందరు యూజర్లకే అందుతున్నాయి

 

వొడాఫోన్ ప్లాన్స్

వొడాఫోన్ ప్లాన్స్

ఈ ఏడాది ప్రారంభంలో వొడాఫోన్ రూ.119 ప్లాన్ ప్రారంభించింది. రూ.119 రీఛార్జ్ చేసుకుంటే 180 రోజుల వ్యాలిడిటీ, 1 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం వొడాఫోన్ రూ.139 ప్లాన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీ, 5 జీబీ డేటా లభిస్తుంది. ఇక వొడాఫోన్‌కు చెందిన రూ.159 ప్లాన్‌లో 28 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు నెల రోజులకు లభిస్తాయి.

Best Mobiles in India

English summary
Airtel Wynk Tube Music and Video streaming app launched, free for Airtel users
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X