100mbps అధిక వేగంతో Airtel Xstream AirFiber కొత్త ప్లాన్లు! ప్లాన్ల వివరాలు
దేశంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతీ ఎయిర్‌టెల్ తన 5G FWA (ఫిక్స్‌డ్-వైర్‌లెస్ యాక్సెస్) సేవలను నెమ్మదిగా విస్తరిస్తోంది. ప్రస్తుతం, ఇది రాజ్‌కోట్, కోల్‌కతా, ఢిల్లీ, నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్ మరియు గుర్గావ్‌లతో సహా ఏడు నగరాల్లో అందుబాటులో ఉంది. 5G FWA కు డిమాండ్ పెరగడంతో దీనిని ఇతర నగరాలకు నెమ్మదిగా విస్తరించాలని సంస్థ ఆలోచిస్తోంది.
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ సేవలు వినియోగదారులకు చాలా పరిమిత ప్లాన్‌లను అందిస్తోంది. ఇందులో మూడు ప్లాన్ల ఆప్షన్ మాత్రమే ఉంది. ఇంతకు ముందు, కేవలం ఒక ప్లాన్ మాత్రమే ఉంది, దీని ధర నెలకు రూ. 699 మరియు 40 Mbps స్పీడ్‌ను అందించింది. అయితే, ఇప్పుడు మూడు ప్లాన్‌లు ఉన్నాయి, కొత్తగా వచ్చిన రెండు కొత్త ప్లాన్‌లు 100 Mbps స్పీడ్‌ని అందిస్తాయి.

ఈ 100 Mbps ప్లాన్‌లు రెండూ ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. రెండు 100 Mbps ప్లాన్‌లతో మీరు ఏమి బెనిఫిట్ లు పొందుతారనే దాని గురించిన పూర్తి వివరాలు ఇక్కడ ఇస్తున్నాము .
Xstream AirFiber రూ. 799 ప్లాన్ వివరాలు
ఈ రూ. 799 ప్లాన్ 100 Mbps వేగంతో వస్తుంది మరియు వినియోగదారులకు 1TB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్లో బండిల్ చేయబడిన OTT (ఓవర్-ది-టాప్) ప్రయోజనాలు ఏవీ లేవు మరియు ఇన్‌స్టాలేషన్ ఛార్జీ రూ. 1000 గా ఉంటుంది. కస్టమర్‌లు ఈ ప్లాన్‌ని ఆరు లేదా పన్నెండు నెలల వరకు మాత్రమే కొనుగోలు చేయగలరు. కస్టమర్ 12 నెలల ప్లాన్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంటే, ఇన్‌స్టాలేషన్ ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు.
Xstream AirFiber రూ. 899 ప్లాన్ వివరాలు
Xstream AirFiber యొక్క రూ. 899 ప్లాన్ 100 Mbps వేగం, 1TB డేటా మరియు OTT ప్రయోజనాలతో పాటు వినియోగదారులు లీనియర్ టీవీని చూడటానికి ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో వస్తుంది. Xstream బాక్స్ అనేది కంపెనీ యొక్క DTH (డైరెక్ట్-టు-హోమ్) విభాగం అందించే స్మార్ట్ STB (సెట్-టాప్ బాక్స్).
ఇందులో OTT ప్రయోజనాలతో Xstream Play మరియు డిస్నీ+ హాట్ స్టార్ కూడా ఉన్నాయి. వినియోగదారులు 350+ HD|SD TV ఛానెల్‌లను కూడా పొందుతారు. ఇందులో కూడా, వినియోగదారులు 12-నెలల ప్లాన్‌ను కొనుగోలు చేస్తే, ఇన్‌స్టాలేషన్ ను ఉచితంగా పొందుతారు.
ఇవి కాకుండా, భారతీ ఎయిర్‌టెల్ ఇటీవల Xstream Play ప్రీపెయిడ్ ప్లాన్‌లను (Airtel prepaid plans) ఆవిష్కరించింది. ఈ ప్లాన్లతో OTT సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌ల అన్‌లిమిటెడ్ 5G డేటాతోపాటు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ ప్లాన్‌ల ధరలు రూ.359 నుంచి రూ.1,499 ధరల మధ్య ఉన్నాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.


Click it and Unblock the Notifications