ఈ స్మార్ట్ టీవీ కొన్నవారికి ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ పై RS.500 తగ్గింపు

|

ప్రముఖ డిటిహెచ్ ఆపరేటర్ ఎయిర్‌టెల్ డిజిటల్ టివి స్మార్ట్ టివి తయారీదారులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఆపరేటర్ యొక్క సుబ్స్క్రిప్షన్ చందా, ఛానల్ ప్యాక్‌లు మరియు సెట్-టాప్-బాక్స్‌లపై డిస్కౌంట్లను అందిస్తుంది.

Airtel Xstream Box Gets RS.500 Discount for Selected Smart TV Buyers

హెచ్‌డి సెట్-టాప్-బాక్స్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌పై డిస్కౌంట్ ఇవ్వడానికి కంపెనీ ఇప్పుడు శామ్‌సంగ్ మరియు షియోమీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. షియోమి లేదా శామ్‌సంగ్ నుండి కొత్త స్మార్ట్ టివిని కొనుగోలు చేసే వినియోగదారులు ఇప్పుడు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ పై కొంత తగ్గింపు పొందవచ్చు.మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Airtel Xstream Box Gets RS.500 Discount for Selected Smart TV Buyers

డిస్కౌంట్ ఆఫర్ వివరాలు

ఎయిర్‌టెల్ ఇటీవల ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను విడుదల చేసింది. ఇది సాటిలైట్ టీవీ మరియు OTT ప్లాట్‌ఫారమ్‌లను కలిపే హైబ్రిడ్ సెట్-టాప్-బాక్స్. దీని యొక్క ధర 3,999 రూపాయలు. కానీ శామ్‌సంగ్ లేదా షియోమి స్మార్ట్ టీవీ కొన్నవారు దాని మీద ఉన్న ఆఫర్‌తో మీరు దీన్ని రూ.3,499ల తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.500 చక్కని తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటు యూజర్లు మూడు నెలల ఉచిత ఛానల్ ప్యాక్‌కు కూడా యాక్సిస్ పొందవచ్చు.

Airtel Xstream Box Gets RS.500 Discount for Selected Smart TV Buyers

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ స్పెసిఫికేషన్స్

ఈ బాక్స్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 2GB RAM మరియు 8GB స్టోరేజ్ తో లభిస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ మద్దతుతో 128GB వరకు మెమొరీని పొందవచ్చు. దీనికి USB థంబ్ డ్రైవ్ లేదా HDD ని కూడా కనెక్ట్ చేయవచ్చు. దాని కోసం రెండు యుఎస్‌బి 2.0 పోర్ట్‌లు ఉన్నాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌లో HDMI 2.0 పోర్ట్, కాంపోజిట్ అవుట్‌పుట్ మరియు SPDIF పోర్ట్ కూడా ఉన్నాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఇందులో Wi-Fi మరియు ఈథర్నెట్ రెండింటి మద్దతును కలిగి ఉంది. అంతేకాకుండా ఇందులో అంతర్నిర్మిత క్రోమ్ కాస్ట్ మరియు బ్లూటూత్ మద్దతు కూడా ఉంది.

Airtel Xstream Box Gets RS.500 Discount for Selected Smart TV Buyers

యాప్స్ మద్దతు

ఈ బాక్స్ ఆండ్రాయిడ్ టీవీ OS (ఆండ్రాయిడ్ 9 పై) మద్దతుతో రన్ అవుతుంది. మీరు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా 6,000 కి పైగా అనుకూల యాప్ లు మరియు గేమ్ లకు పూర్తి యాక్సిస్ ను పొందుతారు. స్ట్రీమింగ్ బాక్స్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ZEE5, Altబాలాజీ, గూగుల్ ప్లే మూవీస్ వంటి మరిన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లకు మద్దతు ఇస్తుంది.

Airtel Xstream Box Gets RS.500 Discount for Selected Smart TV Buyers

సుబ్స్క్రిప్షన్ ఛార్జ్

ప్యాకేజీలో భాగంగా మీరు ఎక్స్‌స్ట్రీమ్ యాప్ కి ఒక సంవత్సరం పాటు కాంప్లిమెంటరీ చందాను ఫ్రీగా పొందుతారు. దీని ధర సాధారణంగా రూ.999గా ఉంటుంది. అంతేకాకుండా రూ .207ల విలువైన ఒక నెల హెచ్‌డి డిటిహెచ్ ప్యాక్‌ చందా కూడా ఉచితంగా లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Airtel Xstream Box Gets RS.500 Discount for Selected Smart TV Buyers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X