ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ కొనుగోలు మీద రూ.1500 తగ్గింపు పొందే గొప్ప అవకాశం...

|

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ అనేది భారతి ఎయిర్‌టెల్ అందించే ఆండ్రాయిడ్ టివి సెట్-టాప్ బాక్స్ (STB). దీనిని సాధారణంగా రూ.2,499 ధరకు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. అయితే వినియోగదారులు ఆపరేటర్ నుండి ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను కొనుగోలు చేస్తే రూ.1,500లను భద్రత కోసం తిరిగి పొందవచ్చు. కానీ ఈ ఆఫర్ క్రొత్త వినియోగదారులకు మాత్రమే పరిమితం కాకుండా ప్రస్తుతం ఉన్న ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యూజర్లు కూడా రూ.1,500 పూర్తిగా తిరిగి చెల్లించదగిన రేటుతో బాక్స్‌ను పొందవచ్చు. అయితే ఈ నిబంధనలు క్రొత్త వారి కంటే ఇప్పటికే ఉన్న వినియోగదారులకు కొద్దిగా భిన్నంగా ఉంటాయి.

ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌

అయితే ఇప్పటికే ఉన్న బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ మీద రూ.1,500 వాపసు డిపాజిట్ కోసం పొందాలనుకుంటే అతడు / ఆమె రూ.9999 లేదా అంతకంటే ఎక్కువ ధర వద్ద లభించే ప్లాన్ లతో రీఛార్జ్ చేసుకోవాలి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ నుండి రూ.999 ధర వద్ద లభించే ప్లాన్ వినియోగదారులకు 200Mbps అప్‌లోడ్ మరియు డౌన్‌లోడ్ వేగంతో లభిస్తుంది. అయితే డిపాజిట్‌ మొత్తంలో రూ.1,500 తిరిగి పొందడానికి గల నిబంధనల గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ డిపాజిట్ నిబంధనలు మరియు షరతులు

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ డిపాజిట్ నిబంధనలు మరియు షరతులు

ఎయిర్టెల్ కంపెనీ తన యొక్క వినియోగదారుల కోసం కొత్తగా ప్రకటించిన రూ.1,500 క్యాష్ బ్యాక్ మొత్తం ప్రతి ఒక్కరికి అందివ్వదు. ఇందుకోసం కొన్ని నిబంధనలను విధించింది. ప్రారంభ డిపాజిట్ మొత్తం తిరిగి పొందడానికి వినియోగదారులు కనీసం ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం కనెక్షన్‌ను ఉంచినప్పుడు మాత్రమే కంపెనీ వారికి ఈ మొత్తం పూర్తిగా అందిస్తుంది. 12 నెలల ముందు STB ని కంపెనీకి తిరిగి ఇచ్చే వినియోగదారులు వాపసు మొత్తాన్ని పొందటానికి అర్హులు కాదు. అంతేకాకుండా వినియోగదారులు అతను/ ఆమె వారి ఇళ్ళు / కార్యాలయాల నుండి కనెక్షన్‌ను తీసివేస్తున్నప్పుడు అన్‌ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు కూడా భరించవలసి ఉంటుంది.

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ధరల వివరాలు

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ధరల వివరాలు

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ కొనుగోలు భద్రతా డిపాజిట్ పైన వినియోగదారులు అదనంగా చెల్లించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ఛార్జీ STB ని యాక్టివేట్ చేయడానికి ఉంటుంది. STB ని చురుకుగా ఉంచడానికి కస్టమర్ సంస్థ యొక్క DTH ప్లాన్‌తో రీఛార్జ్ చేయవలసి ఉంటుందని గమనించండి. STB యాక్టివేషన్ కోసం వినియోగదారులు రూ.1,500 డిపాజిట్ మొత్తం మీద రూ.452 అదనంగా చెల్లించాలి. ఇది ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ కొనుగోలు మొత్తం ధర రూ.1,952 గా ఉంటుంది. అయితే సెకండరీ కనెక్షన్ అయితే NCF ఛార్జ్ తక్కువగా ఉన్నందున ప్లాన్ యొక్క అదనపు ఖర్చు రూ.452 నుండి 360 రూపాయలకు పడిపోతుంది. సెకండరీ కనెక్షన్ మొత్తం ధర రూ.1,860 అవుతుంది.

యాక్టివేషన్ ఛానల్ ప్యాక్ వినియోగదారులకు ఫ్రీ-టు-ఎయిర్ (FTA) ఛానెల్‌లు మరియు DD ఛానెల్‌లతో పాటు టన్నుల కొద్ది హెచ్‌డి ఛానెల్‌ల కలయికతో వస్తుంది. వినియోగదారులు తమ STB ని చురుకుగా ఉంచడానికి వారు సభ్యత్వం పొందిన టీవీ ప్లాన్‌ను మార్చే అవకాశం ఉంటుంది.

 

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఫీచర్స్

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఫీచర్స్

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఇతర పరికరాలకు కంటెంట్‌ను ప్రసారం చేయడానికి అంతర్నిర్మిత Chromecast తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ 9 ప్లాట్‌ఫామ్‌లో రన్ అవుతూ గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాయిస్ ఆదేశాలకు మద్దతు ఇస్తుంది. ఈ STB తో వినియోగదారులు తమ అభిమాన ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్‌ల నుండి కంటెంట్‌ను ప్రసారం చేయవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌లకు చందా ఛార్జీలు STB కొనుగోలు పరిధిలో ఉండవని గమనించండి. వినియోగదారులు చందా ఛార్జీలను విడిగా చెల్లించాలి.

ప్రస్తుతం ఇది కంపెనీ వెబ్‌సైట్‌లో రూ.2,499 కు అందుబాటులో ఉంది. అయితే వినియోగదారులు తమ కొనుగోలుపై అదనంగా 10% తగ్గింపు పొందడానికి 'ADTV10' కోడ్‌ను ఉపయోగించవచ్చు. కాబట్టి డిస్కౌంట్ కోడ్ ఉపయోగించిన తర్వాత ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ యొక్క ప్రభావవంతమైన ధర రూ.2,250 అవుతుంది.

 

Best Mobiles in India

English summary
Airtel Xstream Box Available at Rs.1500 Refundable For Existing Users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X